NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 7th సోమవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

కార్తీకమాసం- డిసెంబర్‌-7- సోమవారం. ఈరోజు నాల్గోకార్తీక సోమవారం. సప్తమి. మధ్యాహ్నం 2.10 వరకు ఉంటుంది. అనంతరం అష్టమి. వర్జం 7.17 నుంచి 8.56 నిమిషాల వరకు. ఈరోజు ఉపవాసం, నక్తం, శివాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. సోమవారం రోజు ఆయా గ్రహాల చలనాల ఆధారంగా పన్నెండు రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం…

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు !

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికప్రయోజనాలను పొందగలరు. ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆఫీసులో ఒక మంచి మార్పును ఈరోజు మీరు చూడనున్నారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా ఉంచుకోవడానివానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

రెమిడీః మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం శివాభిషేకం చేయించండి.

 

వృషభ రాశి : ఈరాశివారు మంచి ఫలితాలను పొందుతారు

ఈరోజు గ్రహచలన రీత్యా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ది చేస్తారు. ఈరోజు ఎవరికి వాగ్దానాలను చేయకండి. వాటిని మీరు నిలుపుకోలేరు. ఆధ్యాత్మిక, సమాజసేవ కార్యాక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇరుగుపొరుగు మాటలు పట్టుకొని మీ భాగస్వామితో వాదనకు దిగే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి అటువంటి పనిచేయకండి. ఆరోగ్యం బాగుంటుంది.

రెమిడీః ఆరోగ్య అభివృద్ధి కోసం శివుడికి పంచామృతాభిషేకం చేయించండి.

 

మిథున రాశి : ఈరోజు ఆర్థికంగా దృఢంగా ఉంటారు !

ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు పని వత్తిడి వల్ల అలసట పొందుతారు. ఆర్థికంగా మంచిగా ఉంటారు. ఈరోజు పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆఫీస్‌లో మంచి పనితీరును ప్రదర్శించండి. గ్రహచలనం రీత్యా విద్యార్థులు చదువులపై ఆసక్తి చూపించలేరు, కాబట్టి పట్టుదలతో చదవండి. మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన క్షణాలను ఈరోజు మీరు పొందనున్నారు.

రెమిడీః వృత్తి, వ్యాపారంలో వృద్ధి కోసం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.

 

కర్కాటక రాశి : ఈరోజు పెద్దల సలహాలు తీసుకోండి !

ఈరోజు చిత్రవిచిత్రంగా ఉంటుంది. అనుకోని ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడువాటిని దూరం చేయండి. వృత్తి వ్యాపారాల్లో పెరుగుదల కోసం పెద్దల సలహాలను తీసుకోండి. ఇంట్లో పనుల వల్ల మీరు చాలా బిజీగా ఉంటారు. ఆఫీసులో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. పిల్లల చదువు కోసం మీరు శ్రమించాల్సి వస్తుంది. తప్పుడు సమాచారం కొన్ని సమస్యలు రావచ్చు. కానీ వీటిని వివాదాల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కుటుంబ జీవితం బాగుం టుంది.

రెమిడీః  కుటుంబ జీవితానికి ఆనందకరమైన స్థితి కోసం శ్రీసూక్తంతో శివాభిషేకం చేయించండి.

సింహ రాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులు మీమీద అనేక పనులు, బాధ్యతలను పెడుతారు. కానీ అది మీకు చిరాకు తెప్పిస్తుంది. ఈరోజు గ్రహచలనరీత్యా ఆర్థికంగా కలిసి వస్తుంది. స్నేహితులు మిముల్ని ఆదుకుంటారు. వ్యాపారరీత్యా చేసే ప్రయాణం మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారవేత్తలకు ఎంతో అనుకూలమైన రోజు. ఆఫీస్‌లో మీ పై అధికారుల మీకు సహకారం అందిస్తారు. కానీ పని ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతారు. మీజీవిత భాగస్వామితో గొడవ పడతారు. చివరకు అంతా సర్దుకుంటుంది.

రెమిడీః  శని స్తోత్రం పారాయణం చేయండి.

 

కన్యా రాశి : లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చందనాభిషేకం చేయించండి

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినా చివరకు అంతా సర్దుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వారి మాటలను వినండి. లేకుంటే వారికి మీ మీద కోపతాపాలు పెరుగుతాయి. విద్యార్థులలో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కన్పిస్తుంది. ఇంటికి అనుకోని అతిధి ఇంటికి రావడం చేత మీరు పనులను వాయిదా వేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.

రెమిడీః శివుడికి చందనంతో అభిషేకం చేయించండి. లక్ష్మీ అనుగ్రహం పొందండి.

 

తులా రాశి : ఆర్థిక పరిస్థితులపట్ల జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు మంచిగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. పిల్లలు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు మీ జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించడానికి ఆర్థికపరిస్థితిపట్ల జాగురూకతతో ఉండాలి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ఆఫీస్‌లో ఈరోజు చాలా హాయిగా గడిచిపోనుంది. మీలోని సృజనాత్మకత వల్ల అనుకోని ప్రయోజనాలను పొందుతారు. ఇంట్లో పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కుటుంబ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రెమిడీః ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందడానికి శ్రీసూక్తంతో అభిషేకం చేయించండి.

 

వృశ్చిక రాశి : ఆర్థికాభివృద్ధి కోసం శివాభిషేకం చేయించండి !

ఈరోజు కొత్త పనులు ప్రారంభించండానికి అనుకూలంగా ఉంటుంది. మీమీద ఇరుగుపొరుగు వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. పెట్టుబడులు, పొదుపుల పెట్టే విషయంలో ఇంట్లో వారితో మాట్లాడవలసి ఉంటుంది. వారి సలహాలు మీకు చాలావరకు సహాయపడతాయి. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది.  ఆఫీస్‌లో మీరు పనిని ముందే చేసి పెట్టుకోండి. అనుకోని సెలవులు తీసుకోవాల్సి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి ఎంతో సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

రెమిడీః  ఆర్థిక జీవితం మెరుగుపరుచుకోవడానికి శ్రీశివాభిషేకం చేయండి.

 

ధనుస్సు రాశి : అనవసర ఖర్చులు పెట్టకుండా ఉండండి !

ఈరోజు ఈరాశివారి వెన్నవంటి హృదయం వల్ల ఎన్నో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబ సబ్యుల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా ప్రవర్తించండి. అతిగా లేదా అవనసరంగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. పిల్లలు మీకు సంతోషకరమైన వార్తలను అందించవచ్చును. ప్రేమ జీవితంలో మీకు ఒడిదుడుకులు ఎదురువుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు పొందుతారు. ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు కానీ నిజానికి దీని వెనుక ఎటువంటి కారణం ఉండకపోవడం విశేషం. దీనివల్ల మీ మనస్సుకలత చెందుతుంది. సమయం వృధా అవుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కానీ పాత విషయాల జోలికి వెళ్లకండి.

రెమిడీః కుటుంబ జీవితం కోసం శ్రీశివాభిషేకం చేయండి.

 

మకర రాశి : ఆరోగ్య పరంగా మంచిగా ఉండే రోజు !

ఈరోజు గ్రహచలనం రీత్యా ఆరోగ్యపరంగా చక్కని రోజు. మీ మానసికస్థితి ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల మీకు అవసరమైన ఆత్మ విశ్వాసంతో ఉంటుంది. సంపద కోసం శ్రమిస్తారు. అయితే ఇదే జీవితం కాదనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. అనవసర ఖర్చులు నివారించండి. ఆఫీస్‌లో ఒళ్లు దాచుకోకుండా కష్టపడి పనిచేయండి. స్థిరనిశ్చయం, నైపుణ్యాలు మీకు గుర్తింపును తెస్తాయి. ఈరోజు బాగా శ్రమించండం వల్ల అలసిపోయినట్లు ఉంటారు. కానీ సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. అనుకోని చిన్నచిన్న వివాదాల ముగింపు తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.

రెమిడీః ఆర్ధిక జీవితాన్ని మెరుగుపర్చడానికి శ్రీలక్ష్మీ అష్టోతరంతో తులసీ దేవి దగ్గర పూజచేయండి.

 

కుంభ రాశి : ముదుపు చేయడం మీకు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. పాత స్నేహితుని సలహా ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కపడుతుంది. కుటుంబ అభివృద్ధి కోసం పొదుపు అంటే  మదుపు చెయ్యడం లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు చేయకండి. ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఆఫీస్‌లో పని వత్తిడి. మీకు బాగా శ్రమ, కోపం తెప్పించే అవకాశం ఉంది. వైవాహిక జీవితానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను చూడపోతున్నారు.

రెమిడీః  వృత్తిలో అభివృద్ధి కోసం ఆవునెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి.

 

మీన రాశి : ఈరోజు వత్తిడి ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు మీ పట్టుదల మిముల్ని ముందుకు నడిపిస్తుంది. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. కానీ తోటి ఉద్యోగులు మీకు చాలా సహాయకరంగా ఉంటారు. కుటుంబంలో మిముల్ని పట్టించుకోనితనం మీకు చిరాకు కలిగిస్తుంది. దీనివల్ల మీరు పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. దీనివల్ల మానసికంగా బాగుంటుంది. ప్రయాణాలు కలసిరావు. తప్పనిసరి అయితేనే చేయండి. మీకు ఇష్టమైన వారితో రహస్యాలను పంచుకోవ డానికి ఈరోజు మంచిది కాదు. పూజలు లేదా వ్రతాలు మీ ఇంటిలో నిర్వహించ బడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు ఇబ్బందికర పరిస్థితిని ఎదురుకుంటారు.

రెమిడీః  సోమవారం  శివపూజ, ఉపవాసం, నక్తం వంటివి చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్యరకారకుడైన శివానుగ్రహం పొందు తారు.

 

author avatar
Sree matha

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju