NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope నవంబర్ 11th బుధవారం రాశి ఫలాలు

Daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టండి !

అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసం లేదు. మీరు కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే, సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో, మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు.
రెమిడీ: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం శివాష్టోతరం చదవండి.

Daily horoscope in telugu

వృషభ రాశి : ఈరోజు కుటుంబం కోసం సమయం కేటాయించండి !

మీరు ఎక్కడ ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని, దానికి తగట్టుగా వ్యహరించాలి లేనిచో భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. స్నేహితులు, దగ్గరివారు, మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. రోజూ చివర్లో మీరు మీకుటుంబానికి సమయము కేటాయించాలి అని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరి వారితో వాగ్వివాదానికి దిగటము వలన మీ మూడ్ మొత్తము పాడవుతుంది. షాపింగ్‌ విషయంలో ఇంట్లో ప్రతికూల వాతావరణం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం.
రెమిడీ: మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి శ్రీలలితా సహస్రనామ పారాయణం చేయండి.

మిథున రాశి : ఈరోజు యోగాతో ప్రారంభించండి !

మీరు యోగాతో, ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీ సంతానము పట్ల తగిన శ్రద్ద తీసుకోండి. ఏందుకంటె వారు అనారోగ్యము బారినపడే అవకాశము ఉన్నది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. ఈరోజు, సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
రెమిడీ: మంచి ఆర్థిక జీవితం కోసం, గణపతి మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

కర్కాటక రాశి : ఈరోజు పనుల వల్ల ఒత్తిడి కలగవచ్చు !

మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచు కోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం కలసి వస్తుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. పని, విభేదాలు కొంత వత్తిడిని కలగచేస్తాయి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువుల మీద ఖర్చుచేస్తారు.
రెమిడీ: ఆరోగ్యం కోసం సూర్యాష్టకం చదవండి. సూర్యనమస్కారాలు చేయండి.

సింహ రాశి : ఈరోజు కుటుంబంలో ధన సమస్యలు !

అవసరమైన ధనములేకపోవటం కుటుంబలో అసమ్మతికి కారణము అవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీకుటుంబ సభ్యలతో మాట్లాడి వారి సలహాలను తీసుకోండి. ఈరోజు మీ ఆరోగ్యము బాగుంటుంది. అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు. ఎదుటివారిని ఒప్పుకునేలా చేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. దూరప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చు.
రెమిడీ: ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

కన్యా రాశి : ఈరోజు ధనం అనవసరంగా ఖర్చు పెట్టకండి !

మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ శ్రమ ప్రశంసించబడుతుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతివ్రేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే, అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము.కానీ, అతిగా ఆడటంవలన మీ చదువుల మీద ప్రభావము చూపుతాయి. మంచి ఆహారం స్వీకరిస్తారు.
రెమిడీ: వ్యాపారంలో లేదా పని జీవితంలో వృద్ధి కోసం ఇష్టదేవతరాధన చేయండి.

తులా రాశి : ఈరోజు నైపుణ్యాలను పెంపొందించుకోండి !

ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. స్నేహితులతో- బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యహారంలో మీ స్వలాభం కూడా చూసుకొండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. పనిలో అన్ని విషయాలూ ఈ రోజు సానుకూలంగా కన్పిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది.
రెమిడీ: మంచి కుటుంబ జీవితం ఆనందంగా ఉండటానికి ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు రెండో భాగంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది !

రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సమస్యలను మరచి, మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడ గట్టాల్సిన అవసరం ఉన్నది. మీలో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. ఈరోజు, మీకుటుంబ సభ్యులతో కూర్చుని మీరు జీవితంలోని ముఖ్యవిషయాల గురించి చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి. కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు..
రెమిడీ: సంతోషకరమైన వాతావరణాన్ని పెంచుకోవడానికి సంతోషిమాతా పూజ చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి !

చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీ తెలివి తేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకొండి. అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయ వచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
రెమిడీ: శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి దీనివల్ల ధనాభివృద్ధి కలుగుతుంది.

మకర రాశి : ఈరోజు ఎదురుచూడని లాభాలు వస్తాయి !

ఆరోగ్య విషయాలు జాగ్రత్త. ఆఫీసులో సహోద్యుగులు మీకు పూర్తిగా సహకారం అందిస్తారు. అనుకోని ప్రదేశం నుంచి మీకు శుభవార్త వస్తుంది. అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. ఈరాశికి చెందినవారు వారి ఖాళీ సమయములో సమస్యలకు తగిన పరిష్కారము ఆలోచిస్తారు. బంధువులతో ముచ్చట్లు, స్నేహితుల కలయిక జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
రెమిడీ: శారీరక ఆరోగ్యం కోసం నిత్యం ఆవునెయ్యితో శివుడి దగ్గర దీపారాధన చేయండి.

కుంభ రాశి : ఈరోజు పొదుపు చేయడం ప్రారంభించండి !

పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి. ఈరోజు మీ తల్లితండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఏదురుకుంటారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈరాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
రెమిడీ: గోధూళి వేళలో శివారాధన చేయండి మంచి ఆరోగ్యం లభిస్తుంది.

మీన రాశి : ఈరోజు చదువుపట్ల శ్రద్ధను పెట్టండి !

మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి, త్వరగా నిర్ణయాలు తీసుకొండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్దచూపించటం కఠినము అవుతుంది. స్నేహితులతో కలిసి మీవిలువైన సమయాన్ని వృధాచేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు.
రెమిడీ: కుటుంబంలో ఆనందం కోసం శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి.

 

author avatar
Sree matha

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!