NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి –  పుష్యమాసం  – 17 – ఆదివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం, తిథి: పంచమి ఉదయం 9.14 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉదయం 7.43 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: సాయంత్రం 6.12 నుండి రాత్రి 7.57 వరకు, అమృత ఘడియలు: రాత్రి తెల్లవారు జాము 4.40 నుండి తెల్లవారు జాము 6.25 వరకు, రాహుకాలం: ఉదయం 8.14 నుండి 9.38 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.49 నుండి 1.34 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 3.04 నుండి 3.49 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. డబ్బులు బాగా సంపాదించి అప్పుల బాధను తీర్చుకుంటారు. ఏ పని చేపట్టినా ఏకాగ్రత పెట్టి  ఆలోచించి  పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. మిత్రుల ఆదరణ పొందుతారు. ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తారు. వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకొని సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు.

రెమిడీ: ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బాగా కష్టపడతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పనిలో అయినా నిలకడ లేకుండా ఉంటారు. అనవసరపు ఖర్చులుకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తక్కువగా ఉండటం మంచిది, లేదంటే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు తొందరగా ఎవర్ని నమ్మకుండా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతో కలసి మెలసి ఉండటం వల్ల లాభం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అయిన వారి కోసం బాగా కష్టపడతారు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏ విషయాలు పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు. స్త్రీలు పని వత్తిడి వల్ల మానసిక వేదనకు లోనవుతారు.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

మిధున రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయట పడతారు. బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి కష్టపడి చదువుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి తాపత్రయపడతారు. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆచార సాంప్రదాయ పద్ధతిలో ప్రాధాన్యతనిస్తారు. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. తల్లి గారి ఇంటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ:కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పులు చేయకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. తలపెట్టిన పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరితో గొడవ పడకుండా, వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ఆచార సాంప్రదాయాలకు మక్కువ చూపుతారు. విడిపోయిన మిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. అప్పుల బాధలు తీరిపోయి ధన లాభం పొందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకుంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో వృద్ధి పెరుగుతుంది. దృఢమైన నమ్మకంతో చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీ:ఈరోజు నవ చంద్రిక మాల స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు అనుకూలంగా లేదు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్టపడే వారికి దూరం అయ్యే అవకాశం ఉంది. అప్పుల బాధలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండటం మంచిది. సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఎవరితో అయినా తెలివిగా, సమయస్ఫూర్తిగా మాట్లాడడం మంచిది. ఆచారలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది లేదంటే ఇబ్బంది పడతారు. కోపాలకు దూరంగా ఉండటం మంచిది. దగ్గర స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టడం మంచిది.

రెమిడీ:ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అయిన వారితో మీ కష్టాన్ని, ఇబ్బందులను పంచుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. సరైన వైద్యున్ని సంప్రదించి వైద్యుడి ప్రకారం మందులు వాడి అనారోగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారు. పెద్ద వారి మాటలను సూచనలను పాటిస్తారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

రెమిడీ: శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అప్పుల బాధలు పెరిగి ఆర్థికాభివృద్ధి  తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చేయని పొరపాట్లకు ఎదుటి వారు నిండిచే అవకాశం ఉంటుంది.  మీ సంతానం కోసం అధిక ఖర్చు చేస్తారు. ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకునే విషయానికి దూరంగా ఉండటం మంచిది. ఎవరైనా కొత్త వ్యక్తులు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.  ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ పెట్టి చదవడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు.

రెమిడీ: ఈరోజు మానసా దేవి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.గోసేవ చేస్తారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తక్కువగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. దానధర్మాలు చేయడానికి శ్రద్ధ చూపుతారు. కుటుంబంలో సమస్యలను తగ్గించుకొని ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. గోసేవ చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని వారికున్న ప్రతిభను చూపిస్తారు.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆర్ధిక నష్టం !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్ధిక నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. వివాహ సంబంధ విషయాల చర్చలకు అనుకూలమైన రోజు కాదు. మీ కోపమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. కోపంగా ఉండటం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరమైన ఆలోచనలు చేయకుండా చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి !

‌ఈరోజు బాగుంటుంది. క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రద్ధ చూపుతారు. సంతాన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తప్పని సమయంలో ఇతరులతో పని చేయించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటారు. స్థిరాస్థులు కలిసి వస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.

రెమిడీ: లక్ష్మి అష్టోత్రం పారాయణం తెలుసుకోండి.

 

మీన రాశి జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు శ్రమగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో గొడవ పడకుండా ఉండటం మంచిది. అప్పు చేయకుండా ఉండటం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను వాయిదా వేయకుండా సరైన సమయంలో పూర్తి చేయడం మంచిది. ఈరోజంతా శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. మానసిక వత్తిడికి గురవుతారు. ఎవరికీ మాట ఇవ్వకుండా ఉండటం మంచిది. అభిప్రాయబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులు బద్దకాన్ని వదిలి సమయం వృధా చేయకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

 

author avatar
Sree matha

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju