సూర్యప్రభ వాహనంలో శ్రీమయలప్పస్వామి !

సప్తగిరివాసుడు.. శ్రీశ్రీనివాసుడు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమహావిష్ణువు విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు కురవడం వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనంతో ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలు లభిస్తాయి. స్వామివారి సూర్యప్రభ వాహనసేవ భక్తులకు కనువిందు చేసింది.