Today Horoscope: మే 22 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 22 – శనివారం – వైశాఖ మాసం

మేషరాశి

ఈ రోజు చేప‌ట్టిన ప‌నుల్లో జాగ్ర‌త్తలు తీసుకోవాలి. కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా చేప‌ట్టి పూర్తి చేసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువెళతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోలేకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచింది. ఈ రోజు ఖర్చు ఎక్కువ చేస్తారు.

అదృష్ట రంగులు .. గోధుమ, బూడిద

రెమిడి.. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న‌, పేద‌లకు అన్నదానం

Today Horoscope:
Today Horoscope:

 

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు వ్యాపార‌, వృత్తిప‌ర‌మైన విష‌యాల్లో కొంత‌మేర ఒత్తిడి ఎదుర్కొంటారు. కొన్ని చిన్న చిన్న ఆందోళ‌న‌లు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలి. మీకు ఇష్టమైన వారి నుండి వచ్చే ఫోన్ కాల్ రోజంతా ఆనందాన్ని కల్గిస్తుంది. మీ భావాలను, బాధలను ప్రాణ స్నేహితులతో లేదా బంధువులతో పంచుకుంటారు.

అదృష్ట రంగులు ..కాషాయం, పసుపు

రెమిడి .. ఆంజ‌నేయ స్వామిని ఉపాస‌న చేయండి

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు కొన్నిఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆకస్మికంగా ప్ర‌యాణాలు చేప‌డుతుంటారు. మీరు దాన ధర్మాలు చేస్తారు. ఇది మిమ్మల్ని ఆనందాన్ని కల్గిస్తుంది. శ్ర‌మ‌కు గుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అదృష్ట రంగులు .. ఆరెంజ్, బంగారం

రెమిడి.. ల‌లితా అమ్మ‌వారిని పూజించండి

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఈ రోజు నూత‌న ప‌రిచ‌యాల విషయాల్లో జాగ్ర‌త్త‌లు వ‌హిస్తూ ఉండాలి. స‌మాజంలో మీకున్న గౌర‌వాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆర్థిక లాభాలను పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవాలి.

అదృష్ట రంగులు .. ఆకుపచ్చ,

రెమిడి .. శివుడికి పూజించండి

సింహరాశి

సింహ రాశి వారు చేప‌ట్టిన ప‌నులు కొంత నెమ్మ‌దిగా పూర్త‌వుతాయి. అలాగే భూ సంబంధిత వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. భవిష్యత్తుపై ఆలోచన పెట్టండి. మానసిక శాంతిని పొందుతారు.

అదృష్ట రంగుల .. కాషాయం, పసుపు

రెమిడి..  సుబ్ర‌మ‌ణ్య స్వామి పూజించండి

కన్యరాశి

ఈ రాశి వారు ఈరోజు ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో లోటుపాట్లు క‌నిపిస్తున్నాయి. పొరుగు వారితో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి.

అదృష్ట రంగులు .. ఆరెంజ్ , బంగారం

రెమిడి ..మ‌హా ల‌క్ష్మీ ఆరాధ‌న చేయండి

తులా రాశి

తులా రాశి వారు ఈ రోజు ప్ర‌ముఖుల నుంచి ఆహ్వానం అందుకుంటారు, శ్ర‌మ పెరుగుతుంది జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ఫలితాలు పొందుతారు.

అదృష్ట రంగులు .. గోధుమ, బూడిద

రెమిడి.. ల‌క్ష్మీ నార‌సింహ స్వామిని పూజించండి

వృశ్చిక రాశి

ఈ రాశి వారు నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. భావోద్వేగాలు చికాకు పెడతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అదృష్ట రంగుల .. ఆకుపచ్చ

రెమిడి .. ఆదిత్య హృద‌య స్తోత్ర పారాయ‌ణం చేయండి

ధనుస్సు రాశి

ధ‌నుస్సు రాశి వారు చేప్ట‌టిన ప‌నుల్లో కొన్నిఅవంత‌రాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంటి వద్ద పని చేసే సమయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టండి. స్నేహితులు, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు. ఖాళీ సమయంలో పార్క్ లో గానీ ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో గడుపుతారు.

అదృష్ట రంగులు .. వెండి, తెలుపు

రెమిడి.. విష్ణు సంబంధ‌మైన ఆరాధ‌న మేలు చేస్తుంది.

మకర రాశి

ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభ‌వార్త‌లు వింటారు.. అయితే ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకువస్తాయి. ఇంట్లో కొన్ని చికాకులు వస్తాయి.

అదృష్ట రంగులు .. వెండి, తెలుపు

రెమిడి ..  శివ‌పంచాక్ష‌రి జపం చేయండి

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఇదే క్ర‌మంలో ఆస్తి లాభాలు క‌నిపిస్తున్నాయి. దుబరా ఖర్చు పెట్టకండి. ఈ రోజు కొంత స్పెషల్ గా గడుస్తుంది.

అదృష్ట రంగులు .. ఎరుపు, పసుపు

రెమిడి .. మ‌హాల‌క్ష్మీ దేవిని పూజించండి

మీన రాశి

ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన ప‌నుల్లోజాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ప్ర‌యాణాలు వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

అదృష్ట రంగులు .. లేత తెలుపు, తెలుపు

రెమిడి.. విష్ణు స‌హ‌స్త్ర నామ స్తోత్ర పారాయ‌ణ చేయండి


Share

Related posts

Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.సమస్యల నుంచి బయటపడతారు !

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 3rd గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope: మే 9 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma