NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : జనవరి – 28 – పుష్యమాసం – గురువారం.

మేష రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆఫీసుల్లో ఇబ్బందులు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. డబ్బులను ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది, నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. పనులను సరైన సమయానికి పూర్తి చేయడం మంచిది, నిమ్మడిగా చేస్తుండడం వల్ల వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటం మంచిది లేదంటే విభేదాలు కలిగే అవకాశం ఉంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోలేక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. రోజంతా తక్కువగా మాట్లాడడం మంచిది, అతిగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. విద్యార్థులు రాబోయే రోజుల గురించి ఆందోళన పడకుండా చదువు మీద ఏకాగ్రత పెట్టి చదవడం వల్ల బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ:ఈరోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలు ఫలితాలు కలుగుతాయి.

 

వృషభ రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సాంకేతిక విద్య మీద ఆసక్తి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఎలాంటి కష్టాన్నైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. గోసేవ చేయాలనుకుంటారు. ఖర్చుకు కావలసిన డబ్బులు సమయానికి చేతికందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో పై అధికారుల మెప్పు పొందుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. మాట తీరుతో అందరిలో గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వాటికి తగ్గట్టు లాభాలు పొందుతారు.

రెమిడీ:బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో నష్టాలు !

ఈరోజు  ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులతో వాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. పెద్దవారిని గౌరవించడం, వారి సూచనలను పాటించడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది, ఆర్ధిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్లు. విద్యార్థులు విద్య మీద ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపారంలో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తగ్గిపోయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు కలిగే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొంటారు. వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పెద్ద వారు చెప్పిన మాటలు విని బాగా చదువుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీలు మనసులో ఉన్న కోరికలను ఇతరులతో పంచుకొని కోర్కెలను తీర్చుకుంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయ పడతారు. ఎంత కష్టమైన విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకుంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today january 28 daily horoscope in telugu
today january 28 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కష్టంగా ఉంటుంది !

ఈరోజు కష్టంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేయలేక వాయిదా పడే అవకాశం ఉంది. మనోవేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయడం వలన, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మీలో ఉన్న బాధను ఎవరితో చెప్పలేక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. మాట జారడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కన్యారాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సహనంగా ఓర్పుగా పూర్తి చేస్తారు. ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిత్రులకు సహాయం చేయాలనుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రాణాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: శ్రీ భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.సంపాదన తక్కువగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు చేయడం వలన డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉంది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకొని  మెలుగుతారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది.  వ్యాపారంలో లాభాలు తక్కువై మనోవేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ స్థలంలో వచ్చిన మంచి అవకాశాలను పోగొట్టుకునే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. ఎదుటి వారి తప్పులను సరిదిద్దే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో కోపాలకు గురైన భార్యాభర్తలు ఈరోజు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు సబ్జెక్టులో ఉన్న సందేహాలను స్నేహితులతో చర్చించి తెలుసుకొని బాగా చదువుకుంటారు. ఏ విషయాన్ని అయినా రహస్యంగా ఉంచడం మంచిది, అందరికీ చెప్పడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతకుముందు మీ కోపంతో ఎవరినైనా దూరం చేసుకుంటే తిరిగి వారిని దగ్గర చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: శివాష్టకం పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం !

ఈరోజు అనుకూలంగా లేదు. మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పకండి మీలో మీరే బాధ పడే అవకాశం ఉంది. మనోవేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన వైద్యం చేయించుకోవడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది. ఎదుటి వారిని నమ్మకుండా ఉండడం మంచిది, మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో జాగ్రత్త. స్నేహితులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

 

మకర రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులకు ప్రాధాన్యత నిస్తారు. కుటుంబంలోని  వ్యక్తులను గౌరవిస్తారు. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. ఏ విషయంలోనైనా దీర్ఘాలోచన చేసి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని తపన పడతారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు మంచి అవకాశాలను  అందుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజుపిల్లల విషయంలో జాగ్రత్త !

ఈరోజు కష్టంగా ఉంటుంది. మీలో ఉన్న మాట పట్టింపు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే తప్పులకు మీలో మీరే బాధ పడే అవకాశం ఉంది, ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవడం మంచిది. బలమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని దూరం చేసుకోవడం మంచిది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మీన రాశి Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అనారోగ్యాలను తగ్గించుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు సమయానికి అందుతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడి సంతోషంగా ఉంటారు. క్రొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెద్దల ఆలోచనలను, మాటలను పాటిస్తారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకుంటారు. మీ మాటల వల్ల అందరూ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పెద్దల మాటలను విని చదువు మీద శ్రద్ధ చూపెడతారు, ఇతర విద్యార్థులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించుకొని ధన ప్రాప్తి పొందే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N