NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

​జనవరి –  16  – శనివారం – శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: తదియ ఉదయం 7.45 వరకు తదుపరి చవితి, నక్షత్రం: శతభిషం, రాత్రి తెల్లవారు జాము 6.10 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: పగలు 12.45 నుండి 2.24 వరకు, అమృత ఘడియలు: రాత్రి 10.42 నుండి 12.21 వరకు, రాహుకాలం: ఉదయం 9.38 నుండి 11.02 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.50 నుండి 8.19 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు !

ఈ రోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు మీ కోపానికి తొందర తనానికి  దూరంగా ఉండటం మంచిది లేదంటే మిమ్మల్ని ఇష్టపడే వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పని చేసిన ఓర్పుగా, సహనంగా ఉండటం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఏర్పడి ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి. ఈరోజు విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బందులను నుంచి బయటపడతారు !

ఈరోజు బాగుంటుంది. పట్టుదలతొ అన్ని పనులను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న అనేక రకాల ఇబ్బందులను నుంచి బయటపడతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు అప్పుల బాధ తీరిపోతుంది. బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. రాబోయే రోజుల కోసం ఆలోచించి కష్టపడతారు. చేసే ప్రతి పనిని ధైర్యంగా, సమర్థవంతంగా చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీ:  శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు తప్పుడు నిర్ణయం వల్ల ఇబ్బంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎదుటివారిని లెక్క చేయక పోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో తప్పు చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు చదువు మీదనే దృష్టిపెట్టి శ్రద్ధగా చదువు కోవడం మంచిది. ఈరోజు అనవసర కోపాలకు దూరంగా ఉంటే బాగుంటుంది లేదంటే మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా ఆచితూచి అడిగేసి నిర్ణయం తీసుకోవడం వల్ల బాగుంటుంది, లేదంటే తప్పుడు నిర్ణయం వల్ల ఇబ్బంది పడతారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్త్రీలు ఆధ్యాత్మిక చింతన చేస్తారు.

రెమిడీ:  శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పెద్దల మాటలను గౌరవిస్తారు !

ఈరోజంతా ఆనందంగా ఉంటుంది. ఈరోజు రుణబాధలు తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పెద్దల మాటలను గౌరవిస్తారు. సంతోషంగా ఉంటారు. మీ పిల్లల కోసం ఆలోచిస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ మిత్రుల యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకుని వారికి సహాయ పడతారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

సింహరాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు భగవంతుడు అన్న, ఆధ్యాత్మిక తత్వం అన్న బాగా ఇష్టపడతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అప్పులు చేయడం కానీ ఇవ్వడం కానీ చేయకుండా ఉండడం మంచిది, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చు పెట్టడం వల్ల  అపాత్రదానం చేసే అవకాశం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు జ్ఞాపకశక్తిని తగ్గించుకొని సోమరితనాన్ని పెంచుకుని అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల తో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు హైగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అందరూ ఆదరణ చూపుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని మీ ప్రతిభకు గుర్తింపును పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవారాధన చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార భాగస్వాములు కూడా లాభాలు పొందుతారు.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్నచిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది .ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. కారణం లేకుండా ఎవరితో అయినా వివాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది, లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. పెద్దవారిని గౌరవించడం, వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. నిద్రాహారాల విషయంలో జాగ్రత్త. తెలివిగా మాట్లాడక పోవడం వల్ల మీకు మీరే సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీదనే దృష్టి పెట్టడం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు !

ఈ రోజంతా బాగుంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అప్పుల బాధలు తేరిపోయి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, అయిన వారితో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు, భక్తికి ప్రాధాన్యతనిస్తారు. కష్టపడి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గొప్ప వ్యక్తితో పరిచయాం పెంచుకుంటారు.

రెమిడీ: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉద్యోగస్తులకు ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కోపాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఏదైనా వస్తువుల క్రయ విక్రయాలు  చేయడానికి  అనుకూలమైన రోజు కాదు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయక ఇబ్బంది పడతారు. మీ పిల్లల విషయంలో ఏదో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ పెరిగి స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

రెమిడీ: ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకొండి అంతా శుభం జరుగుతుంది.

 

మకర రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక ప్రశాంతత పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. దేవతారాధన చేస్తారు. ఉద్యోగస్తులకు పనికి తగ్గ లాభం కలుగుతుంది, పై అధికారుల కీర్తి పొందుతారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు. ఆర్థిక అభివృద్ధి పెరిగి ధనలాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కుంభరాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఇతరుల మీద ఆధార పడటం వల్ల ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు సమయానికి రాక ఇబ్బంది పడతారు. అప్పుల బాధలు పెరిగిపోయి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఎదుటివారిని ఎవ్వరిని తొందరగా నమ్మకంగా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. మీ పని మీరే చేసుకోవడం మంచిది, ఇతరుల మీద ఆధార పడటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. వ్యాపారంలో అనుకోని ఇబ్బందుల వల్ల స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -16- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. వివాహ ప్రయత్నాల చర్చలు ఫలిస్తాయి. పిల్లలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మంచి  స్థానాలను పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు.

రెమిడీ: శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?