Today Horoscope: జనవరి 2 – మార్గశిర మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 9th 2022
Share

Today Horoscope: జనవరి – 2 – ఆదివారం – మార్గశిర మాసం
మేషం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

Today Horoscope
Today Horoscope

వృషభం
ద్రూరప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. సంతానం విద్య ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బంది పడతారు.
మిధునం
సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం
సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.
సింహం
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
కన్య
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల
సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి , ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి.. వ్యాపార , ఉద్యోగాలలో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది.
వృశ్చికం
మిత్రులతో సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమౌతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
ధనస్సు
సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు.
మకరం
వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. మన మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కుంభం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీనం
నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందువినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

june 8 రాశి ఫలాలు సోమవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

Kumar

Today Horoscope సెప్టెంబర్ 21st సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope మార్చి-27- పాల్గుణ మాసం – శనివారం.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

Sree matha