చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం ఇదే !

చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు.

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో పెద్దలు, పండితులు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం..

గాయత్రీ మంత్రము అంటే…

“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.ఇలా చదవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.