NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 18 – సోమవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం, తిథి: పంచమి ఉదయం 9.14 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాభాద్ర      ఉదయం 7.43 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: సాయంత్రం 6.12 నుండి రాత్రి 7.57 వరకు, అమృత ఘడియలు: రాత్రి తెల్లవారు జాము 4.40 నుండి తెల్లవారు జాము 6.25 వరకు, రాహుకాలం: ఉదయం 8.14 నుండి 9.38 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.49 నుండి 1.34 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 3.04 నుండి 3.49 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు అందరితో బాగా మాట్లాడుతారు. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు సరిదిద్దికుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఇంతకుముందు ఎవరితోనైనా గొడవ పడ్డ ఈరోజు వారు మీకు మిత్రులు అవుతారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక తత్వం ఏర్పరచుకుంటారు. ఉద్యోగుల్లో శ్రద్ధగా పని చేసి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. స్త్రీలు వస్తు లాభం పొందుతారు, అందరితో సఖ్యతగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 వృషభ రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసులో ఇబ్బందులు !

ఈరోజు కొంచెం అనుకూలంగా ఉండటం లేదు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బలమైన ఆహారం తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు ఈరోజు మనోవేదనకు గురవుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: దుర్గా దేవి దేవి అష్టోత్తర పారాయణం తెచ్చుకోండి.

 

మిధున రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అప్పుల బాధ నుంచి బయట పడతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు కావలసిన స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కష్టంగా ఉన్న పనులను కూడా శ్రమపడి పూర్తి చేస్తారు. చేసే పని మీద శ్రద్ధ పెట్టి పూర్తిచేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధనాభివృద్ధి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో కీర్తి పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

రెమిడీ: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కర్కాటక రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి లేదంటే ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. కష్టపడినా ఫలితం లేకపోవడం వల్ల మనోవేదన పడే అవకాశం ఉంటుంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది. విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టి చదువుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులలో ప్రక్క ఉద్యోగులతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  శ్రీ చంద్రశేఖరాష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభమే కలుగుతుంది.

 

సింహరాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంపాదన మీద శ్రద్ధ చూపుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయంలో ధైర్యంగా పూర్తి చేస్తారు. ఈరోజంట మనోధైర్యాన్ని కలిగియుంటారు. సంపాదన మీద శ్రద్ధ చూపుతారు,సంపాదించిన డబ్బును వృద్ధి చేయాలనుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని అనవసరపు ఖర్చులను చేయకుండా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. గతంలో విడిపోయిన స్నేహితులు తిరిగి  స్నేహం కోరుకుంటారు. దంపతులు కలిసి మెలిసి ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు, ఇంతకుముందు ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది. విద్యార్థులు బాగా చదువుకొని ప్రాజెక్ట్ వర్క్లను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారం ఒకేసారి అభివృద్ధి చేంది లాభాలు పొందుతారు.

రెమిడీ:  విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. గతంలో ఎవరికైనా మాట ఇస్తే ఈరోజు తప్పే అవకాశం ఉంది. ఈరోజు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. బకాయిలు వసూలు కాక ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ:  ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభం జరుగుతుంది.

 

తులారాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్పుల బాధ నుంచి బయట పడి మొండి బకాయిలు వసూలు చేసుకొంటారు. ధన లాభం పొందుతారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొంటారు. ఈరోజు అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. స్త్రీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో విశేషమైన లాభాలు కలుగుతాయి.

రెమిడీ:  లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. రాబోయే రోజుల గురించి ఆలోచించి ఆందోళన పడతారు. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి కాక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల కోసం ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. కోపాలకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే ఇష్టమైనవారు దూరమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. స్త్రీలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు.

రెమిడీ:  ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

 

ధనస్సు రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. క్రయవిక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. చిన్నప్పటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. మీలో ఉన్న బాధలను ఇతరులతో పంచుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. మంచి మంచి పుస్తకాలను చదువుతారు. ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకొని అందరితో ఆనందంగా ఉంటారు. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

రెమిడీ:  ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మానసిక ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసరపు ఖర్చులు చేసి ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. పనులు వాయిదా పడడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. కోపంగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు శ్రద్ధగా వ్యాపారం చేయలేక నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.గౌరవ మర్యాదలను పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని , మొండి బాకీలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంతకు ముందున్న అనారోగ్యము తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. విహార యాత్రలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. మీలో ఉన్న కోర్కెలను తీర్చుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల ఉత్తీర్ణత పొందుతారు. స్త్రీలకు లాభం కలుగుతుంది, కుటుంబంలో గౌరవ మర్యాదలను పొందుతారు.

రెమిడీ:  ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. ఎవరికీ డబ్బులను అప్పు ఇవ్వకపోవడం మంచిది, ఇవ్వడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడం మంచిది, ఆస్తి గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పనులను నిమ్మదిగా చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలు ఎలాంటి ఆలోచనలు ఆలోచించకుండా ఉండటం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

రెమిడీ:  ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

author avatar
Sree matha

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N