Zodiac Signs: ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక కోటీశ్వరులు కావాలనే.. అయితే ఈ ప్రాతిపదికన చూస్తే రాశి చక్ర గుర్తులు సంపదకు సంబంధించినవే అనే వాస్తవం నిరూపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు ప్రపంచాన్ని శాసించడంలో దిట్ట అని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా జ్యోతిష్యం, జాతకం , హస్త సాముద్రికం అనేది పాత పద్ధతులే అయినప్పటికీ వీటిని నమ్మకుండా విస్మరించడం చాలా కష్టం. ఇప్పటికి వీటిని నమ్మేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ముఖ్యంగా జ్యోతిష్యం, జాతకం నిజమవుతున్నాయని తరచూ ఆలోచించేవారు కూడా ఉంటారు.

నిజానికి ఒక వ్యక్తి పుట్టినరోజు .. అతని జీవితం, వ్యక్తిత్వం , వృత్తి, వివాహ అనుకూలత మొదలైన వాటిని ప్రభావతం చేస్తుంది. ప్రతిరోజు లక్షలాదిమంది తమ జన్మ కుండలి, రాశీ అంచనాలను చదువుతూ ఉంటారు. ఇకపోతే వేల సంవత్సరాల క్రితమే జ్యోతిష్యులు గ్రహాలను వాటి కదలికలను పక్కాగా అధ్యయనం చేయడమే కాకుండా వాటి ఆధారంగా జ్యోతిష్యాన్ని కూడా రూపొందించారు.. అంతేకాదు ఒక సర్వే విచిత్రమైన నిజాన్ని కూడా వెల్లడించింది యూకే రుణదాత క్యాష్ ఫ్లూట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చాలామంది బిలియనీర్ ఒకే రాశీ ని కలిగి ఉన్నారు అని స్పష్టం చేసింది.
2022 ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం 300 మంది బిలియనీర్లు వారి రాశిని లెక్కించడానికి అందుబాటులో ఉన్న పుట్టిన తేదీ సమాచారాన్ని ఉపయోగించి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రాశి చక్ర గుర్తులకు వీరంతా చెందినవారుగా గుర్తించారు పరిశోధనా ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఇతర రాసి చక్రం కంటే తులా రాశి ఎక్కువగా కనిపిస్తుంది. ఏకంగా 17 శాతం మంది తులా రాశికి చెందిన వాళ్లు ఇప్పుడు ప్రపంచంలో విలియనీర్లుగా కొనసాగుతున్నారు.