Astrology: జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో మూడు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. వాటిలో శుక్రగ్రహం ఒకటి. ఫిబ్రవరి 15న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మీనరాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. వీరి కలయిక ప్రభావం మే నెల వరకు ఉంటుంది. మీనంలో శుక్రుడి గోచారం వల్ల ఈ రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

మేషరాశి
ఈ వారికి గురు, శుక్రుల కలయిక అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం తాండవిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మిగతా సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బాకీలు వసూలవుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక తీరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను అందుకుంటారు. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
మీనరాశి
ఈ రాశిలోనే గురు, శుక్రుల కలయిక ఏర్పడనుంది. ఫలితంగా మీనరాశి వారి అదృష్టం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్నవన్నీ అనుకూలిస్తాయి. వీరి అన్నివిధాలా శ్రేయస్కరం.