శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, గురువారం, తిథి: తదియ పగలు 3.17 వరకు తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 7.13 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: రాత్రి 11.11 నుండి 12.47 వరకు, అమృత ఘడియలు: పగలు 1.02 నుండి 2.35 వరకు, రాహుకాలం: పగలు 1.35 నుండి 2.58 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 10.21 నుండి 11.05 వరకు, పునర్ దుర్ముహూర్తం: పగలు 2.47 నుండి 3.31 వరకు. ద్వాదశరాశుల వారికి ఆయా గ్రహాల చలనాల ఆధారంగా గోచార ఫలితాలు, సూచనలు ఇస్తున్నాం.
మేష రాశి : పోటీపరీక్షల్లో విజయం !
ఈరోజు అన్ని పనులకు అనుకూలమైన రోజు. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఆదర్శవంతంగా జీవించాలి అని అనుకుంటారు. అందరి మన్ననలను పొందుతారు. ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో ఆ విధంగా ఉంటారు. ఏ విషయానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయమే తీసుకుంటారు. పరువు ప్రతిష్టలకు విలువని ఇస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. దంపతులిద్దరూ మంచి అవగాహనగా ఉంటారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది. నిజాయితీ నిబద్ధతతో పనిని పూర్తి చేసుకుంటారు. రుణ విమోచన లు తగ్గుతాయి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్త్రీలు దేవాలయ దర్శనం చేసుకుంటారు, ఇంట్లో దైవారాధన చేసుకుంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు. అన్ని వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు.
రెమిడీ:ఈరోజు భ్రమరాంబికాష్టకం పారాయణాన్ని చేసుకోండి.
వృషభ రాశి : ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బంది !
ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు తక్కువగా మాట్లాడండి. ఎవరితో వాదోపవాదాలు తగాదాలు పెట్టుకోకండి. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. ఎవరిని తొందరగా నమ్మకండి. అగ్రిమెంట్ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. ఖర్చయ్యే అవకాశం ఉంది. మీలో ఉన్న కోపాన్ని తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి. ప్రయాణాల్లో తొందర పనికిరాదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ధననష్టం కలుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్త్రీలకు మనోవేదన పెరిగే అవకాశం ఉంది,మీ భర్తతో చక్కగా ఉండండి. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
రెమిడీ:ఈరోజు దుర్గాష్టమి పారాయణాన్ని చేసుకోండి.
మిధున రాశి : గృహోపకరణ వస్తువులు కొనుగోలు !
ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇతరుల కోసం ఎక్కువ కష్టపడతారు. విలాసమైన జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి గొడవలు ఉన్న సర్దుకుపోతారు, కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పరువు ప్రతిష్ఠలకు విలువనిస్తారు. ప్రత్యేకత విషయాలను నేర్చుకోవాలనే తపన పడతారు. ఏదైనా పని ఉంటే కష్టపడి దానిని పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ మంచి గా అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తారు, పొదుపుగా కర్చు పెడుటారు. రుణాలను తగ్గించుకుంటారు. వాహనాలను, గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటి వారికి, పెద్దవారికి సేవ చేస్తారు. అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే క్రమశిక్షణతో నిజాయితీతో మార్పును తెచ్చుకుంటారు. విశాల హృదయం కలిగి ఉంటారు. అందరితో బాగా సఖ్యత గా ఉంటారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి చదువుకుంటారు, మంచి పోటీ పడి చదువుకుంటారు. స్త్రీలు ఇంట్లో మంచిగా దైవారాధన చేసుకుంటుంటారు. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
రెమిడీ: ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
కర్కాటక రాశి : ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి !
ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో వారి కోసం డబ్బులు ఖర్చు పెడతారు. స్నేహితుల కలయిక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆచార సంప్రదాయాలను, పద్ధతులను, మరిచిపోకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కఠినంగా మాట్లాడకండి, ఈరోజు తక్కువగా మాట్లాడండి. మీ కోపాన్ని, తొందరపాటుతనాన్ని అదుపులో ఉంచుకోండి. ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఇతరులు మీ తప్పును ఎత్తి చూపే అవకాశం ఉంది. ఏ విషయానికైనా సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు అబద్ధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి, అనవసర విషయాలను పట్టించుకోకండి, ఎవరికీ ఎలాంటి హాని కలిగించకండి. పెద్ద వారిని గౌరవించండి, పెద్ద వారి సూచనలను మాటలను గ్రహించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. తగాదాలు, వాదోపవాదాలు పెట్టుకోకండి. ఉద్యోగస్తులు అధికారుల పై జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాల వ్యాపారస్తులు కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంవల్ల మనోవేదనకు గురవుతారు.
రెమిడీ: ఈరోజు శ్రీచంద్రశేఖరాష్టకం పారాయణం చేసుకోండి.
సింహరాశి : ఈరోజు ధర్మంగా ఉంటారు !
ఈరోజు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారు. మీకోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడతారు. ధన సౌఖ్యం కలుగుతుంది. వస్తు లాభం కలుగుతుంది. ఏ పనైనా సరే మీ అంతట మీరే సొంతంగా చక్కగా పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు నిజాయితీగా ధర్మంగా ఉంటారు. ప్రేమికులు ప్రేమను జయిస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద మంచి ఏకాగ్రతను చూపుతారు. ఈరోజు ఉద్యోగస్తులు వారివారి ఉద్యోగాల్లో మంచి వృద్ధి రాణిస్తారు. స్త్రీలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.
కన్యారాశి : ఈరోజు మంచిచెడు ఆలోచించి మాట్లాడండి !
ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కాస్త బద్ధకంగా ఉంటారు. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు మంచి చెడు ఆలోచించి మాట్లాడండి. తొందరపడి ఎవరితో గొడవలు పెట్టుకోవడం చేయకండి. ఎవ్వరికి తొందరపడి మాట ఇవ్వకండి. కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి, దేనికి ఒత్తిడికి గురికాకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు మంచి స్నేహితులు ఎవరు శత్రువులెవరో తెలిసే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పిల్లలతో ప్రేమగా ఉండండి. వ్యామోహాలకు దూరంగా ఉండండి. సమయాన్ని వృధా చేసుకోకండి. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీ: ఈరోజు శ్రీహయగ్రీవ పారాయణాన్ని చేసుకోండి.
తులారాశి : ఈరోజు శుభవార్త వింటారు !
ఈరోజు అనుకూలమైన రోజు. రాబోయే భవిష్యత్తు గురించి ముందే ఆలోచించి ఉంటారు. ఈరోజు అన్ని పనులు మీద శ్రద్ధ వహిస్తారు. ఇంతకుముందు నెమ్మదిగా సాగిన పనులు కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా, చురుగ్గా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు రావలసిన బకాయిలు వస్తాయి. పెద్దల ఆస్తులు సంక్రమించే అవకాశం ఉండి. పెద్దలను గౌరవిస్తారు. ఈరోజు పెద్దల మాటలు సూచనలను పాటిస్తారు. ఈరోజు ఏ నిర్ణయమైనా మంచిగా ఆలోచించి తీసుకుంటారు. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి శుభవార్త వింటారు. మీరు ఈరోజంతా నీటి నిజాయితీగా ధర్మంగా ఉంటారు. విద్యార్థులు ఈరోజు నూతన ప్రయోగాలు చేస్తారు. విద్య మీద మంచి శ్రద్ధ వహిస్తారు. స్త్రీలు ఈరోజు చురుగ్గా పని చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు శ్రీబాలాత్రిపురసుందరి స్తుతి పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి : ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !
స్నేహితులతో గొడవ పడకండి. ఈరోజు డబ్బులను అధికంగా ఖర్చు పెట్టకండి. ఆహారాన్ని వృధా చేయకండి. ఈరోజు సన్నిహితులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించండి. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ కోపాన్ని, మీ తొందరపాటు తనాన్ని అదుపులో ఉంచుకోండి. తొందరపడి ఎవరిని నిందించకండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా చూసి చెయ్యండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
రెమిడీ: ఈరోజు నారాయణ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.
ధనస్సు రాశి : ఈరోజు పనులు పూర్తి !
ఈరోజు అందరితో కలిసిమెలిసి ఉంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఇంతకు ముందు కంటే ఈరోజు ఆర్థిక విషయంలో చాలా బాగుంటుంది. ఈరోజు మీరు నిజాయితీగా, ధర్మంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు వాహనాల కొనుగోలు, అమ్మకాలు చేస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈరోజు బాగుంటుంది. ఈరోజు అందరితో సఖ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. దైవచింతన చేస్తారు. ఇతరుల నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఎప్పటినుంచో కాని పనులు ఈరోజు పూర్తి అవుతాయి. ఈరోజు విద్యార్థులు పెద్దలు చెప్పిన మాటలు గౌరవిస్తారు. విద్య మీద శ్రద్ధ వహిస్తారు. స్త్రీలు ఈరోజు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు చురుగ్గా పనులను పూర్తి చేసుకుంటారు .
రెమిడీ: ఈరోజు లింగాష్టకం పారాయణ చేసుకోండి.
మకర రాశి : ఈరోజు ధననష్టం !
ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎదుటి వారు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది. మీరు చెయ్యని పనులకు నిండా వేసే అవకాశం ఉంది. మీరు చేసే పనులను వాయిదా వేయకుండా సరైన సమయంలో పూర్తి చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ధననష్టం కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని, గర్వాన్ని తగ్గించుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ఈరోజంతా చంచలమైన బుద్ధి కలిగి ఉంటారు. ఈరోజు దైవదర్శనం చేయాలని ఆరాటపడతారు. ఈరోజు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రతను శ్రద్ధ చూపండి.
రెమిడీ: ఈరోజు దేవి అపరాధ స్తోత్రం పారాయణ చేసుకోండి.
కుంభరాశి : ఈరోజు బకాయిలు వసూలు !
ఈరోజు మంచి అనుకూలమైన రోజు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు దంపతుల మధ్య మంచి అవగాహన కలిగి ఉంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. మీ మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుం టారు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈరోజు ఇంతకుముందు ఉన్న బకాయిలు వసూలవుతాయి. ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మంచి జ్ఞాపకశక్తినిచ మేధాశక్తిని కలిగి ఉంటారు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఎదుటి వారితో, మిత్రులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద మంచి శ్రద్ధ వహిస్తారు. ఈరోజు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. గృహ నిర్మాణాలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు తక్కువగా మాట్లాడండి దీనివల్ల ఏ వివాదాలు కలగవు. ఉద్యోగస్తులు ఉద్యోగం లో మంచి అవకాశాలను పొందుతారు
రెమిడీ: ఈరోజు శివాష్టక పారాయణాన్ని చేసుకోండి.
మీన రాశి : ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం !
ఈరోజు కొంచెం మనోధైర్యం తగ్గుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో గొడవ పడకండి, వాదాలు పెట్టుకోకండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవ్వరిని లెక్క చేయకుండా ఉండకండి. మీ పని మీరే పూర్తి చేసుకోండి. ఈరోజు పనులను వాయిదా వేసుకోకండి. ఇష్టమైన వారిని దూరం చేసుకోకండి. ఈరోజు చంచలమైన బుద్ధితో ఉంటారు.ఈరోజు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.