Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు
Share

జనవరి – 21 – గురువారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం, తిథి: అష్టమి పగలు 3.51 వరకు తదుపరి నవమి, నక్షత్రం: అశ్వని పగలు 3.37 వరకు, వర్జ్యం: ఉదయం 11.07 నుండి పగలు 12.55 వరకు, పునర్‌ వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 2.26 నుండి 4.14 వరకు, అమృత ఘడియలు: ఉదయం 7.31 నుండి 9.19 వరకు, రాహుకాలం: పగలు 1.52 నుండి 3.17 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 10.35 నుండి 11.20 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 3.20 నుండి 3.50 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. వ్యాపార పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనేక రకాల సమస్యల నుంచి బయట పడతారు. పెద్దవారి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనవృద్ధి పెంచుకుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉన్నత పదవులను స్వీకరించే అవకాశం ఉంటుంది. పిల్లల కోసం డబ్బు ఖర్చు పెడతారు. బాధ్యతాయుతంగా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. స్నేహితుల యొక్క సహకారాలతో పనులను పూర్తి చేసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేయలేని పనిని కూడా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో చేసి చూపిస్తారు.

రెమిడీ: అష్టాదశ పీఠ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని డబ్బుల కోసం వేధించే అవకాశం ఉంటుంది. మానసిక వేదనకు గురవుతారు. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది, అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పు ఇవ్వడం తీసుకోకపోవడం చేయకుండా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆయన వారు, మిత్రులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మిత్రులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు మానసిక వేదన కలిగే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని వృధా చేయకుండా వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. అనుకున్న పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి దర్శించుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మిధున రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.అన్నదమ్ముల నుంచి శుభవార్తలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. చేసే పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఎదుటివారితో తప్పని పరిస్థితుల్లో పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది, కొన్ని పనులు ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం కలుగుతుంది. ప్రజల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. పెద్దవారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. అందరితో బాగా మాట్లాడడం అవసరం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కలిసొస్తాయి. ఉద్యోగ స్థలం పై అధికారులతో కీర్తింపబడతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఘటిస్తారు.

రెమిడీ: శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ధన నష్టం జరిగే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. అప్పులు తీసుకోవడం, ఇవ్వడం చేయకుండా ఉండటం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడం మంచిది, మరచిపోయే అవకాశం ఉంటుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం మంచిది. ఈరోజు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది.

రెమిడీ: దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆచితూచి అడుగు వేస్తారు !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార వృత్తులవారు పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తారు. ధన వృద్ధి కలుగుతుంది. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం మీద ఆసక్తి   చూపుతారు. గతంలో రావాల్సిన మొండి బకాయిలు ఈరోజు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనికి తగ్గ ఫలితం ఉండడం వల్ల సంతోషంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తారు. విద్యార్థులు కష్టపడి చదివి కొన్ని కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేయాలని ఆసక్తి చూపుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసులో ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసరపు వ్యక్తులతో స్నేహం చేయకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు వృత్తిపరంగా శ్రద్ధ తగ్గడం వల్ల ఆఫీసులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఇష్టంలేని పనులు చేసే అవకాశం ఉంటుంది. మీ పని మీరే చేసుకోవడం మంచిది. ఇతరులకు అప్ప ఇప్పడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ ఆహారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. డబ్బులు బాగా సంపాదించదానికి మక్కువ చూపుతారు. ఇతరుల మీద ఆధారపడకుండా మీ సొంతంగా మీరు పనులు చేసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. ఇంతకుముందు చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వారితో ప్రేమగా మాట్లాడటం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: బాలా స్తుతి పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

వృశ్చిక రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప లాభాలు పొందుతారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకుముందు విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు. శత్రువులు సైతం మిత్రులు అవుతారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ఖర్చు ఎక్కువైనా తిరిగి సంపాదించుకుంటారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టినప్పుడు ఆలోచించి పెట్టడం మంచిది, స్వల్ప లాభాలు పొందుతారు. అప్పులను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మానసిక ఒత్తిడికి లోనవుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. ది పెద్ద వారి మాటలను, సూచనలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వివాహ సంబంధ విషయాలకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు. ఆఫీసులో ఉన్నత స్థాయి స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. వ్యాపార వృత్తి వారికి లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. శత్రువుల వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సఖ్యతగా ఉండడం మంచిది, లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవడం మంచిది, వాయిదా పడే అవకాశం ఉంటుంది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. తక్కువ మాట్లాడడం వల్ల బాగుంటుంది. వ్యాపారంలో అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందరితో కలిసి మెలిసి ఉండడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు గురు గ్రహ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి చేయడానికి శ్రమ పడతారు. ఆదాయం పెరిగి ఖర్చు తక్కువగా ఉంటుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఉన్నత వ్యక్తిలతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. పనులన్నీ ఏ ఆటంకం లేకుండా జరిగిపోతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -21- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు తప్పుడు నిర్ణయాల తీసుకోవడం వల్ల నష్టం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, తప్పుడు నిర్ణయాల తీసుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఉండటం మంచిది, మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేయని తప్పులకు మీ మీద నింద పడే అవకాశం ఉంది. ఎవరితో విభేదాలు పెట్టుకోకుండా, కోపంగా మాట్లాడకుండా ఉండటం మంచిది. అనవసరపు ఖర్చులుకు దూరంగా ఉండటం మంచిది, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు విని చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: శ్రీ వెంకటేశ్వర గోవింద నామస్మరణ పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 


Share

Related posts

Mahavishnuvu: శ్రీ మహావిష్ణువును ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో  తెలుసా ??

siddhu

Robbery: బ్రేకింగ్..కూకట్ పల్లిలో సినీ పక్కీ కాల్పులు..! భారీ దోపిడీ..!!

somaraju sharma

Samantha: సమంతపై దర్శకుల కామెంట్స్ వైరల్ …!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar