NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మాఘమాసం – ఫిబ్రవరి – 23 –  మంగళవారం.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలు, చికాకులు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదుటి వారిని నిందించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. తప్పుడు పనులు చేసే వాళ్ళను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఇబ్బందులు కలిగిస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోవడం వల్ల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులకు, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. సాంప్రదాయకమైన ఆహారానికి ఆసక్తి చూపుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ప్రయోగాలు చేస్తారు. ఏ విషయంలో అయినా స్నేహితుల సలహాలు తీసుకుని అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తులను  కొనుగోలు చేస్తారు. అప్పుల బాధలు తీరిపోతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

రెమిడీః లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.స్నేహితులు శత్రువులు అవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ఇతరులతో అనవసరంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు. అప్పు ఇవ్వడం తీసుకోవడం వల్ల నష్టం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.నూతన వ్యక్తులతో సంబంధాలు !

ఈరోజు బాగుంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించు కుంటారు, అధిక లాభాలు కలుగుతాయి. ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నతమైన హోదాలను పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నూతన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు.

రెమిడీః లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 23 daily horoscope in telugu
today february 23 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో ఇబ్బందులు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి, వాయిదా పడతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. కొన్ని విషయాల్లో ఆలోచించకుండా తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఏర్పడుతుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల, కోపం వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పులు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలించవు.

రెమిడీః దుర్గాదేవిని ఆరాధించండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.ఈరోజు పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను అనుసరించి ప్రతి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమస్యలకు తగ్గ ఫలితం దొరుకుతుంది. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప హోదాలను పొందుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు విని చదువు మీద శ్రద్ధ చూపుతారు.

రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

తులా రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.ఆరోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. పిల్లల విషయంలో ఆజాగ్రత్త వహించడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అనవసరపు విషయాల్లో వాదోపవాదాలు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ధననష్టం కలుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు సోమరితనం వల్ల చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు.

రెమిడీః శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటివారితో బాగా మాట్లాడి తెలివితో సమయస్ఫూర్తితో పనులు చేయించుకుంటారు. ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటి వారికి సహాయం చేస్తారు. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. అధిక సంపాదనకు ప్రాధాన్యతనిస్తారు. ఏ పనినైనా తొందరపడి చేయకుండా ఆలోచించి క్రమపద్ధతిలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీః శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.సహాయం చేసే వారు దూరం !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఎదుటివారితో తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీకు సహాయం చేసే వారు దూరం అవుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఏ పనిలో అయినా ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. రుణ బాధలను తీర్చుకుంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్నేహితులతో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితుల సహకారం తీసుకుంటారు.

రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో మొండి పట్టుదల పడతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ప్రయాణాలకు అనుకూలం. వాహన ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు బాగుంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అనుకున్న పనులను సమయస్ఫూర్తిగా, తెలివితేటలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహన కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. డబ్బును వృధా చేయకుండా ఆదా చేస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు కావలసిన వారి కోసం కష్టపడతారు. ఇతరుల మీద ఆధార పడడం వల్ల స్వల్ప ఇబ్బందులు. ఎదుటి వారికి సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీః మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

author avatar
Sree matha

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!