NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి –  22 – శుక్రవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం, తిథి: నవమి సాయంత్రం 6.29 వరకు తదుపరి దశమి, నక్షత్రం: భరణి సాయంత్రం 6.40 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం: లేదు, అమృత ఘడియలు: పగలు 1.16 నుండి 3.04 వరకు, రాహుకాలం: ఉదయం 11.03 నుండి పగలు 12.28 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.05 నుండి 9.50 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.50 నుండి 1.36 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కోపాలకు, గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. శత్రులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. మీకు సహాయం చేసే వారి మీద చిరాకు పడకుండా ఉండటం మంచిది. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. తొందరగా ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను దొంగిలించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. స్త్రీలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

రెమిడీ: కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.పెద్ద వారి సూచనలను పాటిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి మాటలను సూచనలను పాటిస్తారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకొని డబ్బులను వృధా చేయకుండా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి ఇతరులతో పని చేయించుకుంటారు. సాంప్రదాయక ఆహారాలను తీసుకోవడం మంచిది .ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఓర్పుగా సహనంగా ఉండి పనులను పూర్తి చేసుకుంటారు. చాలాకాలం నుంచి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు ఈరోజుకి తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీపడి కష్టపడి చదువుకుంటారు. స్త్రీలకు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తగ్గిపోయి సంతోషంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

మిధున రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా తొందరపడి ఆలోచించకుండా నిమ్మడిగా తీసుకోవడం మంచిది. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. కోపానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే మనోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు అంటే ఇష్టపడే వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది జాగ్రత్త. మీరు ఒక్కరే ఉండకుండా అందరితో కలిసి మెలిసి ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్నేహితులకు దూరంగా ఉంది చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

రెమిడీ: ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.పోయిన వస్తువులను తిరిగి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఏలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఓర్పుగా సహనంగా, సమయస్ఫూర్తిగా పనులు పూర్తి చేసుకుంటారు. గతంలో పోయిన వస్తువులను తిరిగి పొందుతారు. ఇతరులకు సలహాలివ్వడం, వారి నుంచి సలహాలు తీసుకోవడం చేస్తారు. దగ్గర మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకొని సంపాదన మీద దృష్టి పెడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఏ పనినైనా పూర్తిచేస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా రహస్యాలను ఎవరితో చెప్పకుండా ఉండడం మంచిది. క్రమబద్ధీకరణతో  ఆలోచించి పనులను   పూర్తి చేసుకుంటారు. దంపతుల అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులను పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు.

రెమిడీ: కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. అయిన వారితో కలిసి ప్రయాణం చేయడం మంచిది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం మంచిది, ఆటంకాలు కలిగి వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు చేసే పని మీద శ్రద్ద పెట్టి చేయడం మంచిది. మీ పని మీరే చేసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్నేహితులతో దూరంగా ఉండి చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైనా ధైర్యంగా సాహసంగా ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి మొండి బాకీలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. అయిన వారి నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్న చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒకరు సహాయంగా ఉంటారు. ఎవరైనా డబ్బులు అడిగినా మీ నుంచి సహాయం అడిగిన కాదనకుండా లేదనకుండా ఇస్తారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. గో సేవ చేయాలని తపన పడతారు. వ్యాపారాన్ని విస్తరించుకొని లాభాలు పొందుతారు. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది, పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీ: గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి అంటా శుభప్రదం.

 

తులారాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. విలువైన పత్రాల మీద సంతకాలు  చేయకుండా ఉండటం మంచిది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా ఓర్పుగా సహనంగా ఉండడం మంచిది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలమైన ఆహారానికి ప్రాధాన్యతనివ్వడం మంచిది. ఎదుటి వారిని అయిన, వారిని అపార్థం చేసుకోకుండా ఉండడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటి వారికి ధర్మ బోధనలు చేస్తారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఏమైనా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ధన లాభం పొందుతారు. వాహన కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు మీలో ఉన్న నిరసన పోగొట్టుకొని ధైర్యసాహసాలను కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు ఇంతకు ముందు ఉన్న చికాకులు తగ్గిపోయి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు సబ్జెక్టులను అర్థం చేసుకుని బాగా చదువుతారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో నష్టం !

ఈరోజు కొంచెం అనుకూలంగా లేదు. ఎదుటి వారు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు. మొండి బకాయిలు వసూలు కాక ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. విలువైన పత్రాలు మీద రాతపూర్వక వ్యవహారాలు చేయకుండా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో తక్కువగా ఉండటం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. మీ మిత్రులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ:  శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఆగిపోయిన పనులు పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులు పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అయిన వారి సహకారంతో అన్ని పనులను పూర్తి చేసుకుంటారు. ఏ పని ప్రారంభించినా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. స్త్రీలకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీసులలో పని తగ్గించుకుని సంతోషంగా ఉంటారు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టి కష్టపడి చదువుకుంటారు. ఈరోజు మీలో మార్పు తెచ్చుకుంటారు.

‌రెమిడీ: దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి.

 

 కుంభరాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు మానసిక ప్రశాంతతను కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త. వ్యాపార భాగస్వాములతో గొడవపడి నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువై మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో, సోదరులతో సఖ్యతగా ఉండడం మంచిది. తొందరపాటు తనానికి దూరంగా ఉండడం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడం వల్ల మీకే నష్టం. పెద్దవారిని గౌరవించడం మంచిది, వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. స్త్రీలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

‌రెమిడీ:ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు దైర్యంగా ముందుకు సాగుతారు !

ఈరోజు బాగుంటుంది. అన్ని రకాల పనులను సంతోషంగా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు వేరొక విద్యార్థులతో పోటీపడి కష్టపడి బాగా చదువుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఎదుటివారికి సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వృద్ధి పొందుతారు. ధన లాభం కలుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి ఎంత కష్టమైనా పడి దైర్యంగా ముందుకు సాగుతారు. కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పనులు మీరే పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో మంచి అవకాశాలు వస్తాయి.

‌రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju