NewsOrbit
Featured దైవం

పంచామృతం అంటే ఏమిటి ?

సాధారణంగా అభిషేకాలు, పూజలు, అయ్యప్య మాల దీక్ష సమయంలో ఎక్కువగా ఉపయోగించే పదం పంచామృతం. అసలు పంచామృతం అంటే ఏమిటి? దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం..

పంచామృతం అంటే…. పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.ఆవు పాలు.. ఆవును  గోమాత  అన్నారు.  ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.

పెరుగు.. పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది.నెయ్యి.. మేధాశక్తిని పెంచటంలో నేతిని  మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.

Pride of Palani Temple from Tamil Nadu, 'Panchamirtham' receives GI tag -  NewsBharati

తేనె… వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

 ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది.అదండి సంగతి పరమ ఔషద గుణాలు ఉన్న పదార్థాల శక్తిని మనకు అందించడానికి పెద్దలు పెట్టిన ఆచారం పంచామృతం. వీలు ఉన్నప్పుడల్లా పంచామృతాభిషేకం చేయండి. స్వామి తీర్దాన్ని సేవించి ఆరోగ్యాన్ని పొందండి. దీన్ని మించిన ఐశ్వర్యం మరేది ఉంటుంది.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju