దుర్గానవరాత్రుల్లో చివరిమూడురోజులు ఇలా !

దుర్గాదేవి నవరాత్రులు.. అత్యంత వైభంగా భక్తులంతా నిర్వహించుకుంటున్నారు. ఈ నవరాత్రులలో చివరిమూడు రోజులు అత్యత కీలకం. ఇప్పటివరకు నవరాత్రుల పూజలు నిర్వహించనివారు సైతం ఈమూడురోజులు కింద విధంగా పూజలు, అర్చనలు చేసుకుంటే అమ్మఅనుగ్రహం లభిస్తుంది ఆ వివరాలు…

అక్టోబర్ 23 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున సరస్వతీదేవి అలంకారం.
ఉదయం 6:20 – 7:05 , సాయంత్రం 5:39 – 6:20
నైవేద్యం – కదంబం ప్రసాదం.
అక్టోబర్ 24 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున దుర్గాష్టమి. ఈరోజు అలంకారం దుర్గాదేవి. ముహూర్తం: ఉదయం 7:38 – 8:59, మధ్యాహ్నం 11:28 – 12:14 , సాయంత్రం 5:37 – 7:11
నైవేద్యం – నిమ్మకాయ పులిహోర
అక్టోబర్ 24 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 – 8:59
అక్టోబర్ 25 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున మహిషాసురమర్దినీ అలంకారం. ఉదయం 8:45 – 9:15 , సాయంత్రం 6:12 – 6: 37
నైవేద్యం – చలివిడి,వడపప్పు,పానకం.
అక్టోబర్ 25 విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 – 11:57.
శమీ పూజ, ఆయుధ పూజలు ఉదయం 10:25 – మధ్యాహాన్నం- 12:14, అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 – 3:18, విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 – 2:32. విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 – 8:00 లేదా 26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 – 8:24 . ఇవి ప్రాంతాన్ని బట్టి కొన్ని నిమిషాలు తేడా ఉండవచ్చు. అక్కడి స్థానిక పండితుల సమయం ప్రకారం ఆయా పూజలు నిర్వహించుకోవాలి.