NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 14th సోమవారం రాశి ఫలాలు

Daily horoscope in telugu

డిసెంబర్ – 14 – కార్తీకమాసం – సోమవారం.సోమవతి అమావాస్య .శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్‌ఋతువు, కార్తీకమాసం, కృష్ణపక్షం, సోమవారం, తిథి: అమావాస్య రాత్రి 9.47 వరకు తదుపరి పాడ్యమి, నక్షత్రం: జ్యేష్ఠ రాత్రి 11.26 తదుపరి మూల, వర్జ్యం: ఉదయం 6.45 నుండి 8.12 వరకు, అమృత ఘడియలు: పగలు 3.27 నుండి 4.54 వరకు, రాహుకాలం: ఉదయం 8.01 నుండి 9.24 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.32 నుండి 1.17 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 2.45 నుండి 3.30 వరకు.

Daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఆనందంగా, ప్రశాంతంగా గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా సఫలం అవుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు విద్యార్థులు ఏ పని ప్రారంభించినా దానిలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు గణేష్ అష్టోత్తర పారాయణం చేసుకోండి శుభప్రదం గా ఉంటుంది.

 

వృషభ రాశి : నిరాశకు గురవుతారు !

ఈరోజు కొంచెం చికాకుగా ఉంటారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ఇబ్బంది పడుతారు. ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి. పనులు సకాలంలో పూర్తి కాక నిరాశకు గురవుతారు. ఈరోజు అనవసర ఖర్చులు చేయకండి. ఈరోజు క్రయవిక్రయాలలో నష్టం కలిగే అవకాశం ఉంది.  చెడు వార్త వినే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు  విద్య మీద అశ్రద్ధగా ఉండటం వలన ఇబ్బందులు పడతారు.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిథున రాశి : పెండింగ్ పనులను పూర్తి !

ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అందరితో కలిసిమెలసి ఉంటారు. ఈరోజు ఆగిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు, కష్టమైన పనులను కూడా ఈరోజు సులువుగా పూర్తి చేస్తారు. ఈరోజు మనోవేదన తగ్గుతుంది. ఈరోజు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి అనుకూలంగా ఉంటుంది.

 

కర్కాటక రాశి : ఈరోజు స్వల్ప లాభాలు !

ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు చేయకండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పులు ఇవ్వకండి. ఈరోజు పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఈరోజు వాదనలకు దూరంగా ఉండండి.

రెమిడీ:ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహ రాశి : ఈరోజు ఆకస్మిక ధన లాభం !

ఈరోజు ఆనందంగా గడుపుతారు. పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు పెడతారు. ఈరోజు రుణ బాధలు తగ్గుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి. ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఏ పని ప్రారంభించిన పూర్తి చేస్తారు. ఈరోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు కాలాన్ని వృధా చేసుకోకండి . వ్యాపారస్తులకు అనుకోని లాభం కలుగుతుంది.

రెమిడీ:ఈరోజు లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది.

 

కన్యా రాశి : ఈరోజు ధననష్టం !

ఈరోజు కొంచెం చికాకుగా ఉంటారు. ఈరోజు సంబంధం లేని విషయాల్లో తల దూర్చకండి. ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ధనాన్ని అతిగా ఖర్చు పెట్టకండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త. ధననష్టం  కలుగుతుంది. ఈరోజు చెడు స్నేహాల నుంచి దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు బిల్వదళ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

తులా రాశి : నూతన వ్యాపార అవకాశాలు !

ఈరోజు వాహన యోగం కలుగుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఈరోజు ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. నూతన వ్యాపార అవకాశాలు కలుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈరోజు మీ మాట తీరు తో అందరినీ ఆకట్టుకోగా గలుగుతారు. ఇరుగుపొరుగు వారితో సఖ్యత గా ఉంటారు. ఈరోజు దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు ధన లాభం కలుగుతుంది.

రెమిడీ:ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు రుణబాధలు !

ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఈరోజు తొందరపాటు తనం తో ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. బద్ధకం వల్ల ఇబ్బందులు పడతారు. ఈరోజు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. ఈరోజు పొదుపు చేయడాన్ని ప్రారంభిస్తారు. వ్యసనాల వల్ల ఇబ్బందులు పడతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు శ్రమకు తగిన ఫలితం అందకపోవడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను పెంచుకోవాలి.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : దూరపు బంధువుల కలయిక !

ఈ రోజు విందు,  వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆనందంగా గడుపుతారు. శుభ కార్యాలు ఫలిస్తాయి. ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఈరోజు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈరోజు దూరపు బంధువుల కలయికతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు ధన లాభం కలుగుతుంది. శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఈరోజు శుభ వార్తలు వింటారు.

రెమిడీ: దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి : శుభవార్త వినే అవకాశం !

ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఈరోజు అనవసర ఖర్చులు చేయకండి, ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు స్వల్ప నష్టాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి. ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈరోజు అశ్రద్ధగా ఉండకండి .

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొండి.

 

కుంభ రాశి : శుభ కార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారు. ఈరోజు అనుకూలంగా ఉంటుంది .ఈరోజు అందరిన్ని మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఇంట్లో ఉన్న సమస్యలను తీర్చే గలుగుతారు. ధన లాభం కలుగుతుంది. ఈరోజు  ఉద్యోగ ప్రయత్నాలు,  వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈరోజు విహార యాత్రలు కానీ తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈరోజు సుఖంగా, సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ కుటుంబంలో మీకు గౌరవం లభిస్తుంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : ప్రయాణాల వల్ల ఇబ్బందులు !

ఈరోజు పనులను వాయిదా వేస్తారు. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అప్పు ఇవ్వడం వల్ల నష్టపోతారు. అనవసరంగా మాట్లాడకండి. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు. ఈరోజు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక వాయిదా వేసుకోండి. ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనవసర గొడవలకు దూరంగా ఉండండి.

రెమిడీ: శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది.

 

author avatar
Sree matha

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?