NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope జూలై 3 శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు దీర్ఘకాలక ప్రయోజనాల కోసం పొదుపు చేయండి !

పనిచేసే చోట, సీనియర్ల నుండి వత్తిడి, ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంత వరకు వత్తిడిని కలిగించవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, మదుపు చెయ్యడం అవసరం. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగ పరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకొండి. లేకుంటే, మోసపోతారు. ఆఫీసులో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈరాశికి చెందినవారు వారి ఖాళీ సమయములో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిపోవచ్చు.

రెమిడీ: కుటుంబం సంక్షేమం, ఆనందం పెంచడానికి కుటుంబంలో దురలవాట్లను మానుకోండి. సూర్య ఆరాధన చేయండి.

 

వృషభ రాశి : ఈరోజు మీ వాలెట్‌ జాగ్రత్త !

మీ వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరు చుకొనవలెను. మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్ట్ లను పూర్తిచేసి ఇంకా క్రొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. స్నేహితుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. పరులమాట విని ఇంట్లో వాదాలకు దిగకండి.

రెమిడీ: ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు పచ్చకర్పూరంతో చేసిన పొంగలి నైవేద్యాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామికి సమర్పించండి.

 

మిథున రాశి : ఈరోజు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు !

మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. అనుభవజ్ఞులను కలుస్తారు, వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారుచెప్పేది వినండి. ఏదిఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు.

రెమిడీ:  ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

కర్కాటక రాశి : ఈరోజు విద్యార్థులు సమయాన్ని వృథా చేయకండి !

మీ సందేహ స్వభావం, ఓటమిని చూపుతుంది. ఈరోజు మీ తల్లితండ్రులు మీ విలాస వంతమైన జీవితం, ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి కోపానికి గురి అవుతారు. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథా న్ని కలిగి ఉండండి. మీ స్థిరనిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి ఈరాశిలో ఉన్నవిద్యార్థులు ఈరోజుమొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

రెమిడీ: ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జయమంగళాదేవిని ఆరాధించండి.

 

సింహ రాశి : ఈరోజు మీ సంతానం వల్ల సంతోషం !

బిడ్డ లేదా వృద్ధుల ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవతంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన కలగించవచ్చును. ఈరోజు ఈరాశిలో ఉన్న వారికి వారి సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీసంతానమును చూసి మీరు గర్వపడతారు. వ్యక్తిగతమూ, విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి. మీకు తెలిసిన మహిళల ద్వారా, మీకు పనికోసం అవకాశాలు వస్తాయి. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీసావసరాలు. వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.

రెమిడీ: పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందించండి.

 

కన్యా రాశి : ఈరోజు ధననష్టం సంభవించే అవకాశం జాగ్రత్త !

మీకు ఈరోజు ధననష్టం సంభవించవచ్చును, కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి, ఈ సమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. స్వల్ప కాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. మీ హాస్య చతురత మీ కుగల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.

రెమిడీ: బాలికలు, మహిళలు చంద్రుని పరిపాలన కిందకు వస్తారు. వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి. ప్రేమ జీవితం మృదువుగా చేయడానికి మీ స్నేహితురాలిని గౌరవించండి.

 

తులా రాశి : ఈరోజు ఆరోగ్యవంతంగా ఉంటారు !

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. గ్రహరీత్యా పదవీ ఉన్నతి కలగే అవకాశాలున్నాయి. మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందానిస్తుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నరు.

రెమిడీ:  మీరు రాగికడియాన్ని ధరించండి. కుటుంబ ఆనందాన్ని పొందడానికి ధరించండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు నిగ్రహాన్ని కోల్పోకండి !

మీ సృజనాత్మకత నైపుణ్యాలు, సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీ యమైన రాబడి నిస్తాయి. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

రెమిడీ: మీరు ఆనందకరమైన, శాంతియుత కుటుంబ జీవితాన్ని పొందడానికి లక్ష్మీ అష్టోతరాన్ని సాయంకాలం దీపారాధన చేసి పారాయణం చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి !

మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు క్రొత్తవారు కూడా పరిచయస్థులలాగ అనిపించే రోజు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవితభాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి. మీరుచేసిన పనికి వేరొకరు పేరుపెట్టేసుకోవడం జరగవచ్చును. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. రెమిడీ: పని చేయడానికి ముందు మీ నుదుటిపై చందనం లేదా కుంకుమ వర్తింపచేయండి.

 

మకర రాశి : ఈరోజు ఆర్థికలాభాలు వస్తాయి !

ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీరింత వరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

రెమిడీ: వ్యాపార విస్తరణ మరియు వృత్తి పురోగతి కోసం అష్టమూలికలను మీ క్యాష్‌ కౌంటర్‌లో ఉంచుకోండి. లేదా ఇంటిలో ౩ నిమ్మకాయలను దేవుడి దగ్గర పెట్టండి.

 

కుంభ రాశి : ఈరోజు అనుకోని అతిథులు రాక !

ఎవరైనా పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు. వీరి అదృష్టము మీరు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. ఐటి వృత్తిలోని వారికి, వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉన్నది. మీరు ఇతరులతోకలిసి గోషిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ పూర్తి సమయాన్ని వృధా చేస్తుది.

రెమిడీ: వ్యాధులు, లోపాలను వదిలించుకోవడానికి 15 – 20 నిముషాలు (ఉదయాన్నే) రోజూ సూర్యకాంతి లో నమస్కారాలు, సూర్యప్రార్థన చేయండి.

 

మీన రాశి : ఈరోజు తగినంత ధనాన్ని పొదుపు చేస్తారు !

ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూ చివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. జాగ్రత్తగా మసులుకోవలసిన రోజు. మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.

రెమిడీ: ఆరోగ్యవంతమైన జీవనశైలిని సాధించేందుకు శ్రీచక్రాన్ని పూజించండి. లేదా మనస్సుతో భావన చేసి లలితాదేవి ప్రార్థన చేయండి.

author avatar
Sree matha

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju