NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope : మాఘమాసం – ఫిబ్రవరి – 21- ఆదివారం.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.స్నేహితులతో చికాకులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక ఆటంకాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ధననష్టం జరుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల మీకు సహాయం చేసేవారు దూరం అవుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. జ్ఞాపక శక్తి కోల్పోతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యంగా చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో మధ్యవర్తులను, భాగస్వాములను నమ్మడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను ఆలోచించడం వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.

రెమిడీ: దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.మొండి బకాయిలను వసూలు !

ఈరోజు బాగుంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన లాభం కలుగుతుంది. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

రెమిడీ: ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయలేక వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించ లేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఉన్నత వ్యక్తులతో సన్నిహితంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న అవకాశాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మీలో ఉన్న సుఖదుఃఖాలను ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు స్థల మార్పిడి అవుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

today horoscope february 21 daily horoscope  in telugu
today horoscope february 21 daily horoscope in telugu

సింహ రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.కుటుంబంలో సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అతిగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించ లేక పోవడం వల్ల ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. అనవసరపు ఖర్చులు అధికంగా చేయడం వల్ల నష్టం జరుగుతుంది. ధన నష్టం ఏర్పడుతుంది. ఏ విషయాల్లో ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చూపడం వల్ల నష్టపోతారు. వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం వల్ల నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యా రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు. పుస్తకాలను చదవడానికి ప్రాధాన్యతనిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారూ. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

తులా రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.వ్యాపారాల్లో నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలలో వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్న పనులు వాయిదా పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మానసిక వేదన ఏర్పడుతుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ: శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీలో ఉన్న తప్పులను సరిదిద్దు కుంటారు. విద్యార్థులు గతంలో కంటే బాగా కష్టపడి చదువుకుంటారు. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తగ్గించుకుంటారు. అందరితో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. విద్యార్థులు ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకుని బాగా చదువుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.అప్పుల బాధలు !

‌ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలకు అనుకూలం. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసే వారిని దూరం చేసుకుంటారు. ఇతరుల మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం వల్ల మానసిక కలతలు ఏర్పడతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు లేకపోవడం వల్ల నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆచార సాంప్రదాయాలకు, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. సంగీతానికి, నాట్యానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులుల పెట్టడానికి అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.మిత్రులు శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దురాశ వల్ల  నష్టాలు ఏర్పడతాయి. పెద్ద వారితో గొడవ పడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం ఏర్పడుతుంది. మీలో ఉన్న కోపం వల్ల మిమ్మల్ని అభిమానించే వారిని దూరం చేసుకుంటారు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 21 – మాఘమాసం -ఆదివారం.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ఏ పని చేసిన తెలివిగా సమయస్ఫూర్తిగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆశయాలను నెరవేర్చుకుంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. సంగీతం విషయంలో మక్కువ చూపుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కష్టసుఖాలను ఎదుర్కొంటారు. క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎదుటివారి కోసం కష్ట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. వ్యాపారాల్లో ఇబ్బందులు. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju