NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope పుష్యమాసం – జనవరి 26 –  మంగళవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

 Horoscope మేష రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.సంపాదన తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యల పెరగడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉండి. అనవసరపు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. కోపానికి, చిరాకు దూరంగా ఉండటం మంచిది లేదంటే మీకు సహాయం చేసేవారు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎవరిని తిట్టడం, నిందించడం చేయకుండా ఉండటం మంచిది. శత్రువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. అప్పుల బాధలు పెరిగిపోయి నష్టం జరిగే అవకాశం ఉంది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి స్నేహితులను, ఎదుటి వారిని ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది.  కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేయకుండా ఉండటం మంచిది లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. మోహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మిత్రులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది, స్వల్ప లాభం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం.

 

 Horoscope వృషభ రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. రుచికరమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. సాంప్రదాయక వంటలకు ప్రాధాన్యతనిస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారం  ప్రారంభించడం దానికి ఆసక్తి చూపుతారు, పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. ఏ పని చేసిన ఒక ప్రణాళిక బద్ధంగా చేసే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి ధన లాభం పొందే అవకాశం ఉంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగస్తులు ఆఫీసులలో గౌరవ మర్యాదలను పొందే అవకాశం ఉంది.

రెమిడీ: లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 Horoscope మిధున రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు మాటలకు దూరంగా ఉండటం మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కోపంగా మాట్లాడకుండా ఉండటం మంచిది. చిరాకులకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనితీరు బాగా లేకపోవడం వల్ల బదిలీ అయ్యే అవకాశం ఉంది. దంపతులు అన్యోన్యంగా ఉండటం మంచిది. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తొందరపడి అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండడం మంచిది. పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టక పోవడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

 Horoscope కర్కాటక రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసులో పదోన్నతులు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. బాధ్యతగా అన్ని రకాల పనులను చేపట్టి పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తొలగిపోయి అనవసర ఖర్చులకు దూరంగా ఉండి సమయానికి డబ్బు లు చేతికందే అవకాశం ఉంది. ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరించడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఆలోచించి ముందడుగు వేసి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో పదోన్నతులను అందుకుంటారు, ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి బాగా చదువు కోవాలని తపన పడతారు. సమాజ సేవ చేయాలని ఆశిస్తారు. ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

 Horoscope సింహరాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కొన్ని పనులు అనుకున్న సమయంలో కాక నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది. మొండి బకాయిలు వసూలు కాక ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.మీకంటే తక్కువ స్థాయి వారితో గొడవ పడకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎవరితో గొడవ పడకుండా ఉండడం మంచిది, లేదంటే అందరూ దూరం అయ్యే అవకాశం ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఎక్కువ పని భారం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది.

రెమిడీ: దేవి అపరాధ స్తోత్రం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

 Horoscope కన్యారాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.కీర్తి ప్రతిష్టలు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా పెద్దవారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సువర్ణ భరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన కలగడం వల్ల అనుకున్న పనులు సులువుగా  పూర్తయ్యే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కష్టపడి చదువుకుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీ: ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణ చేసుకోండి.

 

తులారాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.పిల్లల విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. కోపాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువులు దూరం అయ్యే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. రాబడి తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లల విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంది. మీలో ఉన్న తప్పులను దాచుకోవడం వల్ల నష్టం. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీరు చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్న ప్రతిభకు తగ్గట్టు కష్టపడి చదువుకోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.సమస్యల నుంచి బయట పడతారు !

ఈరోజు బాగుంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతారు. ఏ విషయంలో అయినా సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల బాగుంటుంది. మీ వాక్చాతుర్యం వల్ల మిమ్మల్ని అందరూ ఆకట్టుకుంటారు. ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి ఈరోజు బయట పడతారు. అయినా వారికి, మిత్రులకి సహాయం చేయాలని తపన పడతారు. ఎంత కష్టాన్నయినా ధైర్యంగా, సాహసంగా ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవాన్ని కీర్తిని పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఏదో ఒకటి సాధించాలనే తపన పడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎక్కువ ధనసంపాదన చేయడానికి ఆసక్తి చూపుతారు. పుస్తకాలను చదివి క్రొత్త విషయాలను తెలుసుకోవాలి అని అనుకుంటారు. ప్రతి పనిలో తొందరపడకుండా ఆలోచించి పని పూర్తి చేసి విజయం పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు, ప్రయోగాలు చేయాలని అనుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు.

రెమిడీ: కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం !

ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులలో వచ్చిన అవకాశాలను చేర్చుకోవడం వల్ల మనోవేదన కలిగే అవకాశం ఉంది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఎవరిని పట్టించుకోకుండా మీ స్వార్థంగా మీరే ఉండడం ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్త్రీలు మానసిక వేదనకు గురి అయ్యే అవకాశము ఉంది.

రెమిడీ: శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆదాయాన్ని పెంచుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడి ఆదాయాన్ని పెంచుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా  ఉండే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఎంత కఠినమైన విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల తోటివారితో కలిసి కష్టపడి పని చేస్తారు, గొప్ప పేరు పొందుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. సున్నిత మనస్తత్వం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు అనుకూలంగా లేదు. చంచల స్వభావం కలిగి ఉంటారు. ఒక పని చేసేటప్పుడు అనేక రకాల పనుల మీద శ్రద్ధ పెడతారు. వ్యాపారంలో ఒక రకమైన పెట్టుబడి కాకుండా అనేక రకాలైన పెట్టుబడులు పెట్టడం చేస్తారు. అనవసరమైన అనుమానాలతో మనసు ప్రశాంతతను  కోల్పోయే అవకాశం ఉంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేక వాయిదా పడే అవకాశం ఉంది. అప్పులు చేయకుండా ఉండడం మంచిది. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో మీ మీద గౌరవం తగ్గే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రద్ధగా చదువు కోవడం మంచిది.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

మీన రాశి జనవరి -26- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారంలో లాభాలు !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేసే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. డబ్బులను వృధా చేయకుండా పొదుపు చేయాలని అనుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా చేసుకోవడం వల్ల బాగుంటుంది, లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. సమయానికి నిద్రాహారాలు తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు. దానధర్మాలు చేయడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు కొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి, దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!