NewsOrbit
దైవం

Shani Gochar 2023: కుంభ రాశిలో ఆరంభమైన శని సంచారం .. ఈ నాలుగు నాలుగు రాశుల వారికి ఇబ్బందులే ఉండవు

Shani Gochar 2023:  శని భగవానుడు మకరం నుండి తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజు (జనవరి 17న) కుంభరాశిలో శని సంచారం మొదలు అయ్యింది. ఈ రాశి వారిపై శని .. రెండవ అర్ధభాగం ప్రారంభం అయినట్లు అయ్యింది. శనీశ్వరుడికి మకరం, కుంభం సొంత రాశులు. అందుకే ఈ రాశులకు శనీశ్వరుడు అధిపతిగా పేర్కొంటారు. జోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడి సంచారం ఎల్లప్పుడూ చాలా ప్రధానమైనది. ఎందుకంటే .. నవగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం శనీశ్వరుడు. ఆయన ఒక రాశి నుండి మరొక రాశి లోకి రావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క రాశిలో శనీశ్వరుడు సుమారు రెండున్నరేళ్లు ఉంటాడు. ఆ విధంగా మొత్తం రాశుల్లో ఒక రౌండ్ పూర్తి చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఆ క్రమంలో 30 సంవత్సరాల తర్వాత శనీశ్వురుడు కుంభరాశిలో సంచారం ఆరంభం అయ్యింది. శని సంచారం అనేక రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

Shani Gochar 2023

 

శని సంచారం సమయంలో శష మహాపురుష యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి శని దశ నుండి విముక్తి లభించనుంది. మరి కొన్ని రాశుల శని సాడే సతి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఆ రాశుల వారు వృత్తి, వ్యాపారాల్లో ఇతర రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. శని సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Cancer

 

కర్కాటక రాశి

ఈ రాశి వారికి కుంభంలోకి శని సంచారం చేసిన తర్వాత పెద్దగా ఇబ్బందులు ఉండవని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వీరికి లాభదాయకమైన అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ కాలంలో ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఊహించిన విధంగా వేతనం అందుతుంది. వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

Taurus

వృషభ రాశి

ఈ రాశి వారికి శని సంచారం కారణంగా మంచి ఫలితాలు రానున్నాయి. ఇప్పటి నుండి ఏడాది పొడవునా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు లాభాలను పొందుతారు. ఉద్యోగులకు తమ కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. వీరి కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది.

Aquarius

కుంభ రాశి

కుంభరాశి లోకి శనీశ్వురుడు రాకతో శని సాడే సతి రెండో దశ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ మొత్తంగా చూసినట్లయితే కుంభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయని అంటుంటారు. ఈ ఏడాది ఈ రాశుల వారు పని చేసే రంగంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని జోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో వీరు కొన్ని తీర్దయాత్రలకు వెళ్లవచ్చు. వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Pisces

మీన రాశి

కుంభ రాశిలోకి శని సంచారం కారణంగా ఈ రాశి వారికి శని సాడే సతి ప్రారంభం అవుతుంది. అయితే ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మత పరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరో పక్క వీరికి ఆదయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో బాద్యతలు పెరుగుతాయి. వీరు కొంత మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ఈ కాలంలో కొన్ని శుభ కార్యాలు నిర్వహిస్తారు.

Sri Dharbaranyeswara Swamy Temple: శని ప్రభావం నుండి విముక్తి పొందాలంటే .. ఈ పురాతన క్షేత్రాన్ని సందర్శిస్తే చాలు
గమనిక: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు, జోతిష్య శాస్త్రంపై మనుషులకు ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని అందించాం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju