Why Radha Married Ayan: రాధా కృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్ధమైన మరియు మరణంలేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు, విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా, లక్ష్మి దేవత అవతారంగా రాధ జన్మించింది అని చెబుతుంటారు. శ్రీకృష్ణుడిని అంతగా అరాధించి ప్రేమించిన రాధ కృష్ణుడిని వివాహం చేసుకోకుండా అయాన్ (అభిమన్యు)ను ఎందుకు వివాహం చేసుకుంది అనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి.
Why Radha Married Ayan: రాధ అయాన్ ని ఎందుకు వివాహం చేసుకుంది?
రాధ భర్త పేరు అభిమన్యు. ఆయాన్ గా పిలుస్తూ ఉంటారు. ఆయాన్, రాధల కథ ఎక్కువగా జానపద కూర్పుల్లో కనిపిస్తుంది. అభిమన్యు కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కసిన్ సోదరుడు. అతను గోకుల్ సమీపంలోని జరత్ అనే గ్రామంలో నివసించాడు. అతని తల్లి పేరు గోలా, మరియు తల్లి జటిలా. అభిమన్యు పాల వ్యాపారం చేసే వాడు, గొప్ప కాళీ భక్తుడు. అతనికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండేది కాదు. రాధతో అతని వివాహాన్ని కృష్ణుడి పెంపుడు తండ్రి నంద నిర్వహించారు. చాాల జానపద కథల్లో అభిమన్యు నపుంసకుడిగా చిత్రీకరించారు.

రాధ అయాన్ (అభిమన్యు)ని ఎందుకు వివాహం చేసుకుంది? Why Radha and Krishna Not Married?
అయితే లక్ష్మీదేవి అవతారం మరియు విష్ణుమూర్తి (నారాయణుడు) శాశ్వత సహచరురాలు అయిన రాధ ఆయాన్ (అభిమన్యు) వంటి నపుంసకుడిని ఎందుకు వివాహం చేసుకుంది అనే దానికి మరొక కథ ప్రచారంలో ఉంది. అభిమన్యు గత జన్మలో లక్ష్మిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు. దానికి నారాయణుడు ఒప్పుకోలేదు.. దీంతో అభిమన్యు తన తప్పస్సును మరింత కఠినం చేసి తనకు తాను అగ్నివలయంలో ఉంచుకున్నాడు. ఈ సారి నారాయణుడు స్పందించకుండా ఉండలేకపోయాడు. ఆయన తపస్సుకు మెచ్చి సరే. ద్వాపర యుగంలో నా కృష్ణ అవతారంలో నీకు లక్ష్మి భార్యగా లభిస్తుంది. లక్ష్మి రాధగా అవతరిస్తుంది. ఆ సమయంలో, మీరు అయాన్ అని పిలుస్తారు. రాధ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కానీ మీరు అప్పుడు నపుంసకులు అవుతారు అని వరం ఇచ్చాడుట నారాయణుడు. .
అందుకే అయాన్‌ను రాధ వివాహం చేసుకుంది. కానీ వారి మధ్య భార్యభర్తల సంబంధం లేదు. ఎందుకంటే రాధ మనస్సు కృష్ణునిలో లీనమైపోయి ఉంది. ఆమె కృష్ణుని శాశ్వత ప్రేమికుడు. రాధా, కృష్ణుల ప్రేమ సంగతి అందరికీ తెలిసిందే.