NewsOrbit
దైవం

దసరా రోజు ఏ పని చేసిన విజయం తథ్యం!

ప్రతి ఒక్కరు జీవితంలో విజయాలను కోరుకుంటారు. చాలాసార్లు ఓడిపోయి విజయం కోసం ఆరాటపడుతుంటారు. అటువంటి వారు విజయదశమినాడు తమ లక్ష్యాన్ని తిరిగి ప్రారంభిస్తే తప్పక దాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…

దేవి నవరాత్రులల్లో పదవరోజు పూర్ణాహుతి నిర్వహించే రోజు దశమి. ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రం రోజు. అంతేకాదు. స్థితికారకుడైన విష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే. శ్రవణంతో కూడుకున్న దశమినే విజయదశమిగా జరుపుకొంటారు. ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఆశ్వయుజ శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని ఆరాధిస్తారు.

ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయా అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది.

తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తప్పక వరిస్తుంది. దీనికి సంబంధించి చతుర్వర్గ చింతామణిగ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్ధ సాధకమైందని పండితులు పేర్కొంటున్నారు. ఎవరైనా తమకు భవిష్యత్‌లో విజయం కోసం ఏదైనా పని లేదా కార్యం ప్రారంభించాలనుకుంటే విజయదశమినాడు ప్రారంభిస్తే తప్పక ఆ లక్ష్యం నెరవేరుతుంది.

 

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju