Spices: సుగంధ ద్రవ్యాలుగా పిలవబడే మసాలా దినుసులు వంటకు రుచిని అందిస్తుంది అనుకుంటే పొరపాటే.. ఆధ్యాత్మిక పరంగా, వైద్య పరంగా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి ఆహారానికి రుచినివ్వడమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా క్రియేట్ చేస్తాయి. హ్యాండ్ బ్యాగ్ లేదా మీ వాలెట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తిని తొలగించేందుకు సహకరిస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మీ దగ్గర పెట్టుకుంటే మీ వెంట ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సోంపు , లవంగం
సోంపు, లవంగం వీటిని సాధారణంగా తలుపు లేదా గుమ్మానికి చిన్న మూట కట్టిపడతారు. ఇవి దయ్యాలు, ఆత్మలని ఇంటికి దూరంగా ఉంచుతాయని నమ్ముతారు. అంతేకాకుండా సోంపు తలగడ కింద పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది. లవంగాన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల ప్రతికూర పరిస్థితులకు దూరంగా ఉంచుతుంది. సోంపు, లవంగం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి, ఆరోగ్యం, జ్ఞాపకశక్తి , ధైర్యం, దీర్ఘాయువు, బలం పెరుగుతాయని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూర్తి చేయడం వల్ల అదృష్టం, డబ్బు కలిసి వస్తాయని నమ్ముతారు.
దాల్చిన చెక్క
ఇది నీ పర్సులో పెట్టుకుంటే పొదుపు పెరిగేలాగా చేస్తుంది. మీకు ఆరోగ్యం, ప్రేమ, విజయం కలిగేలా చేస్తుంది. మీ పర్సులో దాల్చిన చెక్క పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది.
పుదీనా ఆకులు
ఈ ఆకులు మీ వాలెట్ లేదా డబ్బులు దాచుకునే చోట రెండు మూడు ఆకులు ఉంచుకుంటే మంచిది. ఈ ఆకుల వాసన మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు పెట్టే పెట్టుబడును విజయవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. సంపదలను పెంచుకోవడానికి పుదీనా ఆకుల రంగు డబ్బు నోట్లకి అయ్యేలా చూసుకుంటే మంచిదని చెబుతున్నారు.
యాలుకలు, నల్ల మిరియాలు
ఈ రెండింటిని తీసుకుంటే ఇంట్లో కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు. యాలకులు తింటే మనసుని శాంతపరిచే, గందరగోళం తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో మృతి అవకాశాలను ఆహ్వానించడానికి ఇవి తింటే మంచి ఫలితం ఉంటుంది.
గరం మసాలా
ఈ పొడి వేయడం వల్ల వంటలకు చక్కటి రుచిని అందిస్తుంది. మసాలా మీకు సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది. మసాలా ప్యాకెట్ మీ బ్యాగులో ఉంచుకోండి. లేదంటే ఈ పొడి ఇల్లు లేదా షాపు మూలల్లో చల్లుకోవాలి. ఇది విజయం వరించేలా అదృష్టం, డబ్బు తీసుకొస్తుంది అని నమ్మకం.