బెజవాడ దుర్గగుడిలో మూడో రోజున అమ్మ వారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ‘‘ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాల’’తో ప్రకాశించే పంచముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లు తున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.