NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 23- శనివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: దశమి రాత్రి 8.56 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: కృత్తిక రాత్రి 9.32 వరకు తదుపరి రోహిణి, వర్జ్యం: ఉదయం 8.07 నుండి 9.54 వరకు, అమృత ఘడియలు: సాయంత్రం 6.52 నుండి రాత్రి 8.39 వరకు, రాహుకాలం: ఉదయం 9.39 నుండి 11.04 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.50 నుండి 8.20 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఓర్పుగా సహనంగా ఉండడంవల్ల లాభం !

ఈరోజు బాగుంటుంది. పెద్దలు చెప్పిన మాటలను గౌరవిస్తారు. సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ధన నష్టం చేయకుండా అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు.  అయినవారి కోసం, మిత్రుల కోసం కష్ట పడతారు. చేపట్టిన పనులను శ్రద్ధగా కష్టపడి పూర్తి చేస్తారు. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే చేసుకుంటారు. ఓర్పుగా సహనంగా ఉండడం వల్ల లాభం కలుగుతుంది. ఎవరితో అయినా తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో రావాల్సిన డబ్బులు ఈరోజు సమయానికి చేతికి అందుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఇబ్బంది !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి చేయకుండా వాయిదా పడే అవకాశం ఉంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పనులు మీరే మీరే చేసుకోవడం మంచిది, ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండడం మంచిది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆఫీసులో శ్రద్ధగా పని చేయకపోవడం వల్ల పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు  హనుమంతుని ఆరాధన చేయండి శుభ ఫలితాలే కలుగుతాయి.

 

మిధున రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఎలాంటి క్లిష్ట సమస్యనైన కష్టపడి  ఓర్పుగా సహనంగా ఉంది ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కీర్తిప్రతిష్టలను పొందుతారు. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ మాట తీరు వల్ల విడిపోయిన బంధువులు, స్నేహితులు కలుస్తారు. ఆలోచించి పని చేయడం వల్ల అన్ని పనుల్లో గెలుపు పొందుతారు. చదవడానికి, క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో ఇంతకుముందు ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్రం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కర్కాటక రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది !

ఈరోజు అనుకూలంగా లేదు.చిన్నచిన్న పనులు చేయడానికి కూడా మొహమాట పడతారు. ఎవరితో స్నేహం చేయకుండా ఉండటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న పనులు సమయానికి చేయకుండా బద్దకించి వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా పెద్దవారితో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు. తొందర పడడం వల్ల అప్పులు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా చదువు మీద ఏకాగ్రత మంచిది.

రెమిడీ: శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పేరు ప్రతిష్టలు పొందుతారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. భగవంతుని సేవ చేయాలని అనుకుంటారు. గోసేవ చేయడానికి ఆసక్తి చూపుతారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన అభివృద్ధిని పెంపొందించుకుంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తుల ఆఫీసులో మీద పైచేయిగా ఉంటారు. వివాహ సంబంధ విషయ చర్చలకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల వలన లాభం పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసులో ఒత్తిడి !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో  క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు  మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.  చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. కుటుంబ సభ్యులతో సక్కతగా ఉండటం మంచిది, లేనిపోని విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. పని వత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. మీరంటే ఇష్టపడే వారితో గొడవ పడే అవకాశం ఉంది. ఆఫీసులో పని ఒత్తిడి.

రెమిడీ:  దుర్గా దేవి ఆరాధన చేసుకోండి.

 

 తులారాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మిత్రుల నుంచి సహకారం పొందుతారు. విడిపోయిన దంపతులు ఒకటవుతారు. అన్యోన్యంగా ఉంటారు. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. సమాజ సేవ చేసే అవకాశం ఉంటుంది. పిల్లల మీద శ్రద్ధ పెడతారు. ఎదుటి వారితో, ఆయన వారితో ఆనందంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఏ పని చేపట్టినా అనుకున్న సమయంలో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాట ప్రకారము నడుచుకొని బాగా చదువుకుంటారు. అన్నిరకాల వ్యాపారస్తులకు లాభం.

రెమిడీ: ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అనుకున్న పనులు వాయిదా !

ఈరోజు కష్టంగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. విరోధులు పెరిగే అవకాశం ఉంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడతారు. మీకు ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీ బద్ధకం వల్ల అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరి మీద నిందలు వేయకుండా ఉండడం మంచిది, మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టబడును పెట్టకపోవటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

రెమిడీ:  లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో వృద్ధి !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో విడిపోయిన మిత్రులు తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. అనుకున్న దానిని సాధించడానికి బాగా కష్ట పడతారు. అధిక శ్రమ చేస్తారు. ప్రయాణ లాభం కలుగుతుంది. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే చేసుకొని అభివృద్ధి చెందుతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. ఏ విషయంలో అయినా మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకొని మార్పులు తెచ్చుకుంటారు. నిరుద్యోగలకు ఉద్యోగావకాశం. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారంలో సరైన నిర్ణయం తీసుకొని కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో వృద్ధి చెంది లాభాలు పొందుతారు.

రెమిడీ: గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సమయస్ఫూర్తిగా లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే బాగుంటుంది, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడి  అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఏ పనిలో అయినా, ఏ విషయంలో అయినా సమయస్ఫూర్తి తనం లేకుండా ఉండడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల స్నేహితులకు దూరంగా ఉంది చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. అబద్ధాలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంటుంది. పెద్దవారిని గౌరవించడం మంచిది.

రెమిడీ: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇతరులతో పని చేయించుకుంటారు !

ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి చేయడం వల్ల వృద్ధి చెందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి శ్రద్ధ చూపుతారు. నూతన గృహాన్ని లేదా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత పరిచయాలు ఏర్పరచుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. తెలివిగా సమయస్ఫూర్తిగా ఇతరులతో పని చేయించుకుంటారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వలన వృద్ధి చెంది లాభాలు పొందుతారు ఉద్యోగ స్థలం అధికారుల మాటలు విని పనిచేసి ప్రమోషన్లు పొందుతారు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు

రెమిడీ: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -23- శనివారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప నష్టాలు !

ఈరోజు కష్టంగా ఉంటుంది. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఏ విషయంలోనైనా బాధ్యత లేకుండా ఉంటే సమస్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అక్రమ మార్గంలో సంపాదించడం అనే ఆలోచన చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

 

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!