Today Horoscope: మే 23 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 23 – ఆదివారం –  వైశాఖ మాసం

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఊహలు నిజమవుతాయి. ఐటీ రంగం వారికి ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. సినీరంగం వారికి కలిసి వచ్చే కాలం. మహిళలకు శుభవర్తమానాలు.

అదృష్ట రంగులు… గులాబీ, లేత ఆకుపచ్చ.

రెమిడి .. గణేశ్ ప్రార్ధనలు మంచిది.

Today Horoscope
Today Horoscope

వృషభం

కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఒక ప్రకటన కొంత నిరాశ కలిగిస్తుంది. ఆత్మీయులతో తగాదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. కళాకారులకు ఒత్తిడులు. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితి. మహిళలకు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.

అదృష్ట రంగులు… పసుపు, తెలుపు.

రెమిడి .. నరసింహ స్తోత్రాలు పఠించాలి.

మిథునం

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులు, మిత్రులతో కలహాలు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. చర్మ సంబంధిత రుగ్మతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు బదిలీలు సంభవం. పారిశ్రామిక,వైద్య రంగాల వారికి నిరుత్సాహం. ఐటీ రంగం వారికి మానసిక అశాంతి. కళాకారులకు లేనిపోని ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన.

అదృష్ట రంగులు… ఎరుపు, కాఫీ.

రెమిడి .. దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటకం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. వస్తు, వస్త్ర లాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ సంస్థల నుంచి పిలుపు. కళాకారులు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది.

అదృష్ట రంగులు… గోధుమ, ఎరుపు.

రెమిడీ .. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల నుంచి విమర్శలు, అపవాదులు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధా కాగలవు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు అనారోగ్య సూచనలు.

అదృష్ట రంగులు… గోధుమ, తెలుపు.

రెమిడీ .. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

కన్య

కార్యజయం. శుభవార్తా శ్రవణం. ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి పిలుపు రావచ్చు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. ఆలయాలు సందరిస్తారు. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ప్రగతి పథంలో జరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు… పసుపు, కాఫీ.

రెమిడి .. ఆదిత్య హృదయం పఠించాలి. దిన రాశి ఫలం

తుల

పనులలో అలసత్వం. ఇంటాబయాట చికాకులు పెరుగుతాయి. బందువులతో విరోధాలు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు గందరగోళం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణాలు కొంత మందగిస్తుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. కళాకారులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో కొంత నిరుత్సాహం. మహిళలకు మానసిక అశాంతి.

అదృష్ట రంగులు… నీలం, తెలుపు.

రెమిడి .. హనుమాన్ ఛాలీసా పఠించండి.

వృశ్చికం

కొత్త పనులు చేపడతారు. ఎదుటవారికి సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు మంచి కాలం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులను దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు. ఐటీ రంగం వారికి విధుల్లో అభినందనలు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు, అభిమానులు పెరుగుతారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. మహిళలకు ధన, వస్తు లాభాలు.

అదృష్ట రంగులు.. ఆకుపచ్చ, గులాబీ.

రెమిడి … వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ధనుస్సు

కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ఆదరణ.

అదృష్ట రంగులు.. గోధుమ, ఆకుపచ్చ.

రెమిడి … ఆదిత్య హృదయం పఠించండి.

మకరం

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. గొంతు, ఉదరసంబంధిత రుగ్మతలు. ఇంటాబయటా బాధ్యతలతో సతమతమవుతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొంత ఆదుర్దా. అదనపు విధులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో ఆటంకాలు. కళాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సిన సమయం. మహిళలకు కుటుంబ సమస్యలు.

అదృష్ట రంగులు… ఎరుపు, ఆకుపచ్చ.

రెమిడి ..శ్రీ రామరక్షాస్తోత్రం పఠించండి.

కుంభం

ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా కొంత గందరగోళం. బంధువులతో విరోధాలు. నిర్ణయాలలో కొంత నిదానం పాటించాలి. ప్రత్యర్థులు మీపై ఒత్తిడులు పెంచుతారు. చర్మ సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవర్గాల వారు పర్యటనలు మధ్యలో రద్దు చేసుకుంటారు. కళాకారులకు నిరుత్సాహమే. విద్యార్థులు కృషికి ఫలితం ఉండదు. మహిళలకు కుటుంబ సమస్యలు.

అదృష్ట రంగులు… గులాబీ, ఆకుపచ్చ.

రెమిడి .. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

మీనం

పనుల్లో విజయం. ఆప్తులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులను దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు. ఐటీ రంగం వారికి విధుల్లో అభినందనలు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు.

అదృష్ట రంగులు… గోధుమ, తెలుపు.

రెమిడి .. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.


Share

Related posts

Today Horoscope: మే 3 – సోమవారం – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

ఈ శతాబ్ధపు అధిక మాసాలు ఇవే !

Sree matha

Today Horoscope: మే 15 – వైశాఖమాసం – రోజువారీ జాతక ఫలాలు

somaraju sharma