NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : ఫిబ్రవరి 1 – పుష్య మాసం – సోమవారం.

Horoscope :మేష రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఈరాశివారు మోసపోయే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మంచి యోగం కలిగినట్టే కలిగి దూరమవుతుంది. మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. స్నేహితులను తొందరపడి నమ్మకూడదు ద్రోహం చేసే అవకాశం ఉంది. దంపతుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల తో విభేదాలు వస్తాయి. వ్యాపారులకు స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. వేడుకల్లో పాల్గొనకపోవడం మంచిది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అవుతుంది. ఏ విషయాల్లో అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఒత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పినట్లు విని చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది.
రెమిడీః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

Horoscope :వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు !

ఈ రోజు బాగుంటుంది. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. అందర్నీ కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. సంతాన విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజ సేవ చేస్తారు, సాంఘిక కార్యకలాపలో పాల్గొంటారు, అత్య అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అనవసర ఖర్చులు చేయకుండా ఉండండి. ఆధ్యాత్మిక చింతనా ఏర్పరచుకుంటారు. దంపతుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి. చక్కగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఇంతకు ముందు రోజుల్లో ఉన్న ఇబ్బందులు తగ్గిపోయి ప్రశాంతం గా ఉంటారు. విద్యార్థులు కష్టపడి శ్రద్ధ పెట్టి బాగా చదువుకుంటారు. వ్యాపారంలో లో అధిక లాభాలు పొందుతారు.
రెమిడీః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించుకోండి.

Horoscope :మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రావు !

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. గతంలో ఉన్న శత్రువులు తిరిగి ఇప్పుడు బాధ పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రావు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. మానసిక వేదనకు గురవుతారు. ఎదుటి వారిని, అయిన వారిని అపార్థాలు చేసుకోకుండా ఉండడం మంచిది. ఇబ్బందులు కలుగుతాయి. నష్టపోయే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం ముఖ్యమైన లక్ష్యం. అనవసరపు విషయాలకు దూరంగా ఉండి తక్కువ మాట్లాడడం మంచిది. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక మనసు ప్రశాంతత కోల్పోతారు. మీ లో ఉన్న గర్వం అహంకారం తగ్గించు కోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోకుం,డా విద్య మీద శ్రద్ధ వహించడం వల్ల బాగుంటుంది.
రెమిడీః ఈ రోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి

Horoscope :కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఈరోజు మీరు తొందరపడకుండా, ఓర్పుగా సహనంగా ఉంటారు, పూల మొక్కల మీద మక్కువ చూపుతారు, మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధనాభివృద్ధి పొందుతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు, ఏ విషయాన్ని అయినా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచడం మంచిది. దైవభక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఉన్నత పదోన్నతుల ను పొందుతారు. వ్యాపారాల్లో వస్తు లాభం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

today february 1 daily horoscope in telugu
today february 1 daily horoscope in telugu

Horoscope :సింహరాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వాదోపవాదాల కు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేసిన తప్పులకు మీరే బాధ పడే అవకాశం ఉంది. వివాదాలకు, వాదోపవాదాల కు దూరంగా ఉండండి. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండడం మంచిది. తప్పులు చేసి మనస్థాపం పొందే అవకాశం ఉంది. మీకు మీరే మంచిగా మారిపోతారు, చేసే పనుల మీద నీతి నిజాయితీగా చెయ్యక బాధపడతారు. సోమరితనం వల్ల అనుకున్న పనులను వాయిదా వేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది. సమయాన్ని వినియోగించుకోకుండా వృధా చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. స్త్రీలు మానసిక ప్రశాంతత పొందే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం గా ఉంటుంది.

Horoscope :కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.మొండి బాకీలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. చేపట్టిన పనులన్నీ సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సఖ్యతగా ఉంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రులకు ఎదుటివారికి సహాయం చేయాలనుకుంటారు. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార భాగస్వాములతో స్వల్ప లాభాలు కలుగుతాయి. పెద్ద వారి ఆలోచనలను పాటిస్తారు. వారి నుంచి వచ్చే ఆస్తులు సంక్రమిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు. స్త్రీలు దేవతారాధనకు ప్రాధాన్యతనిస్తారు. అన్నిరకాల సమస్యల నుంచి బయటపడతారు.
రెమిడీః ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

Horoscope :తులా రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఏర్పడటం వల్ల ఐకమత్యం లోపిస్తుంది. ఏ విషయాల్లోనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. పనులు సరైన సమయానికి చేయలేక వాయిదా పడి, మానసిక ప్రశాంతత కోల్పోతారు. మొండి బకాయిలు వసూలు కావు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం ఏర్పడుతుంది. ప్రయాణాలు కు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఎదుటివారు అవసరానికి వాడుకొని వదిలేసే అవకాశం ఉంది. ఇంతకుముందు చేసిన తప్పులకు ఇప్పుడు సరిదిద్దుకొని బాధపడతారు. సమాజంలో గౌరవం కీర్తి లోపించే అవకాశం ఉంది. అనుకున్నది సాధించడానికి గట్టిగా పోరాడితేనే సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు చేసే పని సరిగ్గా చేయకపోవడం వల్ల పై అధికారుల నుంచి ఇబ్బందులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపారం నెమ్మదిగా కావాలి స్వల్ప లాభం ఏర్పడుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

Horoscope :వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వచ్చి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధన లాభం పొందుతారు. మీలో ఈరోజు ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీలో ఉన్న నీతి నిజాయితీ, ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. ఇంతకుముందు చేయని వర్క్ లను తిరిగి పూర్తి చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

Horoscope :ధనస్సురాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది !

ఈరోజు కష్టంగా ఉంటుంది. కారణాలు లేకుండా ఎవరితో అయినా విభేదాలు ఏర్పడతాయి. స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు సరైన సమయంలో కాక మనోవేదనకు గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. దూరప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడతాయి. తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడక పోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. చిన్నచిన్న అబద్ధాల వల్ల మీ మీద నింద పడుతుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు వల్ల నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులం చదువు మీదనే శ్రద్ధ పెట్టి అర్థం చేసుకుని చదవడం మంచిది.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.

Horoscope :మకర రాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి ధనవృద్ధి పెరుగుతుంది. నూతన గృహానికి కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సాంప్రదాయానికి, ఆచారాలకు ప్రాధాన్యతనిస్తారు. సాంప్రదాయకమైన ఆహారాన్ని ఇష్టపడతారు. గృహానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఆగిపోయిన శుభాకార్యాలు తిరిగి జరుపుతారు. మిత్రుల సహాయాన్ని పొందుతారు. గతంలో విడిపోయిన బంధువులు తిరిగి కలుస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి అనారోగ్యాలను తగ్గించుకుంటారు. ఉద్యోగ స్థలంలో బాధ్యతగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

Horoscope :కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.శత్రువులు పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. గర్వాన్ని అహంకారాన్ని తగ్గించుకోండి. అనవసరపు విషయాలు మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అయిన వారిని అపార్థం చేసుకోకపోవడం మంచిది. మార్పు వలన అమ్మడం, కొనడం చేయకపోవడం మంచిది. కష్టపడకుండా డబ్బులు రావాలని ఆరాటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పెద్దవారిని గౌరవించడం మంచిది. వారి మాటలను సూచలను పాటించడం వల్ల బాగుంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. కోపం వల్ల మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. స్త్రీలో విలువైన వస్తువులను స్వర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Horoscope :మీనరాశి Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.బాధలు నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. పట్టుదలతో అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. డబ్బు సంపాదించాలని ఆరాటపడుతారు. ఆర్థికాభివృద్ధి. అప్పుల బాధలు నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేస్తారు. మిత్రులతో కలిసి మెలిసి సఖ్యత గా ఉంటారు. దూరపు బంధువుల నుంచి, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తుల ఆఫీసులో మంచి పేరు తెచ్చు కొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని నూతన విద్యకు ప్రాధాన్యత నిస్తారు. స్త్రీలు తల్లి గారి ఇంటి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju