NewsOrbit
5th ఎస్టేట్

నష్టాల ఊబిలో ప్రభుత్వాలు – గట్టెక్కే దిక్కు ఇదే?

sample 5 కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులకు తాకిడి మించుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వరకు పర్వలేదు. కానీ ఇది కరోనా. అసలు ఆగే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలి. మందులు ఉంచాలి. పరికరాలు పెంచాలి. వసతులు, పరుపులు, సిబ్బంది, పారిశుద్ధ్యం… ఒకటేమిటి అన్నీ చూసుకోవాలి. వీటికి ఆర్థికం కావాలి. ఓ వైపు రావాల్సిన ఆదాయం రాదు. మరోవైపు ఆరోగ్య వసతుల కల్పనకు అదనపు కార్చులూ ఉన్నాయి. అందుకే దాతృత్వానికి వేళయ్యింది.ఖజానాకు రూ. 15 వేల కోట్ల నష్టం…!రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం లేదు. మద్యం అమ్మకాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. రెవెన్యూ ఆదాయం లేదు. ఏ రకంగానూ ఖజానాకు జమలు రావట్లేదు. రాష్ట్ర ఆదాయ మార్గాల్లో ప్రధానమైన పన్నుల వసూలు, మద్యం, రిజిస్ట్రేషన్లు అన్నీ ఆగిపోయాయి. అందుకే ఈ 21 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ. 15 వేల కోట్లు కోల్పోనుంది. అందుకే ఇప్పుడు తక్షణ సాయం అందించాలి. అందుకే దాతృత్వానికి వేళయింది. పెద్దలు స్పందించాల్సిన సమయం వచ్చింది. కేవలం ఈ 21 రోజులతో ఆగితే 15 వేల కోట్లతో ఆగుతుంది. లేకుంటే ఖజానాకు నష్టం పెరుగుతుంది. అసలే ఆర్ధిక మాంద్యంలో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఇది కోలుకోలేని దెబ్బగా మిగులుతుంది.సినీ, కార్పొరేట్ దిగ్గజాలున్నాయిగా…!కరోనా నుండి తెరుకునేందుకు ఆర్థిక సాయం అందించడంలో ముందుగా సినీ హీరో నితిన్ ముందడుగు వేశారు. రెండు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు చొప్పున ప్రకటించారు. వెంటనే అందించారు కూడా. తర్వాతే టీడీపీ అధినేత చంద్రబాబు రూ. 10 లక్షలతో పాటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల వేతనం ప్రకటించారు. అంటే దాదాపు రూ. 70 లక్షలు టీడీపీ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి అందనుంది. దీనికి పర్యవసానంగా వైసీపీ ఎమ్మెల్యేలు 150 మంది తమ ఒక నెల వేతనం, 20 మంది ఎంపీలు నెల వేతనం ప్రకటించారు. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఈ రూపంలో అందనుంది. ఇక సినీ పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ ఇరు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ప్రకటించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రకటించారు. ఇలా సినీ, రాజకీయ విభాగాల నుండి దాతృత్వం పొంగుతుంది. కానీ కార్పొరేట్, సినీ దిగ్గజాల నుండి ఏ మాత్రం వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నర్ధకం. దేశం, రాష్ట్రం అల్లాడుతున్న ఆ తరుణంలో స్పందించి సాయం అందిస్తేనే వైద్య సేవలు మెరుగయ్యేది. 

author avatar
Siva Prasad

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment