ఆరో రోజు రాత్రి గజవాహనంలో శ్రీవారు !

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు.

శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం వేంకటపతిని హృదయంలో ఉంచి శరణాగతి చెందాలని ఈ వాహనసేవలోని ఆంతర్యం. స్వామివారిని గజవాహనంలో దర్శనం చేసుకున్నవారికి శ్రీలక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని, అదేవిధంగా సకల భయాల నుంచి రక్షణ వస్తుందని ప్రతీతి.