NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 16th బుధవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 16 –మార్గశిరమాసం – బుధవారం.

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం, తిథి: విదియ సాయంత్రం 4.55 వరకు తదుపరి తదియ, నక్షత్రం: పూర్వాషాఢ రాత్రి 8.04 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: శేషం ఉదయం 7.02 వరకు, పునర్‌ వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 3.47 నుండి 5.19 వరకు, అమృత ఘడియలు: రాత్రి 3.33 నుండి తెల్లవారు జాము 5.03 వరకు, రాహుకాలం: పగలు 12.11 నుండి 1.34 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.49 నుండి పగలు 12.33 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు సంగీతం మీద దృష్టి !

ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మంచి ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు .దేవతారాధన చేస్తారు. ఎదుటి వారు ఎప్పుడూ మిమ్మల్ని పొగడాలని అనుకుంటారు. మీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలని అనుకుంటారు .ఇంట్లో పూజలు ,దానధర్మాలు చేస్తారు. దంపతులిద్దరూ మంచి అవగాహన తో ఉంటారు. ఒకరికొకరు సహాయం గా ఉంటారు. ఈరోజు అప్పుల బాధ నుంచి బయట పడతారు. సంగీతం మీద దృష్టిని కేంద్రీకరిస్తారు .శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఆచితూచి ముందుకు అడుగు వేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఎదుటి వారికి సహాయంగా ఉంటారు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి సున్నితత్వం కలిగి ఉంటారు. స్నేహితులతో మంచిగా ఉంటారు .కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.   వ్యాపారస్తులకు బాగా  అనుకూలమైన రోజు. విద్యార్థులు ఏకాగ్రతగా విద్య మీద శ్రద్ధ వహిస్తారు .స్త్రీలు అందరితో కలిసి మెలిసి చక్కగా ఉంటారు,  కుటుంబంలో పనులను చేస్తారు.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

వృషభ రాశి : ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు మిత్రులు కూడా షెత్రులు అయ్యే అవకాశం ఉంది. తొందరపడి ఎవరితో మాట్లాడకండి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చక్కగా ఉండండి, వాదోపవాదాలు పెట్టుకోకండి. నిరాడంబర జీవనంగా ఉండండి. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. ఏ పనినైనా పలు సార్లు ఆలోచించి  చేయండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది . అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఈరోజు మీ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి. ఎవరితో ఏ విషయాలు చర్చించండి. అవసరం లేని పనులకు దూరంగా ఉండండి. డబ్బులను అనవసరంగా ఖర్చు పెట్టకండి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధను ఏకాగ్రతను చూపించండి. స్త్రీలు ఏ విషయానికైనా ఈరోజు ఓపిగ్గా ఉండటం మంచిది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. రెమిడీ: ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేయండి.

 మిధున రాశి : పోటీ పరీక్షలకు అనుకూలం !

ఈరోజు ఆనందంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి కష్టపడతారు. ఈరోజు నిజాయితీగా ధర్మంగా ఉంటారు. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఎవరితో తగాదాలు పెట్టుకోకండి. అందరితో సఖ్యత గా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఏ విషయాన్ని అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బులను బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలంమైన రోజు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూలమైన రోజు. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనులు పూర్తి చేసుకోండి.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. మధ్యవర్తులను నమ్మకండి. అప్పులు ఇవ్వడం గానీ తీసుకోవడం కానీ చేయకండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు మానకండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. సోమరితనం గా ఉండకండి, బద్ధకం గా ఉండకండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. మీలో ఉన్న లోపాన్ని మీరే గ్రహించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహాలు చేయకండి. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. మీ కోపాన్ని, ఆవేశాన్ని, తొందరపాటుతనం ని తగ్గించుకోండి. వ్యాపారులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించాలి, స్నేహితులతో కలిసి అనవసరమైన పనులను చేయకండి.

రెమిడీ: ఈరోజు దుర్గా స్తోత్ర పారాయణాన్ని చేసుకోండి.

సింహరాశి : స్నేహితుల సహాయం అందుకుంటారు !

వ్యాపారం మీద మంచి శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకొని పనులను మంచిగా పూర్తి చేస్తారు. పెద్ద వారితో మంచి గౌరవాన్ని పొందుతారు. సోదరులతో మంచి సమాచారాన్ని అందుకుంటారు. స్నేహితులతో డబ్బు సహాయం అందుకుంటారు. అనేక రకమైన విషయాల నుంచి బయట పడతారు. అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం మనస్తత్వం కలిగి ఉంటారు. సమాజానికి అవసరమైన పనులను చేస్తారు. ఏమైనా వాస్తవాలను క్రయవిక్రయాలు చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన ఈరోజు. మంచి నిజాయితీగల ధర్మంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు.ఏ పనినైనా ధైర్యంగా సాహసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టి చదివి సాధిస్తారు.

రెమిడీ: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

కన్యారాశి : ఈరోజు పనులు పూర్తి !

ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోండి. ప్రతి పనిని ఆలోచించి పూర్తి చేయండి. సమాజంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది. మీ శ్రమను ఇతరులు అనుభవిస్తారు. మీరు నిజాయితీగా ధర్మంగా ఉండండి. ఎవరితో కోపంగా ఉండకండి. బాగా శ్రమపడి పనులను పూర్తి చేస్తారు. ఈరోజు డబ్బులను తక్కువగా ఖర్చు పెట్టండి. పెద్ద వారిని గౌరవించండి, పెద్ద వారి సూచనలను పాటించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి.  వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి : ఈరోజు విద్యార్థులకు అనుకూలం !

ఈరోజు మంచి అనుకూలమైనరోజు. ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు, అనుకున్న సమయంలో పనులను పూర్తి చేస్తారు. ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేసే పని పూర్తి చేస్తారు. ఈరోజు ప్రతిభను బయటికి చూపిస్తారు. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. వాహనాలను కొనడం అమ్మడం చేస్తారు. నిర్లక్ష్యంగా ఉన్న విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపుతారు. ప్రతి విషయంలో సత్యాన్ని వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా కొత్త విషయాలను నేర్చుకుంటారు,విద్యార్థులకు మంచి అనుకూలమైన రోజు.  మంచి చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఉన్నతాధికారుల సహాయం తీసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలు  ఆనందంగా,k సంతోషంగా ఉంటారు.

రెమిడీ: విష్ణువిసహస్రనామ పారాయణ అన్ని చేసుకోండి.

వృశ్చిక రాశి : ఈరోజు ఆర్థిక ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మి డబ్బులను తీసుకోకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎదుటి వారితో గొడవ పడకండి. మీ కోపాన్ని తగ్గించుకోండి. బంధువులతో సఖ్యత గా ఉండండి. డబ్బులను అనవసరంగా ఖర్చు పెట్టకండి. ఈరోజు కొంచెం మౌనంగా ఉండటం మంచిది. కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు గాయత్రీ స్తోత్రాలు పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం !

వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. సమయానికి ఆహారాన్ని తీసుకుంటారు. ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. పెద్దవారి వారి మాటలను, సూచలను పాటిస్తారు. స్నేహితులతో మంచి సఖ్యత గా ఉంటారు. ఈరోజు క్రయ విక్రయాలు చేస్తారు. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపుతారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 మకర రాశి : ఈరోజు చురుకుగా ఉంటారు !

మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఈరోజు విశ్రాంతి లేకుండా శ్రమ పడతారు. చంచలమైన స్వభావంతో ఉంటారు. సమయానికి నిద్రాహారాలు మానకండి. ఈరోజు డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రహస్యాలను గూఢంగా ఉంచండి. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరే పూర్తి చేసుకోండి. ఈరోజు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రత వహించండి.

రెమిడీ: కాలభైరవాష్టకం పారాయణాన్ని చేసుకోంది.

కుంభరాశి : గౌరవం పొందుతారు !

మీరు ధర్మబద్ధంగా, క్రమశిక్షణగా, న్యాయంగా ఉంటారు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతారు. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం నిద్ర లను పాటిస్తారు. ఈరోజు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. కష్టపడి సంపాదించాలనే తపన పడతారు. ఈరోజు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థుల విద్య మీద శ్రద్ధ ఆసక్తి చూపుతారు, కొత్త విషయాలను కనుక్కోవాలని చూస్తారు. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు కలిసివస్తుంది. ఈరోజు ఇంతకు ముందు కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. దంపతులిద్దరూ మంచి అవగాహన గా ఉంటారు. ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఈరోజు మంచి సన్నిహితంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి : ఖర్చులను తగ్గించుకోండి !

ఈరోజు ఇతరుల మీద అసూయ పడతారు. మీరు చేయని తప్పులకు నిందను వేసే అవకాశం ఉంది. ఈరోజు ఏ నిర్ణయాలు నైనా ఆలోచించి తీసుకోండి. ఈరోజు అప్పులు తెచ్చుకోవడం, ఇవ్వడం చేయకూడదు. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకండి. ఈరోజు ఖర్చులను తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు కోపాన్ని, తొందర తనాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. పనులను వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోండి. అనుకున్న విషయాలు అవకతవక మయ్యే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు మానకండి. సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా పెడతారు. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju