NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 8th మంగళవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

రాశిఫలాలు- డిసెంబర్ – 8 – కార్తీకమాసం – మంగళవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్‌ఋతువు, కార్తీకమాసం, కృష్ణపక్షం. తిథి: అష్టమి సాయంత్రం 5.17 వరకు తదుపరి నవమి, నక్షత్రం: పూర్వ ఫల్గుణి పగలు 1.47 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి, వర్జ్యం: రాత్రి 8.37 నుండి 10.08 వరకు, అమృత ఘడియలు: రాత్రి తెల్లవారు జాము 5.43 నుండి మర్నాటి ఉదయం 7.14 వరకు. ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఆయా రాశులకు సంబంధించిన గ్రహఫలాలు తెలుసుకుందాం…

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : అనుకున్న పనులు వాయిదా పడేలా ఉన్నాయి !

ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టిని పెట్టండి. ఈరోజు బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు అనుకున్న పనులు వాయిదా పడేలా ఉన్నాయి. ఈరోజు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్త. ఈరోజు అన్ని విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త.  మీకు సంబంధం లేని గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు తెలివి, ఓర్పును కలిగి ఉండండి.

రెమిడీః ఈ రాశివారు గణపతిని ఆరాధించండి గణపతి స్తోత్రం పఠించండి.

 

వృషభ రాశి : ఈరోజు బాధలు తీరుతాయి !

ఈరాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు వచ్చే అవకాశం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వాహన క్రయవిక్రయాలకు ఈరోజు అనుకూలంగా లేదు. ఈరోజు అప్పుల బాధలు తీరుతాయి, శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

రెమిడీః ఈ రాశివారు శ్రీలక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పఠించండి.

 

మిధున రాశి : అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ వ్యసనాన్నికైనా దూరంగా ఉండండి. ఈరోజు ఆచారంగా అంటే శుచి, శుభ్రతతో ఉండడం మంచిది. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. పెద్దలు చెప్పే మంచి మాటలు వినండి. ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి, సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోండి.

రెమిడీః ఈరోజు ఈ రాశివారు రామరక్షా స్తోత్రం పఠించండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కర్కాటక రాశి : ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడుపుతారు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి, పెద్దవారి సలహాలను పాటించండి. ఏ పని ప్రారంభించిన కష్టపడి పూర్తి చేస్తారు. ఆఫీస్‌లో సమయపాలన పాటించండి. ఈరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుపట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఈ రాశి వారికి బాగుంటుంది.

రెమిడీః ఈరోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేయండి.

 

సింహరాశి : తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకండి !

ఈరాశివారు యోగాతో, ధ్యానంతో ఈరోజుని ప్రారంభించండి. ఈరాశి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకండి, బాధ్యతారహితంగా ఉండకండి. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. పెద్దవారిని గౌరవించండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి.

 

కన్యారాశి : పనిలో మీకు ప్రశంసలు రావచ్చు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. క్రొత్త పరిచయాలను పెంచుకొండి. పనిలో మీకు ప్రశంసలు దక్కవచ్చు. ఈరోజు అంతా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు అనవసరపు విషయాలకు తొందరపడకండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు కోపాన్ని తగ్గించుకోండి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది.

రెమిడీః శ్రీలలితా సహస్రనామ పారాయణం చేయండి. అమ్మదయతో దోషాలు పోతాయి.

 

తులారాశి : అనవసరపు ఆలోచనలు చేయకండి !

ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అనవసరపు ఆలోచనలు చేయకండి. కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. మీమీద నరఘోష కనిపిస్తుంది. ఆహార నియమాలను పాటించండి. ఈరోజు ఎదుటివారితో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టండి. వైవాహికజీవితం అల్లరిమయంగా సాగిపోతుంది.

రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

వృశ్చిక రాశి : కోపాన్ని తగ్గించుకోండి !

ఈరోజు ఈరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవల్సింది కోపాన్ని తగ్గించుకోవడం. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. చేసినా మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

రెమిడీః ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించండి.

 

ధనస్సు రాశి : అద్భుతమైన వార్తను అందుకుంటారు

ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆకస్మిక ప్రయాణాలు చేయకండి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువు కోసం ధనాన్ని వెచ్చిస్తారు.కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.

 

మకర రాశి : కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు !

ఈరోజు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ తల్లితండ్రులు మీ విలాసవంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఏ పనినైనా ఆలోచించి చేయండి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి. మీరు కూడా ఎవరి వద్ద ఈరోజు అప్పులు తీసుకోకండి. వైవాహిక జీవితం సంతోషమయంగా ఉంటుంది.

 రెమిడీః ఈ రాశివారు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి : వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లల అవసరాలను పట్టించుకోండి. ఈరోజు ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఏపని గురించి అయినా తొందరపాటు పనికిరాదు. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టండి . ఈ రాశివారు ధైర్యంగా ఉండవలసిన సమయం ఈరోజు. కుటుంబ సభ్యులతో సానుకూలంగా మాట్లాడండి. వారి మాటలను గౌరవించండి, వైవాహికంగా బాగుంటుంది.

రెమిడీః శివుడిని ప్రదోషకాలంలో ఆరాధించండి, శుభాలు కలుగుతాయి.

 

మీన రాశి : పథకాలు అమలుపరచడానికి మంచి రోజు!

ఈరాశి వారు క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి మంచి రోజు. ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు పట్టుదలతో అనుకున్న పనులన్నీ సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బాగా శ్రమిస్తారు. మీఅమ్మగారి తరుఫున వారి నుండి ధన లాభాన్ని పొందుతారు. పనులు పూర్తికాక పోవడంతో అసహనంగా ఉంటారు .విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. వ్యాపారులు జాగ్రత్తగా లావాదేవీలు నిర్వహించాలి. వైవాహికంగా బాగుంటుంది. కానీ మీలో తెలియని అసంతృప్తి.

రెమిడీః దోషాలు తీవ్రత తగ్గడానికి ఈరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. లేదా దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి.

 

author avatar
Sree matha

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N