NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 19 – పుష్య మాసం – మంగళవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.మొండి బకాయిలు వసూలవుతాయి !

ఈరోజు బాగుంటుంది. అందరితో కలిసిమెలిసి పని చేయడానికి మక్కువ చూపుతారు. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు. రాబోయే రోజుల కోసం ప్రణాళిక వేసుకుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో వసూలు కాని మొండి బకాయిలు ఈరోజు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. క్రొత్త క్రొత్త నిర్ణయాలను తీసుకుంటారు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనుల కన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ధర్మానికి ఆచారానికి సాంప్రదాయానికి ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యులతో, ఆయన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆఫీసులో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. బంగారు ఆభరణాలు లభించే యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు.

రెమిడీ: ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

 వృషభ రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తపన పడతారు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికోసం పోరాడుతారు, కష్టపడతారు. అనుకున్న పనులు సరైన సమయంలో కాక వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. మనోవేదన పడే అవకాశం ఉంటుంది. ఏ విషయానికైనా ఇతరుల మీద ఆధారపడకుండా మీ సొంతంగా మీరే చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార లాభాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఏ విషయానికైనా, ఏ పనికైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల బాగుంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. అనుకున్న లక్ష్యాలను చేరడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి తపన పడతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది, ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు.

రెమిడీ: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, గణేష్ హోమం చేయించుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మిధున రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తగ్గిపోయి మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. విలువైన ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అన్నా తమ్ముళ్ల నుంచి శుభవార్తలు వింటారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తుల నుంచి సహకారం తీసుకుంటారు. ఇంతకుముందు ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు తిరిగి ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీసులలో తోటి ఉద్యోగులతో పోటీపడి పని చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులను గౌరవించి బాగా చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కర్కాటక రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజా దేవాలయ దర్శనాలు చేసుకుంటారు !

ఈరోజా అనుకూలంగా లేదు. ఏ పని చేసిన ఇతరుల మీద ఆధార పది చేయడం వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మీలా ఉన్న గర్వానికి ఇతరులు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మనోవేదనకు గురి కాకుండా క్రమశిక్షణతో చదువు మీద ఏకాగ్రత పెట్టడం మంచిది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక నష్టం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. దగ్గర స్నేహితులు కూడా సహాయం చేయకుండా ఉంటారు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏరపడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

సింహరాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. విలాస జీవితాన్ని గడపడానికి మక్కువ చూపుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు వసూలు చేసుకొని అప్పులు తీరుస్తారు. ధనాభివృద్ధి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు తిరిగి ఫలిస్తాయి. గృహాన్ని కొనుగోలు చేస్తారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. మీ కోసం కంటే ఎదుటివారి కోసం కష్ట పడతారు. విద్యార్థులు ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకుని చదువు మీద ఏకాగ్రత పెడతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు.

రెమిడీ: లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కోపానికి వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అవసరమైన ఖర్చులు పెట్టడం మంచిది. కొత్తవారిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేయవలసిన ముఖ్యమైన పనులు చేయలేక విసుగు, చిరాకు పడే మనోవేదన పడతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వలన మనస్థాపం చెందుతారు. విద్యార్థులు మిత్రులతో దూరంగా ఉంది చదువు మీదనే ఆసక్తి చూపడం మంచిది.

రెమిడీ: ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 తులారాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. మిత్రుల సహకారంతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. సంగీత సాహిత్య కార్యకలాపాలకు ఆసక్తి చూపుతారు. వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సాంప్రదాయక ఆహారాణికి స్వేచ్ఛ చూపుతారు. గతంలో గొడవపడ్డ వారితో తిరిగి కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యమైనా శ్రమపడి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

 వృశ్చిక రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.శారీరకశ్రమ వల్ల ఒత్తిడి!

చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఇంతకు ముందు ఉన్న మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పు తీసుకొని వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. వాదాలకు, కోపానికి దూరంగా ఉండడం మంచిది. మీకు ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. ఏ పనిలో అయినా శారీరకశ్రమ పడడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచించి ఆచితూచి తీసుకోవడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధువులతో, మిత్రులతో గొడవ పడకుండా ఉండటం మంచిది లేదంటే దూరం అయ్యే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు గొడవలులో కల్పించి పోకుండా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీదనే దృష్టి పెట్టి చదువు కోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు లాభకరంగా ఉంటుంది !

ఈరోజు లాభకరంగా ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలని ప్రయత్నిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకొని ఖర్చులకు దూరంగా ఉండి ధన లాభం లాభం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గతంలో ఆగిపోయిన ప్రయాణాలు తిరిగి చేసే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో, ప్రతి పనిలో సమయస్ఫూర్తిగా తెలివిగా ఆలోచించి చేయడంవల్ల ఫలితం పొందుతారు. పిల్లల కోసం ఖర్చు పెడతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని లాభం పొందుతారు. కొత్త వ్యాపారలు చేయడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. స్థిరాస్తుల తీసుకోవడానికి వాయిదా వేసుకోవడం మంచిది. దైవ చింతన చేస్తారు. సమయం వృధా చేయకుండా అనుకున్న పనులను కష్టపడి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది. స్త్రీలు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

రెమిడీ:  శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

 మకర రాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. తల్లిదండ్రులతో, పెద్దవారితో సఖ్యతగా ఉండడం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకోవడం మంచిది కాదు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన మిత్రులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మిత్రద్రోహం జరుగుతుంది. అసమర్థులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లలతో సఖ్యతగా ఉండడం మంచిది. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరితో అయినా కఠినంగా మాట్లాడటం ఉండా ప్రేమగా మాట్లాడటం మంచిది. ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి అర్థం చేసుకుని చదవడం మంచిది. వ్యాపార విస్తరణ లేక స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  ఈరోజు లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఆర్థిక లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా శ్రమపడి పూర్తి చేస్తారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయంగా ఉంటారు. వివాహం కాని స్త్రీలకు వివాహ అవకాశాలు కలుగుతాయి. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అప్పుల బాధలు తీర్చుకొంటారు ఆర్థిక లాభం పొందుతారు. డబ్బులను ముఖ్యమైన అవసరాలకు ఖర్చు పెడతారు. ప్రకృతి మీద మక్కువ చూపుతారు. ఎదుటి వారికి, అయినవారికి ధర్మ బోధనలు చేస్తారు. మీ వాక్చాతుర్యం వల్ల ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో, ఆయన వారితో సఖ్యతగా ఉంటారు. ఎవరినైతే ఇష్టపడతారో వారికి దగ్గరగా ఉంటారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. గతంలో ఎప్పట్నుంచో అనుకున్న అనుకున్న వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని రాబోయే రోజుల కోసం ఆలోచించి బాగా చదువుకుంటారు. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి పొందుతారు.

రెమిడీ:   కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీనారాశి జనవరి -19- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బంది పడతారు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎదుటి వారు మిమ్మల్ని అవసరానికి వాడుకొని తర్వాత మిమ్మల్ని లెక్కచేయకుండా ఉంటారు. రుణబాధలు పెరిగి సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బంది పడతారు. కోపాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది మంచిది లేదంటే కుటుంబ సభ్యులు దూరం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. ఇబ్బందుల నుంచి బయట పడడానికి మిత్రుల సహకారం తీసుకుంటారు. స్త్రీలకు పని వత్తిడి వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. క్రొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండడం మంచిది. ఎదుటి వారితో ఎవరితోనైనా కోపంగా మాట్లాడకుండా సమయస్ఫూర్తిగా మాట్లాడటం అవసరం మంచిది.

రెమిడీ:   దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శించుకుని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోవడం శుభ ఫలితాలు కలుగుతాయి.

 

author avatar
Sree matha

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !