Subscribe for notification

Daily Horoscope ఆగష్టు 26th బుధవారం మీ రాశి ఫలాలు

Share

ఆగస్టు – 26- శ్రావణమాసం- శుక్లపక్షం- అష్టమి. సోమవారం.

 

మేష రాశి : ఈరోజు పెండింగ్‌ పనులు పూర్తిచేయండి !

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొండి. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి. దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్ధికసమస్యలు పెరుగుతాయి. కుటుంబ వేడుకలు, క్రొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి. కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. వ్యాపారభాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితో కలిసి నిలిచి పోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండిఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు.

రెమిడీ: మంచి ఆర్థిక జీవితం కోసం లక్ష్మీనారాయణులు ఆరాధన చేయండి.

వృషభ రాశి : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి !

ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.

రెమిడీ: మీ కుంటుం జీవితానికి ఆనందంగా ఉంచుకోవడానికి గోధుమ రంగుకుక్కలకు రొట్టెలను ఇవ్వండి.

 

మిథున రాశి : ఈరోజు ఉమ్మడి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టకండి !

ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు.- మరింకా మీరుకూడా సంతోషంగా ఒప్పుకుంటారు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చును. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. యోగా, ధాన్యం వంటి వాటితో కాలం గడపడం మంచి ఫలితాన్నిస్తుంది.

రెమిడీ:  ఇష్టదేవతరాధన, తులసి దగ్గర దీపారాధన ఆరోగ్యకరమైన జీవితాన్నిస్తుంది.

 

కర్కాటక రాశి : ఈరోజు వ్యాపారంలో లాభాలు !

సానుకూల దృక్పథం, వెలుగువైపునకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు. ఈరోజు వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. ఈ రోజు మీరు హాజరుకాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.

రెమిడీ:  గొప్ప ఆరోగ్యం కోసం తులసీ ఆరాధన, కషాయం స్వీకరణ చేయండి.

 

సింహ రాశి : ఈరోజు తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక సమస్యల పరిష్కారం !

చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. మీ గత పరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. ఈరాశికి చెందినవారు పొగాకుకు, మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి.

రెమిడీ: మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం సూర్యనమస్కారాలు చేయండి.

 

కన్యా రాశి : ఈరోజు మీ దగ్గరివారి నుంచి సహాయం అందుతుంది !

వ్యాపారాభివృద్ధి కొరకు మీరుకొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరివారి నుండి మీకు ఆర్ధిక సహాయము అందుతుంది. ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. మీ చుట్టుప్రక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసే వారికి మీ అభిప్రాయాలు చేరవేస్తే, లబ్దిని పొందుతారు. మీ అంకితభావానికి, నిజాయితీకి మెప్పు పొందుతారు. రెమిడీ: ఆరోగ్యకరమైన జీవితము కోసం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

 

తులా రాశి : ఈరోజు అనారోగ్యం నుంచి విముక్తి !

దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ప్రయోజనకరమైన రోజు. ఈరాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది,లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది.

రెమిడీ: మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం వేంకటేశ్వర  వజ్రకవచం పారాయణం చేయండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు ఒక వార్త సంతోషాన్నిస్తుంది !

త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీ ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. మంచి ఆహారం, చక్కని ఆనందకరమైన క్షణాల వంటివన్నీ ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి.

రెమిడీ: మీ వృత్తిలో అద్భుతమైన వృద్ధి పొందడానికి నల్లనేరుడు పండ్లను గణపతికి నైవేద్యంగా పెట్టండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు ధననష్టం సంభవించవచ్చు !

ఈరోజు ధననష్టం సంభవించవచ్చు. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. పనిచేసే చోట, ఇంటిలోను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును. ఈరోజు చాలా బాగుంటుంది. మీకొరకు మీరు బయటకువె ళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది.

రెమిడీ:  వృత్తి లో లాభాలు పొందడానికి రాహుకాలంలో శివాభిషేకం చేయండి.

 

మకర రాశి : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !

ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు. మీదగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.

రెమిడీ: ప్రశాంతత కోసం శ్రీవేంకటేశ్వరస్వామి గద్యం చదవండి లేదా వినండి.

 

కుంభ రాశి : ఈరోజు శుభవార్త వింటారు !

దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. ఆనందకరమైన రోజు ఈ రోజు.

రెమిడీ: కుటుంబ జీవితాన్ని మెరుగుపరచటానికి ఇంట్లో మీ ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

 

మీన రాశి : ఈరోజు సంపాదన శక్తి పెరుగుతుంది !

ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పనిలో లీనమవండి. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోవచ్చు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రెమిడీ:  ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీబుధ కౌశిక రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

 


Share
Sree matha

Recent Posts

Vijay Deverakonda Puri Jagannath: హీరో విజయ్ దేవరకొండకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్..??

Vijay Deverakonda Puri Jagannath: రౌడీ హీరో విజయ్ దేవరకొండకి(Vijay Deverakonda) కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి…

8 mins ago

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

1 hour ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

2 hours ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

3 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

4 hours ago