Tulasi: తులసి ఆకుల మాల విష్ణుమూర్తికి చాలా ఇష్టం. చాలామంది తులసి ఆకులతో మాలలల్లి సమర్పిస్తారు. హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కను నిత్యం పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, విష్ణువుకి ఇష్టమైన మొక్క తులసి మొక్క కావడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవాలనుకునేవారు తూర్పు దిశలో పెట్టాలి. ఇంకా ఈశాన్యం దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు కూడా అందించాలి. తులసి మొక్క నుండీ ఆకులను తెంచే సమయంలో కొన్ని నియమాలను పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తెంపి పొరపాటు చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తులసి ఆకులను తెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే దరిద్రం పట్టి వదలకుండా వేధిస్తుంది. పొరపాటున కూడా స్నానం చేయకుండా తులసి ఆకులను ముట్టుకోకూడదు. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత, లక్ష్మీదేవిని ధాన్యం చేసి, నమస్కరించి, తులసి ఆకులను తెంచడానికి తల్లి అనుమతిని కోరి ఆపై ఒక్కొక్క ఆకుగా తులసి ఆకులను తెంచాలని సూచించబడింది. మాంసాహారం భుజించి పొరపాటున కూడా తులసి మొక్క పైన చెయ్యి వెయ్యకూడదు. అంతేకాదు పొరపాటున కూడా ఆదివారం రోజు, ఏకాదశి రోజు, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రోజులలో తులసి ఆకులను తెంచకూడదు.
సూర్య సమయం తర్వాత కూడా తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలోనూ తెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ అలా సూర్యస్తమయం అయిన తరువాత తులసి ఆకులను తెంచితే అది అశుభమైందిగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తెంచేటప్పుడు చేతితో తెంచాలి కానీ గోళ్ళతో తులసి ఆకులను గిల్లకూడదు. ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తులసి ఆకులను తెంచేటప్పుడు ఒకేసారి కొమ్మలు, కొమ్మలుగా విరచకూడదు. ఒక్కొక్క ఆకుని మాత్రమే తెంచాలి…