NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -7- గురువారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 7 – గురువారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం, తిథి: నవమి రాత్రి 11.58 వరకు తదుపరి దశమి, నక్షత్రం: చిత్త పగలు 3.46 వరకు, వర్జ్యం: లేదు, అమృత ఘడియలు: ఉదయం 9.44 నుండి 11.15 వరకు, పునర్‌ అమృత ఘడియలు: రాత్రి తెల్లవారు జాము 5.59 నుండి మర్నాటి ఉదయం 7.29 వరకు, రాహుకాలం: పగలు 1.46 నుండి 3.10 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 10.31 నుండి 11.16 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 2.59 నుండి 3.43 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

 మేష రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు అందరూ మెచ్చుకునేలా ఉంటారు. ఈరోజు ఆదర్శవంతంగా ఉంటారు. ఏ విషయం అయినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈరోజంతా సమయానుకూలంగా ఉంటారు, ఎవరితోనైనా సమయానుకూలంగా మాట్లాడతారు. ఈ రోజు బాగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను గౌరవిస్తారు. ఈరోజు పరువు ప్రతిష్టలకు విలువనిస్తారు. ఇతరుల కోసం కష్టపడతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఏ విషయం అయినా మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు సరి చేసుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతంగా ఉంది సమస్యలన్నింటిని తీర్మానం చేసుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో, సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు ఏ పని చేసినా క్రమశిక్షణగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. ఈరోజు ఉద్యోగస్తుల ఆఫీసుల్లో ఒకరికొకరు సహాయంగా ఉంటూ పని చేసుకుంటూ గొప్ప పేరును పొందుతారు.

రెమిడీ: ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికాభివృద్ధి !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చు లకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు పెద్ద వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. ఏ విషయాన్నైనా పెద్ద వారి ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకుంటే మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఈరోజు విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు మీ కోపానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే మీకు ఇష్టమైన వ్యక్తులను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ పనినైనా సహనంగా ఓర్పుగా చేసుకోవడం మంచిది. ఈరోజు తొందరపడి ఎవరికీ అప్పులు ఇవ్వకపోవడం మంచిది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు అనవసర విషయాలను వదిలేసి చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు !

రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆయన వారి కోసం ,ఇతరుల కోసం కష్ట పడతారు. ఈరోజు  కుటుంబ సభ్యులతో కలసిమెలసి ఆనందంగా ఉంటారు, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తారు. ఈరోజు కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు ఉన్న దానిలో మీకు ఉంచుకొని ఇతరులకు దానం చేస్తారు. ఈరోజు ఇతరలు తప్పు చేస్తే వారిని క్షమించే సౌమ్యగుణం కలిగి ఉంటారు. ఈరోజు ముఖ్యమైన విషయంలో తీసుకోవడం వల్ల జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఆఫీస్లో ఉద్యోగం చేసేటప్పుడు సమయానుకూలంగా ఇతరులతో మాట్లాడుతూ కీర్తిని పొందుతారు. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించి బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు ఆశించిన ధన లాభం వస్తుంది.

రెమిడీ: ఈరోజు శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.వాహన ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు అయినా వారిని దూరం చేసుకుని బాధ పడతారు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందక బాధపడతారు. ఈ రోజు అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు ఎవరి తప్పులను ఎత్తి చూపకుండా ఉండటం మంచిది లేదంటే వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ విషయాల్లో ఆయన అనవసరంగా ఆలోచించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది. ఈ రోజు అప్పులు చేయడం చేయకుండా ఉంటే మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు.

రెమిడీ: ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ పనిని ఇతరులు కూడా కష్టపడి పూర్తి చేస్తారు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు వ్యాపారం లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఈరోజు డబ్బులు ఎక్కువగా సంపాదించాలని శ్రద్ధ చూపుతారు. ఈరోజు మీలో ఉన్న కోపాన్ని చిరాకులను తగ్గించుకొని ఆనందంగా గడుపుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం కనిపించకుండా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు అనవసరమైన ఖర్చులను చేయకుండా ఉండడం మంచిది. ఈరోజు ఎవరితో అయినా మాట్లాడితే ఆలోచించి మాట్లాడడం మంచిది, తొందర పడకుండా ఉండటం మంచిది. ఈరోజు అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది లేదంటే మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు వివాహాది శుభకార్యాలు దగ్గరికి వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు విషయంలో వాయిదా వేయకుండా అనుకున్నా సమయంలో కష్టపడి చదువు కోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం, శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు క్రయ విక్రయాలుకు అనుకూలమైన రోజు !

ఈరోజు ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన పనులు ఈరోజు పూర్తి అయిపోతాయి. ఈరోజు మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు ఏ విషయంలోనైనా నిజాన్ని గ్రహించి మంచి మార్పు తెచ్చుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు క్రయ విక్రయాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు ఇంటికి స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు డబ్బు సంపాదించడానికి శ్రద్ధ చూపుతారు. ఈరోజు విలువైన వస్తువులను, సువర్ణ భరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగం లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు బంధువులతో మిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు ప్రయత్నం లేకుండా అదృష్టం కలిసి వచ్చే టట్లుగా అనుకోకుండా ఉద్యోగం వస్తుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద బాగా శ్రద్ధ వహించి చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి.

రెమిడీ: రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ కోపం చిరాకు వల్ల అయిన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆహారాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు అవసరమైన పనులు, తప్ప పనులు చేయడం వల్ల మీకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరమవుతాయి. రాబోయే రోజుల్ల గురించి భయాందోళనలు పడతారు. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ పెట్టి చదువు కోవడం మంచిది. ఈరోజు విలువైన స్వర్ణాభరణాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

రెమిడీ: ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఏ పనులు అయినా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు పట్టుదలతో ధైర్యంగా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే ఈరోజు మెరుగుపడుతుంది. ఈరోజు అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. ఈరోజు మీ తెలివితేటలను, సామర్థ్యాలను వెలిబుచ్చుతూ ఉంటారు. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలను గౌరవించి రాబోయే రోజులలో ఆలోచించుకొని విద్య మీద శ్రద్ధ వహించి బాగా చదువుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి.

రెమిడీ: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ చూపించడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఈరోజు కోపంగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. ఈరోజు చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఆలయ దర్శనం చేయాలనుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

కుంభరాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు దంపతులిద్దరూ ఇంతకుముందు ఉన్న సమస్యలను తగ్గించుకొని ఈరోజు అన్యోన్యంగా ఉంటారు. ఇంతకు ముందున్న బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో మంచి అనుకూలత లభించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈరోజు మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేయాలి అను ఉంటారు. ఈరోజు రెస్ట్ లేకుండా శ్రమ పడతారు. ఈరోజు శుభవార్తలు వింటారు.

రెమిడీ: కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -7- గురువారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ధైర్యసాహసాలకు దూరంగా ఉంటారు. ఈరోజు అయిన వారిని అనవసరంగా కోప్పడి దూరం చేసుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు స్త్రీలు మనోవేదనకు గురవుతారు.

రెమిడీ: ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!