NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి 14 ఆదివారం..ఈ రాశి వారు వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : మాఘమాసం – ఫిబ్రవరి – 14- ఆదివారం.

మేష రాశి  Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. అందరూ మిమ్మల్ని గుర్తించాలని అనుకుంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. ఇతరుల కోసం కష్టపడతారు. ముఖ్యమైన విషయాల్లో మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలను పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.
రెమిడీ: లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయండి.

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.పనులలో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది. అప్పుల బాధలు పెరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. అనవసరపు ఖర్చులు ఏర్పడడం వల్ల ఇబ్బందులు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులతో అనవసరపు చర్చలు చేయడం వల్ల విభేదాలు ఏర్పడతాయి. సమయాన్ని వృధా చేస్తారు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీ: సంకటహర గణపతిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ధన వృద్ధి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఇతరుల కోసం బాగా కష్టపడతారు. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద వారి సూచనలను పాటిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీ: మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. కొత్త వ్యక్తులను నమ్మడం వలన నష్టపోతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. సమయానికి నిద్ర హారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు. మీలో ఉన్న లోపాన్ని గ్రహించకపోవడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల నష్టాలు. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో నిరాశ ఏర్పడుతుంది. విద్యార్థులు స్నేహితులకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది.
రెమిడీ: దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

today february 14 daily horoscope in telugu
today february 14 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.సోదరుల వల్ల లాభం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. సోదరుల వల్ల లాభం కలుగుతుంది. ధన సహాయం చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కల్గిస్తాయి. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో స్నేహితుల సహకారంతో గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాల వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న గర్వం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రతి విశయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేసిన తప్పులకు బాధ పడతారు. సమాజంలో లో మీకు ఉన్న గౌరవం తగ్గుతుంది. ఎంత కష్టమైన పనినైనా శ్రమించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పెద్ద వారిని గౌరవించక పోవడం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు.సనిహితులతో జాగ్రత్త.
రెమిడీ: శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ఆనందంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. మిత్రుల కలయిక ఆనందాని ఇస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి అధిక లాభాలను పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడానికి అనుకూలం. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. తప్పులను సరిదిద్దు కుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి మాట్లాడటం వల గొడవలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల నష్టం. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. బంధువులతో విభేదాలు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులకు స్నేహితుల వల విద్యా నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.కష్ట సుఖాలను పంచుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టిన లాభాలు కలుగుతాయి. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రకృతిని ఇష్టపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సాంప్రదాయక వంటల మీద ఆసక్తి చూపుతారు. స్నేహితులతో మీ కష్టసుఖాలను పంచుకుంటారు. మిత్రు లాభం పొందుతారు. ధర్మానికి, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. అప్పుల బాధలు తీసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు.
రెమిడీ: ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడక పోవడం వల ఇబ్బందులు కలుగుతాయి. చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆహార నియంత్రణ లేకపోవడం వలన చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రహస్యాలను ఇతరులకు చెప్పడం వలన ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.
రెమిడీ:ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ఒడిదుడుకుల నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఎంత కష్టపడి అయినా డబ్బులను బాగా సంపాదించాలి అనుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్న ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఖర్చులకు దూరంగా ఉండడం వల ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
రెమిడీ:శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 14-మాఘమాసం-ఆదివారంఈరోజు రాశి ఫలాలు.ధన నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారు మీ మీద నిండా వేసే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో సరైన పెట్టుబడులు పెట్టకపోవడం వలన నష్టాలు ఏర్పడతాయి. సంబంధం లేని విషయాలు చర్చించడం వల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు చేయడం వలన ధన నష్టం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ప్రశాంతత కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయక వాయిదా వేయడం వలన నష్టం. ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో అబద్దాలు చెప్పడం వల ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
రెమిడీ:లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju