NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 11 – మార్గశిర మాసం – సోమవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అనుకునే పనులు పూర్తి !

ఈ రోజు బాగుంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులు ఈరోజు అనుకున్న సమయంలో పూర్తి అయిపోతాయి. ఈరోజు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈరోజు పట్టుదల పట్టి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. చేసిన తప్పులను ఈ రోజు చేయకుండా ఉంటారు. వస్తువులను అమ్మడం కొనడానికి అనుకూలమైన రోజు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వివాహం కాని వారికి అనుకూలమైన రోజు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన చేస్తారు. ఉద్యోగస్తులు చేసే వృత్తి మీద శ్రద్ధ పెట్టి వచ్చిన మంచి అవకాశాలను  అందుకుంటారు. ఈరోజు స్త్రీలకు వస్త్ర లాభం కలుగుతుంది. విద్యార్థులు ఈరోజు కష్టపడి  బాగా చదువుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు మరకత లక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 వృషభ రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప నష్టాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఈరోజు ఎదుటివారితో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఈరోజు వ్యాపార వృత్తుల్లో ఉన్నవారికి స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు బద్ధకంగా ఉండడం వల్ల పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ఆదాయం తక్కువగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. మానసిక వేదనకు గురవుతారు. ఈరోజు విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపించడం మంచిది.

రెమిడీ: ఈ రోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  కలుగుతాయి. మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఆగిపోయిన పనులను ఈ రోజు పూర్తి చేస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు బాధలు తగ్గిపోతాయి.  భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఏమైనా శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఆఫీస్లో బాగా పనిచేసి పై అధికారులతో మెప్పు పొందుతారు. ఈరోజు విద్యార్థులు చదువు విలువ తెలుసుకుని బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు లక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచం ఇబ్బందికరంగా  ఉంటుంది !

ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. ఆదాయం తక్కువ కర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడి  ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు మీరు చేయని తప్పుకు మీ మీద నింద పడే అవకాశం ఉంటుంది.  సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈరోజు తొందరగా ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈ రోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది  ఈ రోజు ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. ఈ రోజు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తగ్గించుకొని డబ్బు సంపాదించాలనే తపన పడతారు. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ మిత్రులను కలుసుకుని సంతోషంగా ఉంటారు. ఈరోజు మిలో ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీస్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు ధన లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు ఏ విషయాన్ని అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం మంచిది.ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తికాక మనోవేదనకు గురవుతారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులు ఆఫీసులో  ఇబ్బంది పడతారు. విద్యార్థులు మిత్రులకు దూరంగా ఉంది చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈ రోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పోటీ పరీక్షలో విజయం !

ఈ రోజు బాగుంటుంది  ఈ రోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు అప్పులు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. మొండి బాకీలు వసులవుతాయి. ఆగిపోయిన పనులు ఈ రోజు సమయానికి పూర్తవుతాయి. భార్య భర్తలు కలిసి మెలిసి ఒకరికొకరు సహాయంగా ఉంటూరు. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు ఈరోజు కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారు. ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగం లో అనుకున్న స్థానాలకి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. స్త్రీలు వస్తు లాభాన్ని పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను ఈ రోజు పొందుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే రోజుల్ల గురించి ఆలోచిస్తారు. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం మంచిది. ఈరోజు విలువైన కాగితాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు స్త్రీలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా వుంటారు !

ఈ రోజు బాగుంటుంది.ఈరోజు వివాహ నిశ్చయలకు అనుకూలమైన రోజు. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈరోజు చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరగుతుంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకుంటారు. ఇంతకుముందు ఉన్న భయాన్ని ఈరోజు తొలగించుకొని ధైర్యంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగం లో మంచి పేరు పొందుతారు. స్త్రీలకు పుట్టింటి నుంచి ధన లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ధన నష్టం కలుగుతుంది !

ఈరోజు తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. ఈరోజు తొందరగా ఎవ్వరికి చేతికి డబ్బు ఇవ్వకుండా ఉండటం మంచిది.అవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ధననష్టం కలుగుతుంది. ఈ రోజు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో జరుగక మానసిక ఒత్తిడికి గురవుతారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం సమస్యల ఏర్పడుతాయి. ఈరోజు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులు తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది లేదంటే వ్యాపార నష్టం నష్టం ఏర్పడుతుంది.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా వుంటుంది. ఏ పనులైనా అనుకున్న సమయంలో పూర్తి అయిపోతాయి. ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు వివాహాది శుభకార్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.ఈరోజు వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది. ఇంతకు ముందున్న అనారోగ్యాల నుంచి ఈరోజు బయట పడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు వాహ నాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు సమయానికి నిద్రాహారాలు తీసుకుంటారు. ఈరోజు విద్యార్థులు పెద్ద వారి మాటలను విని చదివి మీదనే దృష్టి పెడతారు. ఈరోజు స్త్రీలకు వస్త్ర లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసు కొండి.

 

మీన రాశి జనవరి -11- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎదుటి వారిని ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈరోజు అనవసరపు ఖర్చులు కు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని తొందరపాటు తనానికి దూరంగా ఉండడం మంచిది. ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఇష్టమైన వ్యక్తుల దూరం చేసుకునే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ రోజు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలో పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం, ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju