NewsOrbit
Featured దైవం న్యూస్

Daily Horoscope జూన్‌ 29 సోమవారం మీ రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు విపరీతంగా ఖర్చులు !

ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఎదురుకుంటారు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను, టెన్షన్ లేకుండాను ఉండడానికి ప్రయత్నించండి. మీ తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వలన మీరు ఏమి పోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. అనవసర వివాదాలు రావచ్చు.. జాగ్రత్త.

రెమిడీ: కుటుంబజీవితం సంతోషంగా ఉండటానికి నిత్యం శ్రీసూక్తపారాయణం చేయండి.

వృషభ రాశి : ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి !

పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందండి. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్ధిక సహాయము చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. మీరు ఏదైనా నిర్ణయము తీసుకునేముందు అన్నిఆలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది. కానీ, ఎక్కువగా ఇంటిపనుల కొరకు సమయాన్ని కేటాయిం చవల్సి ఉంటుంది. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం.

రెమిడీ: శివకవచం పారాయణం మంచి ఫలితాలు వస్తాయి.

 

మిథున రాశి : ఈరోజు అధిక మొత్తంలో ఖర్చులు పెడుతారు !

కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. పనిచేసే చోట మీ తెలివి తేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర, ముఖ్యంకాని పనుల కోసము సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చుచేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు.

రెమిడీ: వృత్తి జీవితం అభివృద్ధి కోసం శ్రీలక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

 

కర్కాటక రాశి : ఈరోజు మీ సంతానం వల్ల సంతోషం !

ధనాన్ని పిల్లల చదువు కోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోష కారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన, ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు. అది మీకు అసౌకర్యంగా అన్పించవచ్చు.

రెమిడీ: ఆర్థిక ప్రయోజనాలు బాగుండటానికి శ్రీ సూక్త పారాయణం చేయండి.

 

సింహ రాశి : ఈరోజు ఆరోగ్యం  బాగుంటుంది !

ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించు కోగలుగుతారు. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈరోజు మీ ఆరోగ్యము బాగుంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

రెమిడీ: మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం శ్రీ లక్ష్మీగణపతి పారాయణం చేయండి.

 

కన్యా రాశి : ఈరోజు లావాదేవీలు జాగ్రత్తగా చేయండి !

మీకు ఈరోజు ధననష్టం సంభవించవచ్చును, కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. దూరపుబంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈరాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ చాలా సమస్యలు తొలగబడతాయి.

రెమిడీ: శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

 

తులా రాశి : ఈరోజు రెండో భాగంలో విశ్రాంతి దొరుకుతుంది !

మీదగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు రిలాక్స్ అయేలాగ సరియైన మంచి మూడ్లో ఉంటారు. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్ధికంగా బాగుంటారు. పని వత్తిడి వలన మానసిక శ్రమ కలుగుతుంది. రోజు రెండవభాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.

రెమిడీ: ఆర్థిక జీవితం మంచిగా ఉండటానికి ఇష్టదేవతారాధన చేయండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు కొత్త క్లయింట్లతో చర్చించండి !

చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలసి బయటకు వెళతారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

రెమిడీ: మంచి ఆరోగ్యానికి హనుమాన్‌ చాలీసాను పారాయణం చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు !

ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవితభాగస్వామితో కలసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీనిఫలితంగా మీకు ఆర్ధికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. సంతోషం నిండిన ఒక మంచిరోజు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.

రెమిడీ: ఆదాయంలో అభివృద్ధి కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

 

మకర రాశి : ఈరోజు పొదుపు చేయండి !

మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారిసలహాలు మీకు చాలావరకు మీ ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. మీరు క్రొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ సమయమును ఖర్చుచేస్తుంది.

రెమిడీ: మీ ఆర్థిక స్థితిలో అభివృద్ధి కోసం శివుడిని మారేడుదళాలతో ఆరాధన చేయండి.

 

కుంభ రాశి : ఈరోజు పాత ఒప్పందం వల్ల సమస్యలు !

ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు. ఈరాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. ఈ రోజంతా వత్తిడి సందిగ్ధత మిగిలే రోజు. ఒకదానిని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.

రెమిడీ:  అనుకూల ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీ లక్ష్మీస్తోత్రం పారాయణం చేయండి.

 

మీన రాశి : ఈరోజు ఆర్థికలాభాలు  !

సానుకూల దృక్పథంతో  ఉండాలి. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీ కుటుంబం కోసం కష్టపడి పని చెయ్యండి. మీకు తెలిసిన మహిళల ద్వారా, మీకు పని అవకాశాలు వస్తాయి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు సంతోషం కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా ఉంటారు.

రెమిడీ: మంచి ఆరోగ్యాన్ని పొందడానికి శివాభిషేకం చేయండి.

author avatar
Sree matha

Related posts

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju