Rahu Ketu: గ్రహాల కదలికలో మార్పులు మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నెమ్మదిగా కదిలే గ్రహాలైన శని, రాహు, కేతువు 2023వ సంవత్సరంలో తమ రాశులను మార్పులు చేస్తున్నాయి. సంవత్సరంన్నర కి ఒకసారి రాహు, కేతువులు తమ రాశులను మారుస్తాయి. ఇవి ఎల్లప్పుడూ తిరుగమన దిశలో సంచరిస్తాయి. ఈ రెండు గ్రహాలు అక్టోబర్ 30న తమ రాశులను మార్చుకోనున్నాయి. రాహువు మేషరాశిలోనూ, కేతువు తులా రాశిలోనూ ప్రవేశించనున్నారు.. రాహు కేతు సంచారం వలన ఏ రాశుల వారు వారికి మంచి జరగనుందో ఇప్పుడు చూద్దాం..

రాహు కేతు సంచారం ఈ రాశులకు మంచిది.
వృషభం
ఈ రాశి వారికి కేతు సంచారం చాలా శుభప్రదమైనది. ఇప్పటివరకు వీరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి.. వీరు ఒక మంచి శుభవార్తను వింటారు. వీరు అపారమైన సంపదని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిలో పురోగతి సాధిస్తారు.
సింహరాశి
కేతువు యొక్క రాశి మార్పు వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది . ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. సంబంధాలు మెరుగవుతాయి. మీకు పదవి, డబ్బుతో పాటు గౌరవం కూడా లభిస్తుంది.
ధనస్సు
కేతు సంచారం ధనస్సు రాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కెరియర్ లో గొప్ప విజయాలు అందుకుంటారు.
మకరం
కేతు సంచారం మకర రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇస్తుంది. భారీగా ధనార్జన ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది.