Devotional : బుధగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ (వెదురు చెట్టు)
బ్యాంబుట్రీ (వెదురు చెట్టు) అని కూడ అంటారు. ఇది ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇది నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది గా చెప్పబడింది. బుధుడు వ్యాపారవృద్ధి కారకుడు కాబట్టి ఇది వ్యాపార సంస్థలలో పెట్టుకుంటే వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి మార్గంలో వెళ్తుంటుంది. వ్యాపార సంస్థలలో ఉండే నరథిష్టికి, ఆకర్షణకు, వ్యాపార భివృథ్థికి ఇది ఒక మంచి పరిష్కారం. విద్యకి, వాక్ శుద్ధికి బుధుడు కారకుడుగా ఉంటాడు. ఈ చెట్టుని పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర పెడితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో చదివిన విద్య గుర్తుకు రావడం తో పాటు , క్రియేటివిటి పెరుగుతుంది. మంచి వాక్ ఫటిమ కలిగి చక్కని భావ ప్రకటన చేయగలడు. వెదురు మొక్క పెరిగే విధానాన్ని ప్రత్యక్షంగా చూడటం వలన మనకి కూడ జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే ఆలోచనలు కలుగుతాయి.
Devotional : ఏ దేవుడి కి చెందిన నామం చెబితే ఆ దేవుడు మాత్రమే ప్రసన్నమవుతాడు …
కానీ శ్రీ రామ అని జపిస్తే మాత్రం ఆరుగురు దేవతలు ప్రసన్నమవుతారు. అదెలాగో తెలుసుకుందాం.
శ్రీ రామ అంటే రాముడు నామం కాబట్టి రాముడు పలుకుతాడు.
రామ అనే నామం పలికిన చోట అందరికన్నా ముందు వచ్చి ఆ నామాన్ని విని పరవశించిపోయేది మాత్రం కచ్చితం గా హనుమంతుడే..
అదే విధం గా శ్రీ అంటే లక్ష్మి అమ్మవారు పలుకుతుంది.
“రా” అంటే విష్ణువు పలుకుతారు. అది ఎలా అంటే ఓం నమో నారాయణాయ అనే నామం లోనుండి రా అనే జీవ అక్షరం తీసుకోవడం జరిగింది.
“మ”అంటే శివుడు పలుకుతారు. అది ఎలా అంటే ఓం నమః శివాయ నామం లో నుండి మ అనే జీవ అక్షరం తీసుకోబడింది.శివుడు అంటే సగభాగం పార్వతి దేవిదేకదా..అప్పుడు అమ్మవారిని కూడా సంరించినట్టే కదా.
శ్రీ రామ అనినంత మాత్రాన రాముడు, హనుమాన్ , శ్రీ మహా లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఈ ఆరుగురు రక్షణ కల్పిస్తారు. కాబట్టి
అలాంటి నామ స్మరణ చేయడం మానకండి.