NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 15th మంగళవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 15 – మార్గశిరమాసం – మంగళవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, మంగళవారం, తిథి: పాడ్యమి రాత్రి 9.06 వరకు తదుపరి విదియ, నక్షత్రం: మూల రాత్రి 9.30 వరకు తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: రాత్రి 8.02 నుండి 9.31 వరకు పునర్‌ వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 6.32 నుండి మర్నాటి ఉదయం 7.02 వరకు, అమృత ఘడియలు: పగలు 3.37 నుండి సాయంత్రం 5.06 వరకు, రాహుకాలం: పగలు 2.57 నుండి పగలు 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.52  నుండి 9.36 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 10.53 నుండి 11.45 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఆకస్మిక ధన లాభం !

ఈరోజు అనుకూలమైన రోజు. కొత్త స్నేహితులు ఏర్పడతారు, పరిచయం అవుతారు. ఈరోజు మీరు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. గతంలో కాని పనులను ఈ రోజు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. క్రయ విక్రయాలు చేస్తారు. ఈరోజు ఏ పని చేసిన శ్రద్ధగా చేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థిక వ్యవస్థ ఈ రోజు చాలా బాగుంటుంది, మెరుగుపడుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. అందరితో కలసి బాగా పని చేస్తారు. ఈరోజు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. స్త్రీలకి ఈరోజు ఆభరణాలు ధరించే అవకాశం ఉంది.

రెమిడీ: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఆరోగ్యం జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేసినా ఆచితూచి చేయండి, ఏ పనిని వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఆవేదన, ఆవేశం వచ్చిన ఆదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ధర్మాన్ని నిజాయితీని వదలకండి. రాబోయే రోజులకు భయపడకండి. విద్యార్థులు తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను గౌరవించాలి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించాలి తప్ప ఇతర విషయాలను పట్టించుకోకండి. ఈరోజు బద్ధకంగా ఉండకుండా పనులను పూర్తి చేసుకోండి. మీకు కొత్త విద్యను నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఈరోజు డబ్బును వృధా చేయకండి. ఈరోజు ఎవరిని తొందరగా నమ్మకండి. ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం లాంటివి చేయకండి. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి.

రెమిడీ: ఈరోజు గణేశ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : అనుకూలమైన రోజు !

ఈరోజు చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు ఉద్యోగస్తులకు చాలా బాగుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. పెద్ద వారి ఆలోచనలకు, మాటలకు గౌరవిస్తారు. బంధువులకు ధనసహాయం చేస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు దేవాలయ దర్శనాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా మీ పనులు మీరు పూర్తి చేసుకోండి. ఈరోజు అందరితో సఖ్యత గా ఉండండి. మీలో కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. ఎదుటివారిని ఎవ్వరిని ఏమనకుండా మౌనంగా ఉండండి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు డబ్బు తక్కువ ఖర్చు చేయండి. చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి. ఈరోజు ఎవరిని తొందరగా నమ్మకండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి.

రెమిడీ: గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి : ఆగిపోయిన పనులు పూర్తి  !

ఈరోజు అందరిని ఆకర్షిస్తారు. అనవసరంగా డబ్బుని ఖర్చు పెట్టకండి. ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఎటువంటి సమస్యనైనా ఆలోచించి పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు అప్పు తీసుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. దంపతులిద్దరూ మంచి అవగాహనతో ఉంటారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. స్త్రీలు కోపాన్నికి దూరంగా ఉండండి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు శ్రీశివకవచం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : సఖ్యతగా ఉండండి!

కావలసినవారు దూరమయ్యే అవకాశం ఉంది. ఎవరో చెప్పిన మాటలు వినకుండా స్నేహాన్ని దూరం చేసుకోకండి. దంపతులు గొడవ పడే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చురుగ్గా పని చేయడానికి శ్రద్ధ వహించండి. ఈరోజు ఎవరితో గొడవ పడకుండా వాదోపవాదాలు పెట్టుకోకుండా సఖ్యత గా ఉండండి. కొత్త వ్యక్తులను నమ్మకండి. ఎవరితో తొందరపడి మాట్లాడకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ పని చేసిన ధర్మాన్ని, నీతిని, నిజాయితీ ని వదలకండి. ఆధ్యాత్మిక ఆలోచనతో గడపండి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. విద్యార్థులు అనవసరమైన తగాదాలకు పోకండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఆంజనేయ దండకం ని పారాయణాం చేసుకోండి.

 

తులారాశి : ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. స్నేహితులతో కలిసి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఈరోజు సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. క్రొత్త పుస్తకాలను చదవాలని తపన చెందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సాంప్రదాయకమైన వంటల మీద శ్రద్ధ చూపుతారు. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. నీతి నిజాయితీగా పనులను పూర్తి చేస్తారు. ప్రతి క్షణం ఏదో సాధించాలనే ఆలోచిస్తారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసే అవకాశం ఉంది ఆయనను వాటిని పూర్తి చేయడానికి బాగా ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. జు మీ సోదరుల నుండి శుభవార్తలు వింటారు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.

రెమిడీ: విష్ణు సహస్రనామ పారాయణం  చేసుకోండి.

 

వృశ్చిక రాశి : శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం !

చెప్పుడు మాటలను వినకండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. పెట్టుబడులు పెడతారు .స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. ఎవరితో అనవసరంగా గొడవ పడకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇష్టమయ్యే వాళ్లకు దూరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. వ్యాపారస్తులకు ఈరోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా ఉండండి.అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బును వృధా చేయకండి. సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇతరులను తొందరపడి నిందించకండి. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండండి.

రెమిడీ: ఈరోజు దుర్గాస్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : వ్యాపారస్తులకు అనుకూలం !

శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉండి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు అనుకూలంగానే ఉంటుంది.  స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. రాబోయే రోజులకు ప్రణాళికను ఈరోజే చేసి పెట్టుకుంటారు. ఏ పనులను చేసిన ఆచితూచి చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రారంభించిన పనులను ఓర్పుగా పూర్తి చేయండి. సహనం గా ఉండండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులు ఉద్యోగం లో మంచి గౌరవం పొందుతారు. విద్యార్థులు విద్య మీద సందేహాలను నివృత్తి చేసుకొని మంచి గౌరవం పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు.

రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి : ఆరోగ్యాం జాగ్రత్తగా !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పెద్దవారిని గౌరవించండి. ఎవ్వరికి అప్పులు ఇవ్వకండి, తీసుకోవడం చేయకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఎవరిని తొందరగా నమ్మకండి. చిన్న పనులను అయినా జాగ్రత్తగా చేసుకోండి. చెడు పనులకు దూరంగా ఉండండి. స్నేహితులను తొందరగా నమ్మకండి. ఎవరితో వివాదాలు పెట్టుకోకండి. ఈరోజు ప్రయాణం చేయకండి. మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకోకండి. దంపతుల మధ్య వివాదం వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో వాదోపవాదాలు పెట్టుకోకండి. ఈరోజు మౌనంగా ఉండండి. సమయానికి నిద్ర ఆహారాలు మానకండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రత వహించండి. ఈరోజు కొంచెం చంచలమైన బుద్ధిగా ఉంటారు. వ్యాపారస్తులు శ్రద్ధగా వ్యాపారం చేసుకోండి.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం  చేసుకోండి.

 

కుంభరాశి : కీర్తి ప్రతిష్టలు పొందుతారు !

ఈరోజు అన్ని పనులకు అనుకూలమైన రోజు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటారు. గృహ ప్రకరణ వస్తువుల కొనుగోలు చేస్తారు. ఇతరులకు ధర్మాన్ని బోధిస్తారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఏ పనినైనా బాగా చురుగ్గా పూర్తి చేస్తారు. ఈరోజు ధైర్యంగా ఉంటారు. ఈరోజు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. విద్యార్థులు పెద్దల మాటలను గౌరవించండి, విద్య మీద శ్రద్ధ వహించండి.

రెమిడీ: ఈరోజు గాయత్రీ స్తోత్రాలు పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బంది !

ఈరోజు తొందరపడి ప్రయాణాలు చేయకండి. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటారు. ఈరోజు పనులు వాయిదా పడుతుంటాయి. దంపతుల మధ్య అవగాహన ఉండాలి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి, అనవసర విషయాలను పట్టించుకోకండి. అందరితో సఖ్యత గా ఉండండి. స్త్రీలు ఒత్తిడి గా ఉంటారు. ఎవరితో తొందరపడి వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సమయస్ఫూర్తి వహించండి. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏ పని చేసిన ఆలోచించి ఆచితూచి చెయ్యండి.

రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణ అన్ని చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?