NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : పుష్యమాసం – ఫిబ్రవరి – 6  –  శనివారం.

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు, వారు చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీః లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి.

 

Horoscope :  వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేయలేక మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేక ఇబ్బంది పడతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అసహనంగా ఉంటారు. మొండి బాకీలు వసూలు చేసుకోలేక అప్పుల బాధలు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర పనులు చేయడం వల్ల సమయాన్ని వృధా చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీః ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

Horoscope :  మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఆకస్మిక ధన లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. అవసరానికి డబ్బులు చేతికి అండి ఆకస్మిక ధన లాభం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. మిత్రులతో ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపుతారు. ముఖ్యమైన పనులు సరైన సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. నెమ్మదిగా సాగే పనులను తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, అనారోగ్యాన్ని తొలగించు కుంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ప్రయోగాలను చేస్తారు.

రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.శత్రువులతో ఇబ్బందులు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కోపానికి దూరంగా ఉండటం మంచిది. వేధింపులు కలుగుతాయి. శత్రువులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీలో నీతి నిజాయితీ లేకపోవడంవల్ల ఎదుటివారు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. రహస్యాలను బయటకి చెప్పడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరుగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు విని శ్రద్ధగా చదువు కోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనులు ఎక్కువై ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రశాంతత కోల్పోతారు.

రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 6 daily horoscope in telugu
today february 6 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు బాగుంటుంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు అనుకూలిస్తాయి. పిల్లకు డబ్బు సహాయం చేస్తారు. ధర్మానికి, నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. గతంలో ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు తిరిగి ఫలిస్తాయి. చేసిన అప్పులను తీరుస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వృద్ధి పెరిగి ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. కొత్త వ్యాపారలను ప్రారంభించి లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంటారు. ఏది కావాలో దానికోసం ధైర్యంగా పోరాడి సాధిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. శత్రువుల బాధ పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్యాలను ఎవరితో బయట చెప్పకుండా మీలోనే ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గి అనవసరమైన విషయాల మీద దృష్టి చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు చేసిన తప్పులను తిరిగి సరిదిద్దు కుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు మంచి జ్ఞాపకశక్తి కలిగి విద్య మీద శ్రద్ధ చూపుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. సమయానికి డబ్బులు చేతికి అండి ఆర్థిక లాభం పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో అనుకున్న స్థానాలకు మార్పు అవుతారు. స్త్రీలు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు.

రెమిడీః శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.బంధువులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరితో ఆయన నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన వస్తువులు పాడైపోయే అవకాశం ఉంది. మాట పట్టింపులు వల్ల ఇష్టమైన వారు దూరం అవుతారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరిగిపోతుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని తక్కువ చేసుకొని చదువుకున్న సబ్జెక్టులను మర్చి పోతారు. వ్యాపారాల్లో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల నష్టాలు జరుగుతాయి.

రెమిడీః శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేసుకోండి.

 

Horoscope : ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.సాంప్రదాయాల మీద ఆసక్తి చూపుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆచార సాంప్రదాయాల మీద ఆసక్తి చూపుతారు. కొత్త కార్యక్రమాలను చేయాలనుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి పనులను పంచుకుంటారు. అప్పుల బాధలు తగ్గించుకొని ఆర్థిక అభివృద్ధి పొందుతారు. చేపట్టిన పనులను పట్టుదలతో అధిక శ్రమ చేసి సరైన సమయానికి పూర్తిచేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పనిభారం పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను సరైన సమయానికి చేయక వాయిదా పడే అవకాశం ఉంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది, ఒత్తిడికి లోనుఅవుతారు. నీటి సంబంధమైన ఆహార సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాల్లో ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.గృహాన్ని కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న పనులు ఈరోజు పూర్తి అయితాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా సమర్థవంతంగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు. అనాధలకు సహాయం చేస్తారు. మానసిక ఒత్తిడిని పోగొట్టుకుంటారు. సంగీత సాహిత్యాల మీద ఆసక్తి చూపుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి లాభం పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలతలు ఏర్పడుతాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీః శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 6 – శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉద్యోగస్తులకు ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఆర్ధిక నష్టం జరుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండక వివాదాలు ఏర్పడతాయి. ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ రాబడి లేకపోవడంవల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడమే ఆలోచన నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపంగా మాట్లాడడం వల్ల మీరంటే ఇష్టపడేవారు దూరమవుతారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు పనికిరాని విషయాలను పట్టించుకోని విద్యను నిర్లక్ష్యం చేస్తారు.

రెమిడీః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !