కార్తీకమాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. కార్తీకంలో స్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది.
ఇక ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలి తులసి కోటలో దీపం పెట్టాలి, ఉదయం సూర్యోదయానికి ముందు పెట్టె దీపాలు విష్ణు మూర్తికి చేందుతుంది, సంధ్యకాలం ఆరు పైన పెట్టే దీపాలు శివయ్యకు చేందుతాయి అని పెద్దలు అంటారు. అఖండ దీపారాధన చేసే వాళ్లకు ఈ మాసం చాలా విశేషం. ఇక దానాలు, ధర్మాలు తప్పనిసరిగా ఎవరి శక్తి అనుసారం వారు చేయాలి. పేదలకు, వికలాంగులకు, గోసేవ ఇలా అనేకరకాలుగా సేవ చేయాలి. దీనివల్ల భగవంతుడు సంతోషం చెందడమే కాదు తప్పక మీకు మంచి చేస్తాడు. ఇక వీలుంటే ఉపవాసం, శివక్షేత్రాల సందర్భన, అన్నదానం వంటివి చేయాలి.