నవరాత్రుల్లో ఈ పూలతో పూజిస్తే ఫలితం ఇదే !

నవరాత్రులు.. అమ్మఅనుగ్రహం కోసం నిర్వహించే తొమ్మిదిరాత్రుల జాగరణ సమయం ఇది. అత్యంత పవిత్రమైన ఈరోజుల్లో ఎవరి శక్తి అనుసారం వారు అమ్మను ఆరాధించాలి. అయితే చివరి మూడురోజులు అత్యంత కీలకం. ఈరోజుల్లో అమ్మవారిని కింది చెప్పిన పూలతో ఆరాధిస్తే కలిగే ఫలితాలు తెలుసుకుందాం…

ఏడో రోజు – క్రిష్ణ కమలం.
నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని కలరాత్రి దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి క్రిష్ణ కమల పువ్వులతో పూజించాలి. ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా, ఒత్తిడి లేకుండా సాఫీగా సాగిపోతుంది.

ఎనిమిదో రోజు – అరేబియా జాస్మిన్..
నవరాత్రి వేళ ఎనిమిదో రోజు అమ్మవారిని మహా గౌరీ రూపంలో పూజిస్తారు. శివుడు తన తపస్సుతో సంతోషించి ఆమె ముందు కనిపించిన తర్వాత దుర్గాదేవి ఈ రూపాన్ని తీసుకుంది. ఈ దేవత ఆహారం తీసుకోకుండా కొన్నేళ్ల పాటు కఠినమైన తపస్సు చేసినందున ఆమె శరీరం నల్లగా మారింది. ఆ సమయంలో శివుడు ఆమెపై గంగజలాన్ని పోశాడు. అప్పుడే ఆమె తెల్లరంగులోకి మారిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి మొగ్గ పువ్వులను (అరేబియా జాస్మిన్) అర్పించి.. మహాగౌరిని పూజించాలి.

తొమ్మిదో రోజు.. చంపా పూలు
దుర్గా దేవి చివరి అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతను చంపా పూలతో పూజిస్తే.. మీకు దైవిక జ్ణానం, శక్తి, బలం, వివేకం వంటి లభిస్తాయి.
అయితే పైన చెప్పిన పూలు మీకు దొరకకపోతే.. మీరు దేవుళ్లను ఆరాధించలేరని కాదు.. ఈ పువ్వులంటే దేవతలు ఇష్టపడటం వల్ల మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. మీ దగ్గర దొరికేవాటిని మీ శక్తి ఉన్నంతలో తెచ్చి భక్తితో సమర్పిస్తే అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది.