NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : ఫిబ్రవరి – 5  –  శుక్రవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం, తిథి: అష్టమి ఉదయం 10.08 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ సాయంత్రం 6.28 వరకు తదుపరి అనురాధ, వర్జ్యం: రాత్రి 10.17 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: ఉదయం 10.09 నుండి 11.40 వరకు, రాహుకాలం: ఉదయం 11.04 నుండి పగలు 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.04 నుండి 9.50 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.53 నుండి 1.39 వరకు.

 

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారూ. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. తొందరపడి అందరినీ నమ్మడం వల్ల మోసపోతారు, నమ్మకద్రోహం జరుగుతుంది. సమయానికి చేతిలో డబ్బులు అందక అప్పుల బాధలు పెరిగిపోయి ధననష్టం జరుగుతుంది. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. వ్యాపార పెట్టుబడులు పెడతారు. ఎదుటివారిని అపార్థం చేసుకోవడం వల్ల మీకు ఇష్టమైన వారు దూరం అవుతారు. దంపతుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః సంకష్టహర గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వల్ల అభివృద్ధి చెందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం లేకుండానే ముఖ్యమైన పనిలో విజయాన్ని పొందుతారు. కార్యసిద్ధి పొందుతారు. వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమయానికి పూర్తిచేస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది, ప్రమోషన్లు పొందుతారు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

Horoscope : మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.విద్య మీద శ్రద్ధ కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయి. క్రొత్త వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు జరపక పోవడం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల ధననష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సంబంధం లేని విషయాలు కల్పించుకోవడం వల్ల గొడవ పడే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించు కోవడం వల్ల విద్య మీద శ్రద్ధ కోల్పోతారు. ఎక్కువగా మాట్లాడడం వల్ల నష్టం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. కార్యాలయాల్లో పని ఒత్తిడి ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల స్వల్ప నష్టాలు.

రెమిడీః బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు  పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో అన్యోన్యంగా ఉంది వారి కోరికలను తీరుస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. శత్రువులతో కూడా సౌమ్యంగా ఓపికతో సమాధానం చెప్తారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థులు బాధ్యతలను తెలుసుకొని బాగా చదువుకుంటారు.

రెమిడీః శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

today february 5 daily horoscope in telugu
today february 5 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. నమ్మక ద్రోహం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల నష్టం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. తప్పుడు పనులు చేసేవాళ్లను ప్రోత్సహించడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఏర్పడటం వల్ల మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోవడం వల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో చికాకులు ఏర్పడి స్వల్ప నష్టం జరుగుతుంది.

రెమిడీః దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ధన లాభం పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. పిల్లల కోసం కష్ట పడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ప్రయాణ లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా ఓర్పుగా సహనంగా సరైన సమయానికి చేయడం వల్ల విజయం పొందుతారు. అనవసరపు ఖర్చు చేయకుండా ఉండి ధన లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు తొందరగా పూర్తి కాక మానసిక వేదన పడతారు. అప్పుల బాధలు పెరిగిపోయి ధననష్టం జరుగుతుంది. మీరు కోపంగా చిరాకుగా మాట్లాడడం వల్ల ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు. అనవసరపు కొనుగోళ్లకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించక పోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మిత్రులకు కూడా శత్రువులు అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు చదువుకోవాలని శ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః శ్రీ వేంకటేశ్వర స్వామి గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తగ్గిపోతాయి. గతంలో వసూలు కానీ మొండి బాకీలు ఈరోజు వసూలు అవుతాయి. ధన లాభం కలుగుతుంది. ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. పిల్లల కోసం వారి అవసరాల కోసం కష్టపడతారు. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పెద్దవారి నుంచి ధన లాభం పొందుతారు, వారి ఆస్తులు సంక్రమిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను సాధిస్తారు. రెమిడీః విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సంబంధం లేని అనవసరపు మాటల మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇష్టమైన వారు దూరం అవుతారు. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల నష్టాలు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో గొడవలు, ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.బాకీలు వసూలు చేసుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. పెద్ద వారి మాటలను, సూచనలను పాటిస్తారు. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. ఉన్నత వ్యక్తులను కలుసుకొని సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ధన నష్టం జరుగుతుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గతంలో మిమ్మల్ని కోప్పడిన వారికి ఈరోజు సరైన గుణపాఠం చెబుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. పోయిన రోజులకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించకపోతే సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న తొందరపాటు వల్ల ధన నష్టం జరుగుతుంది. స్నేహితులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా కనిపిస్తారు. చంచలమైన స్వభావం కలిగి ఉంటారు ఉంటారు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి.

రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 5 – శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. మీ కోసం కంటే ఎదుటివారి కోసం బాగా కష్ట పడతారు. చేపట్టిన పనులను పట్టుదల పెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన వృద్ధి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎదుటి వారు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. పెట్టుబడులు పెట్టి వ్యాపార లాభాలు పొందుతారు. సమయస్ఫూర్తిగా తెలివిని ఉపయోగించి ఏ పని ఎవరితో చేయించాలో వారితో చేయించుకుంటారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడతారు. ముఖ్య విషయాల్లో సరైన సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువు కుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju