NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : పుష్యమాసం – ఫిబ్రవరి – 2-  మంగళవారం.

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు చాలా బాగుంటుంది. చేపట్టిన పనులను శ్రద్ధగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గిపోయి సంతోషంగా ఉంటారు. బాగా సంపాదించాలని శ్రద్ధ చూపుతారు. సమయాన్ని వృధా చేయకూడదని అనుకుంటారు. వ్యాపార భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేసుకుంటూ అధిక లాభాలను పొందుతారు. ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. పూల మొక్కల మీద ఆసక్తి చూపుతారు. చేపట్టిన పనులన్ని పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో శ్రద్ధ పెట్టి పని చేయడం వల్ల పై అధికారులతో మెప్పు పొందుతారు.

రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకుంది.

 

Horoscope : వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మిత్రులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులు అవకతవకల అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దవారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఎవరితో మాట్లాడినా ఆలోచించి మాట్లాడడం మంచిది లేదంటే వారు మీకు దూరమవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇబ్బందికరంగా ఉన్న ధైర్యసాహసాలు వల్ల ముందుకు సాగుతారు. ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. గతంలో విడిపోయిన మిత్రులు తిరిగి కలుసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ చూపుతారు.  అనవసర ఖర్చులను చేయకుండా ఉంది డబ్బులను ఆదా చేస్తారు. మనసులో ఉన్న బాధలను కుటుంబ సభ్యులతో పంచుకొని విశ్రాంతిగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఇబ్బందులు తగ్గిపోయి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అధిక లాభాలు.

రెమిడీః ఈరోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మాట పట్టింపులు వల్ల అందరూ దూరం అయ్యే అవకాశం ఉంది. పనులను సరైన సమయంలో పూర్తి చేయలేక చికాకులకు గురవుతారు. ప్రశాంతత కోల్పోతారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడతాయి. గృహ స్థలాలను అమ్మకాలకు అనుకూలం కాదు. అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మంచిది కాదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు వినకుండా చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు. ఉద్యోగస్తులు ఆఫీసులలో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలు పెట్టుకోవడం వల్ల ఉద్యోగ నష్టం ఏర్పడుతుంది.

రెమిడీః దేవీ ఖడ్గమాలా స్తోత్రం చేసుకోండి.

today february 2 daily horoscope in telugu
today february 2 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. చేసిన తప్పులను పొరపాట్లను తిరిగి సరిదిదు కుంటారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులను గౌరవించి అందరితో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. డబ్బులను అధికంగా ఖర్చు పెడతారు. సంపద ఎక్కువ ఖర్చు తక్కువయ్యే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం తీసుకోకపోవడం చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.కోపంగా మాట్లాడడంతో నష్టపోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చికాకులు ఏర్పడి మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనవసరంగా డబ్బులు  ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఎదుటివారితో కోపంగా మాట్లాడడంతో నష్టపోతారు. మీరు చేసే తప్పుల వల్ల వచ్చే మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. ఆఫీసులో సకాలంలో పనులు పూర్తి చేయక మనోవేదనకు గురవుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం మల్ల ప్రశాంతత కోల్పోయి స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. చేపట్టిన పనులు అన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయం సాధిస్తారు. క్రొత్త వ్యాపారాలను ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. నిరుద్యోగులుకు ఉద్యోగఅవకాశం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, అందరితో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువుకోవాలని పట్టుదల పట్టి చదువుకుంటారు. రాబోయే రోజుల కోసం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. గతంలో విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలుసుకొని సఖ్యతగా ఉంటారు.

రెమిడీః శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలమైన రోజు కాదు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక మనోవేదనకు గురవుతారు. తొందరపడి అందర్నీ నమ్మడం వల్ల మోసపోతారు. కోపంగా మాట్లాడడం వల్ల అయిన వారు దూరం అవుతారు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు చేయడంవల్ల విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల పై అధికారులతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సరైన సమయానికి పూర్తిచేస్తారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రావాల్సిన డబ్బులు అవసరానికి చేతికి అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. అప్పుల నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తిరిగి తొలగిపోయి కలిసిమెలిసి ఉంటారు. తల్లి గారి ఇంటి నుంచి లాభం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు అన్నీ అర్థం చేసుకొని కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు.

రెమిడీః ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తికాక మనోవేదనకు గురవుతారు. కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు బద్దకంతో ఆలస్యంగా చేయడంవల్ల నష్టం. సమయానికి డబ్బులు చేతికి అందక మొండి బాకీలు వసూలు కాక ఇబ్బంది కలుగుతుంది. ధననష్టం కలుగుతుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. నమ్మక ద్రోహం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. అప్పులు చేయకుండా ఉండటం మంచిది. క్రొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబిక అష్టకం చేసుకోండి.

 

Horoscope : కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.గృహాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలను తగ్గించుకొని అందరితో ఆనందంగా ఉంటారు. సంపాదన మీద ఆసక్తి చూపుతారు. సంపాదించిన డబ్బులను భద్రంగా దాచి పెడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసి ప్రశాంతత పొందుతారు. స్త్రీలు తల్లి గారి ఇంటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీః లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసుకోండి.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి-2- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చికాకుల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. దీర్ఘాలోచన చేస్తారు. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది ,నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక ఆటంకాలు ఏర్పడతాయి. అపనమ్మకంతో పనిచేయడం వల్ల నష్టం. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ధననష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులకు స్నేహితుల వల్ల నష్టం. చదువు మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో గొడవ పడడం వల్ల పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju