NewsOrbit
Featured దైవం

గోమాతను ఎందుకు పూజిస్తారు ?

గోవు.. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జంతువు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోవును అందరూ పూజిస్తారు. గోవును ఎందుకు పూజిస్తారు దాని వెనుక విశేషాలు తెలుసుకుందాం..

Why is Gomata worshiped
Why is Gomata worshiped

ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించి పోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూవస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు ఉన్నారు.

గోమాత నోటిలో లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు.

ఇక ఇప్పటి సైన్స్‌ ప్రకారం చూసినా గోవుకు సంబంధించి ప్రతీ పదార్థాం ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది. గోపేడ.. ఎరువుగా, క్రిమిసంహారిగా, కీటకనాశినిగా ఉపయోగపడుతుంది. గోమూత్రం అనేక జీర్ణ సంబంధ రోగాలు, క్యాన్సర్‌ వంటి వాటిని రాకుండా కాపాడుతుంది. అదేకాకుండా గోవు పాలు తల్లిపాల తర్వాత అవే బలమైనవి, రోగనివారణకు రక్షణగా నిలుస్తాయి. గోపెరుగు, ఆవునెయ్యి అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని తేలింది.

ఇక ఆవుపేడతో తయారుచేసిన పిడకలను నెయ్యివేసి కాలుస్తే కాలుష్యనివారణ అని రుజువు అయ్యింది. ఇలా అనేక రకాలుగా గోవు ఉపయోగపడుతుందని నిరూపించబడింది. దీన్ని పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కాబట్టే మన పూర్వీకులు దీన్ని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు.

author avatar
Sree matha

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju